నూహ్‌ అల్లర్ల వెనక ఎవరో ఉన్నారు..! 

అయితే హర్యానా ప్రాంతం నూహ్‌ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి హర్యానా మినిస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా ఎవరో చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అల్లర్ల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో లారీలు ఉన్నాయని, అవి ఎవరికైనా ఉచితంగా పంచే వస్తువుల.. అని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీసుల మీదకే, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కాల్పులు జరపడానికి, వారికి ఎవరో ప్లాన్ చేసి మరి తుపాకీలు అందించారని, కావాలనే ఇటువంటి హింసకు పాల్పడుతున్నారని […]

Share:

అయితే హర్యానా ప్రాంతం నూహ్‌ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి హర్యానా మినిస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా ఎవరో చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అల్లర్ల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో లారీలు ఉన్నాయని, అవి ఎవరికైనా ఉచితంగా పంచే వస్తువుల.. అని ప్రశ్నించారు. అదేవిధంగా పోలీసుల మీదకే, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కాల్పులు జరపడానికి, వారికి ఎవరో ప్లాన్ చేసి మరి తుపాకీలు అందించారని, కావాలనే ఇటువంటి హింసకు పాల్పడుతున్నారని ఆయన అనుమానాన్ని బయటపెట్టారు.

నూహ్‌ లో ప్రస్తుతం చెలరేగిన హింసకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయితే సుమారు 200 మందితో కూడిన ఒక ఊరేగింపు, నూహ్‌ పట్టణంలోని ఎడ్వర్డ్ చౌక్ నుండి ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత హింస ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. చెలరేగిన హింస కారణంగా చాలా మంది చనిపోగా మరి ఎంతో మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఒకపక్క మణిపూర్లో హింస జరుగుతున్న క్రమంలో, హర్యానాలో చేలోరేగిన హింస భారతదేశాన్ని ఆలోచింపచేస్తుంది.

పోలీసులను వదిలిపెట్టలేదు: 

హింస జరుగుతున్న క్రమంలోనే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (హోడల్) సజ్జన్ దలాల్ తలపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన, గాయపడిన మరొక గురుగ్రామ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అతని కడుపులో బుల్లెట్ గాయం కూడా ఉందని పోలీసు అధికారి తెలిపారు.

ముస్లింలు అధికంగా ఉండే నహ్‌లో ఘర్షణ వార్త ఒక్కసారిగా అందరికీ తెలియడంతో, గురుగ్రామ్‌లోని సోహ్నాలో, చాలామందితో కూడిన గుంపులు కొన్ని ఏర్పాటయ్యి పోలీసుల మీదకు, కొంతమంది జనం మీదకి రాళ్లు రువ్వారు. ఒక వర్గం వారికి చెందిన నాలుగు వాహనాలు అంతేకాకుండా దుకాణాన్ని తగులబెట్టారు మరొక వర్గం వారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో, అక్కడ పరిసరాల ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. అంతేకాకుండా అక్కడ రోడ్లన్నీ రాళ్లతోనీ, రక్తంతో నిండింది.

నూహ్‌ హింసకు కారణాలు ఏమిటి?: 

దాదాపు 200 మందితో కూడిన ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు నూహ్‌ పట్టణంలోని ఎడ్వర్డ్ చౌక్ నుండి ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత హింస ప్రారంభమైందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ బృందం ప్రధాన రహదారిపై వెళ్తున్న క్రమంలో, మరొక వర్గానికి చెందిన కొన్ని గుంపులు రాళ్లతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందువుల వర్గానికి చెందిన కొన్ని గుంపులు మొదట తప్పించుకునే పారిపోయినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ గుమిగూడి ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసు వారు వెల్లడించారు.

ఫిబ్రవరిలో భివానీ జిల్లాలో, కాలిపోయి, మృతదేహాలుగా కనిపించిన ఇద్దరు ముస్లింల హత్య కేసులో, నిందితులుగా పరిగణలోకి తీసుకున్న, బజరంగ్ దళ్ సభ్యుడు ఒకరు అంతేకాకుండా గోసంరక్షకుడు మోను మనేసర్ కూడా, ప్రస్తుతం ఆ రోజున జరిగిన ఊరేగింపులో పాల్గొంటారు అని తెలిసిన క్రమంలో హింస చలారేగడానికి కారణమని ఒక అధికారి తెలిపారు. 

మరోవైపు, ఒక వర్గానికి చెందిన ఊరేగింపులో ప్రజలు రెచ్చగొట్టే నినాదాలు చేశారని, నూహ్‌లోని పున్హానా పరిసర నివాసి నసీర్ అహ్మద్ ఆరోపించారు. ఫిరోజ్‌పూర్ జిర్కా నివాసి ఇక్బాల్ ఖాన్, ఊరేగింపులో ఉన్న వ్యక్తులు మొదట, అటువైపుగా నడుస్తున్న కొంతమంది మీద దాడి చేశారని ఆరోపించారు. 

ఇదిలా ఉండాగా, ఇది నిజంగా ఎవరో చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అల్లర్ల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో లారీలు ఉన్నాయని, అవి ఎవరికైనా ఉచితంగా పంచే వస్తువుల.. అని ప్రశ్నించారు హర్యానా మినిస్టర్. అదేవిధంగా పోలీసుల మీదకే, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కాల్పులు జరపడానికి, వారికి ఎవరో ప్లాన్ చేసి మరి తుపాకీలు అందించారని, కావాలనే ఇటువంటి హింసకు పాల్పడుతున్నారని ఆయన అనుమానాన్ని బయటపెట్టారు.