భర్త మీద చేతబడి చేయించిన భార్య

ఇప్పటికీ కూడా చాలా చోట్ల చేతబడి లాంటి కొన్ని కార్యక్రమాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేసి తన భర్త ప్రాణాలు తీయాలని చూసిందే భార్య. ఈ క్రమంలోనే భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు తన భార్యను ఇతర సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి: పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, తన శారీరక మరియు మానసిక బలహీనతలను తగ్గిస్తాను అని […]

Share:

ఇప్పటికీ కూడా చాలా చోట్ల చేతబడి లాంటి కొన్ని కార్యక్రమాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేసి తన భర్త ప్రాణాలు తీయాలని చూసిందే భార్య. ఈ క్రమంలోనే భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు తన భార్యను ఇతర సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, తన శారీరక మరియు మానసిక బలహీనతలను తగ్గిస్తాను అని మాయ మాటలు చెప్పి, తాను తీసుకుంటున్న ఆహారంలో విష మూలికలను కలిపారని దాదర్ ఈస్ట్‌కు చెందిన 56 ఏళ్ల నగల వ్యాపారి, తన భార్య మరియు ఆమె తోబుట్టువులపై ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన భార్య తన తల్లితో కలిసి కరోనా సమయంలో కూడా ఇలాంటి చేతబడులు లాంటి ప్రయత్నాలు చేసిందని వాపోయాడు.

సోమెన్ రాయ్ అనే వ్యక్తి, అతని భార్య ప్రక్తి రాయ్ తమ బ్యాంక్ లాకర్ నుండి 2 కిలోల బంగారాన్ని విత్‌డ్రా చేసి, ఇంటి నుండి ₹ 25 లక్షల నగదును దొంగిలించిందని కూడా పోలీస్ కేసులో పేర్కొన్నాడు.

ఆమె ఎందుకిలా చేసింది: 

1989లో సోమెన్ ప్రకృతిని వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే గత 15-20 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య కొన్ని వివాదాలు జరుగుతున్నాయి.

2018లో, అతని భార్య ప్రకృతి, భార్య సోదరి పాపియా బర్మన్ మరియు సోదరుడు సుబ్రా రాయ్ కలిసి, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన తాంత్రికును సంప్రదించినట్లుగా, అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏదో కొన్ని విషపూరితమైన పదార్థాలు కొంటున్నారని, సోమెన్కి తన భార్య బంధువు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వారి కొంటున్న పదార్థాలు ఆహారంలో కలిపి ఎవరైతే తీసుకుంటారో, వారి ఆరోగ్యం క్షీణించి మెల్లమెల్లగా చనిపోవడం జరుగుతుంది.

అంతేకాకుండా, ప్రకృతి బంధువు ఎవరైతే సోమెన్కు అసలు విషయం చెప్పారో, ఆమె ప్రకృతితో మాట్లాడిన రికార్డింగ్ కూడా సోమెన్కు షేర్ చేయడం జరిగింది. అప్పటి నుండి, అతను తన కోసం వంట చేసుకోవడం ప్రారంభించాడు. 2020లో, అతని భార్య ప్రకృతి తన ఆహారాన్ని వండుకోవడానికి వంటగదిలో అతనికి స్థలం ఇవ్వడం కూడా మానేసింది, అప్పటినుంచి అతను దాదర్ ఈస్ట్‌లోని అద్దె అపార్ట్మెంట్కు మారాడు. 

సెప్టెంబర్ 2020లో, అనుకోకుండా అతనికి ఆరోగ్యం పాడైనట్లు అనిపించడంతో, సోమెన్ డాక్టర్ని సంప్రదించగా, అతని శరీరంలో ఇన్ఫెక్షన్ అయిందని తెలిసింది. ఆ తర్వాత అతన్ని బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అతని రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల అతను క్రమం తప్పకుండా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని డాక్టర్ చెప్పారని సోమెన్ పోలీసులకు చెప్పాడు. 

అయితే తన ఆరోగ్యం క్షీణించడానికి కేవలం తన భార్య ఆహారంలో కలిపిన పదార్థాలే కారణమని గుర్తు చేసుకున్నాడు.. అంతేకాకుండా ప్రకృతి బంధువు ఏదైతే చెప్పిందో అదే నిజమని నమ్మవలసి వచ్చింది సోమెన్. ఈ క్రమంలోనే తన భార్య మీద అనుమానం ఇంకాస్త పెరిగింది. తన భార్య చేసిన ఒక్కొక్క పని తెలుసుకుంటూ వచ్చాడు.

ఈ క్రమంలోనే బ్యాంకులలో తన లోకర్ ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు. తన భార్యతో కలిసి తీసుకున్న జాయింట్‌ అకౌంట్‌లో ఉన్న 2 కిలోల బంగారాన్ని భార్య విత్‌డ్రా చేసినట్లు తెలిసింది. భార్య కూడా వారి ఇంటి నుండి సుమారు ₹ 25 లక్షల నగదు తీసుకొని తన సోదరుడు మరియు ఆమె సోదరికి ఇచ్చింది అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే ఇది పకడ్బందీ ప్లాన్ ప్రకారం ప్రకృతి భర్త సోమెన్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బ్లాక్ మ్యాజిక్ చట్టం, 2013 యొక్క సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరాన్ని నమోదు చేసి విచారిస్తున్నామని RAK మార్గ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహదేవ్ నింబాల్కర్ తెలిపారు.