నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం

గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలనీ పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అన్ ఎంప్లాయిమెంట్ అలవెన్స్ హామీని అమల్లోకి తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.  అమలు చేసిన మరిన్ని హామీలు:  ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు పత్తి రుణాలు, ల్యాండ్ పట్టాల […]

Share:

గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలనీ పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అన్ ఎంప్లాయిమెంట్ అలవెన్స్ హామీని అమల్లోకి తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

అమలు చేసిన మరిన్ని హామీలు: 

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు పత్తి రుణాలు, ల్యాండ్ పట్టాల డిస్ట్రిబ్యూషన్, వీఆర్ఏ క్రమబద్ధీకరణ, అంతేకాకుండా ఇటీవల టీఎస్ఆర్ టి సి ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇదే క్రమంలో, గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు నీ కూడా పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అన్ ఎంప్లాయిమెంట్ అలవెన్స్ హామీని అమల్లోకి తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

నెలకు రూ.3,016 నిరుద్యోగ అలవెన్స్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా,  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు యువత, నిరుద్యోగుల మద్దతు లభిస్తుందని బీఆర్‌ఎస్ ఆశాభావం వ్యక్తం చేసింది. బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహ లక్ష్మి పథకాల కోసం కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియల తరహాలో ప్రభుత్వం నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరే అవకాశం ఉంది. 

ఇటీవల ముగిసిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన వద్ద ‘అనేక ఆయుధాలు’ ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, బీసీ బంధు, గృహలక్ష్మి తదితర పథకాలను ప్రస్తావిస్తూ, నిరుద్యోగ అలవెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 

ఇటీవల నిరుద్యోగ అలవెన్స్ గురించి ప్రస్తావించిన కాంగ్రెస్: 

టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ,ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలు నిరుద్యోగులను మోసం చేసి నిరాశకు గురిచేశాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు లేని యువకులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన వాగ్దానం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు. బదులుగా, BRS నాయకత్వం, నిరుద్యోగులకు అందువలసిన వాటిని పక్కన పెట్టి, ప్రస్తుతం రూ. 1 లక్ష లోను పై దృష్టి పెడుతోందని, కాంగ్రెస్ అధికారి పేర్కొన్నాడు.

గత తొమ్మిదేళ్లుగా, యువకుల నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి BRS పరిపాలన ఏమీ చేయలేదని tpcc ప్రతినిధి పేర్కొన్నారు. దళిత బంధు, బీసీలు, మైనారిటీలకు రుణాలు వంటి రుణాల వాగ్దానాలతో బీఆర్‌ఎస్‌ యంత్రాంగం ప్రజలందరి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని.. ఇవి వచ్చే ఎలక్షన్లో కోసం వ్యూహాలు మాత్రమే అన్నారు. కేవలం లక్ష రూపాయల లోను విషయంలో మాత్రమే BRS దృష్టి పెడుతున్నట్లు, నిరుద్యోగుల గురించి అసలు పట్టించుకోవట్లేదు అని కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.

నిజాముద్దీన్ ప్రకారం, 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడానికి 2021లో దళిత బంధు పథకం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదగా ప్రకటించడం జరిగింది. కేవలం 17,000 కంటే తక్కువ కుటుంబాలకు హామీ ఇచ్చిన విధంగా సహాయం అందిందని ఆయన పేర్కొన్నారు.