Gift: ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న దీపావళి PF బహుమతి

Gift: దీపావళి (Diwali)కి, దసరాకి చాలామంది తమ ఉద్యోగుల (Employees)కు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి (Diwali)కి తమ ఉద్యోగుల (Employees) కళ్ళల్లో ఆనందం చూడడానికి చాలామంది కంపెనీ (Company) వాళ్ళు తమ ఉద్యోగుల (Employees) కోసం కొన్ని సర్ప్రైజ్లు, బహుమతులు (Gift) అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగుల (Employees) కోసం, ప్రభుత్వం ఉద్యోగుల (Employees) ఖాతాల్లో PF ఇంట్రెస్ట్ వేయడం మొదలుపెట్టింది.  దీపావళి PF బహుమతి:  ఉద్యోగుల […]

Share:

Gift: దీపావళి (Diwali)కి, దసరాకి చాలామంది తమ ఉద్యోగుల (Employees)కు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపావళి (Diwali)కి తమ ఉద్యోగుల (Employees) కళ్ళల్లో ఆనందం చూడడానికి చాలామంది కంపెనీ (Company) వాళ్ళు తమ ఉద్యోగుల (Employees) కోసం కొన్ని సర్ప్రైజ్లు, బహుమతులు (Gift) అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగుల (Employees) కోసం, ప్రభుత్వం ఉద్యోగుల (Employees) ఖాతాల్లో PF ఇంట్రెస్ట్ వేయడం మొదలుపెట్టింది. 

దీపావళి PF బహుమతి: 

ఉద్యోగుల (Employees) ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వడ్డీని ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలకు జమ చేయడం ప్రారంభించిందని ప్రభుత్వ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF ఖాతా పెట్టుబడిపై వడ్డీ రేటు 8.15%. కొంతమంది వినియోగదారులు ఇప్పటికే వారి ఖాతాలలో వడ్డీ చెల్లింపులను స్వీకరించారు, అయితే ఈ మొత్తం అన్ని ఎకౌంట్లలో ఇంట్రెస్ట్ పడడానికి సమయం పట్టవచ్చని EPFO తెలిపింది. ప్రాసెస్ ప్రస్తుతానికి పైప్‌లైన్‌లో ఉందని.. వడ్డీ అందరి అకౌంట్లో పడతాయని.. వడ్డీలో ఎటువంటి నష్టం ఉండదు. దయచేసి ఓపిక పట్టండి అని EPFO X ద్వారా పేర్కొనడం జరిగింది.

ఇప్పటికే 24 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ అయినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వడ్డీ జమ అయిన తర్వాత, అది వ్యక్తి  PF ఖాతాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే పడినప్పుడు వెంటనే, మొబైల్ మెసేజ్ ద్వారా, మిస్డ్ కాల్, UMANG యాప్ మరియు EPFO వెబ్‌సైట్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఖాతా బ్యాలెన్స్‌ను అనేక మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు. PF వడ్డీ రేటును EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి ప్రతి సంవత్సరం నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరం, వడ్డీ రేటును జూలైలో EPFO ప్రకటించింది. గత సంవత్సరం, EPFO దాని కస్టమర్ల వడ్డీ రేటును 2020-21లో 8.15 శాతం నుండి నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.10 శాతానికి తగ్గించింది. EPF వడ్డీ రేటు 8 శాతంగా ఉన్న 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ. 

దీపావళి బహుమతిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు

పండుగ సీజన్ వచ్చేసింది కాబట్టి, ప్రతి ఒక్కరు కుటుంబసభ్యులు మరియు స్నేహితుల నుండి వేడుకలు జరుపుకోవడానికి మరియు బహుమతులు (Gift) అందుకోవడానికి ఎదురు చూస్తారు. యజమానులు కూడా ఉద్యోగుల (Employees) కోసం బహుమతులు (Gift) అందించడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా, తమిళనాడులోని కోటగిరి పట్టణంలోని ఒక టీ ఎస్టేట్, దీపావళి (Diwali) సందర్భంగా ఉద్యోగుల (Employees) కోసం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. వోచర్‌లు, బోనస్ వంటివి లేదా స్వీట్‌లతో కూడిన సాధారణ బహుమతి (Gift)కి బదులుగా, కంపెనీ (Company) తన ఉద్యోగుల (Employees)కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దీపావళి (Diwali) బోనస్‌గా అందించి ఆశ్చర్యపరిచింది.

190 ఎకరాల సువిశాలమైన టీ ఎస్టేట్ యజమాని పి. శివకుమార్ దీపావళి (Diwali) సందర్భంగా తన ఉద్యోగుల (Employees)కు గృహోపకరణాలు, నగదు బోనస్ వంటి బహుమతులు (Gift) అందించిన చరిత్ర ఉంది. అయితే, ఈ సంవత్సరం, అతను తన ఉద్యోగుల (Employees)కు రూ. 2 లక్షలకు పైగా విలువైన బైక్‌లను బహుమతి (Gift)గా ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు

గత రెండు దశాబ్దాలుగా, టీ ఎస్టేట్‌లో సుమారు 627 మంది అంకితభావంతో పనిచేశారు. నివేదికల ప్రకారం, శివకుమార్ తన తరఫునుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను బహుమతులు (Gift)గా ఇవ్వడానికి.. తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్ మరియు డ్రైవర్‌లతో సహా 15 మంది ఉద్యోగుల (Employees)ను ఎంపిక చేశారు. 

ఇదే విధమైన స్ఫూర్తితో, హర్యానాలోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ (Company) యజమాని గత ఏడాది దీపావళి (Diwali) కానుకగా తన సిబ్బందికి కార్లను బహుమతి (Gift)గా ఇచ్చాడు. మిట్స్‌కార్ట్ ఛైర్మన్ MK భాటియా, ఆఫీస్ అసిస్టెంట్, సరికొత్త టాటా పంచ్ కార్లతో సహా తన పన్నెండు మంది సిబ్బందికి కీలను అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం కంపెనీ (Company)ని స్థాపించినప్పటి నుంచి తనతో పాటు ఉన్న తన ఉద్యోగుల (Employees) అంకితభావం, కృషిని గుర్తించేందుకు ఈ ప్రత్యేక బహుమతి (Gift)ని ఎంచుకున్నట్లు భాటియా పేర్కొన్నారు.