2024లో మళ్ళీ డీఎంకే అధికార పార్టీ: M.K స్టాలిన్

ప్రస్తుతం ఎక్కడ చూసినప్పటికీ 2024లో రాబోయే ఎలక్షన్స్ గురించి సన్నాహాలు మొదలయ్యాయినట్టే కనిపిస్తున్నాయి. పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న బీజేపీతో ఎలాగైనా తలపడి చావో బతుకో తేల్చుకోవాలంటు.. ఆదివారం నాడు జరిగిన డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ మీటింగులో ఎంకే స్టాలిన్ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, వారి ఎదురుగా ఉన్నా డిస్ట్రిక్ట్ సెక్రటరీలు అలాగే కొంతమంది గొప్ప నాయకులతో స్టాలిన్ 2024 లో ఎలక్షన్స్ గురించి ప్రస్తావించారు. బీజేపీ ఎటువంటిదైనా డీఎంకే పార్టీకి రావలసిన విజయాన్ని అడ్డుకున్న, అడ్డుకోవాలని […]

Share:

ప్రస్తుతం ఎక్కడ చూసినప్పటికీ 2024లో రాబోయే ఎలక్షన్స్ గురించి సన్నాహాలు మొదలయ్యాయినట్టే కనిపిస్తున్నాయి. పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న బీజేపీతో ఎలాగైనా తలపడి చావో బతుకో తేల్చుకోవాలంటు.. ఆదివారం నాడు జరిగిన డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ మీటింగులో ఎంకే స్టాలిన్ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, వారి ఎదురుగా ఉన్నా డిస్ట్రిక్ట్ సెక్రటరీలు అలాగే కొంతమంది గొప్ప నాయకులతో స్టాలిన్ 2024 లో ఎలక్షన్స్ గురించి ప్రస్తావించారు. బీజేపీ ఎటువంటిదైనా డీఎంకే పార్టీకి రావలసిన విజయాన్ని అడ్డుకున్న, అడ్డుకోవాలని చూసినప్పటికీ, మనం గట్టి పోటీ ఇవ్వాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని, విజయం ఎప్పటికైనా మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. 

స్టాలిన్ మాటల్లో: 

వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, వారి ఎదురుగా ఉన్నా డిస్ట్రిక్ట్ సెక్రటరీలు అలాగే కొంతమంది గొప్ప నాయకులతో స్టాలిన్ 2024 లోక్ సభ ఎలక్షన్స్ గురించి ప్రస్తావించారు. బీజేపీ ఎటువంటిదైనా డీఎంకే పార్టీకి రావలసిన విజయాన్ని అడ్డుకున్న, అడ్డుకోవాలని చూసినప్పటికీ, మనం గట్టి పోటీ ఇవ్వాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని, విజయం ఎప్పటికైనా మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. ఇప్పటివరకు డీఎంకే చేస్తున్న మంచి పనులను చూసి బిజెపి ఓర్వలేక ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ, ఈసారి కూడా 2024 ఎలక్షన్స్ లో డీఎంకే తమిళనాడులో నిలబడుతుంది గెలిచి తీరుతుంది అని వాక్యానించారు స్టాలిన్. 

అంతేకాకుండా, కరుణానిధి శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రాథమికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణాలు, గ్రామాలతో పాటు అన్ని స్థాయిల్లో చర్చలు జరిపి, కరుణానిధి సిద్ధాంతాలను ఎత్తిచూపుతూ కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. 

2024లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను డీఎంకే, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకోవాలని ముఖ్యంగా ఆకాంక్షిస్తూ, దానిని సాధించడంలో ఎలక్షన్ బూత్ ఏజెంట్లు ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. ఎలక్షన్ కి సంబంధించిన బూత్ కమిటీల నియామకం నుంచి వాటి పనితీరును పార్టీ ప్రధాన కార్యాలయం పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.

మరోవైపు బిజెపి సన్నాహాలు: 

ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంగా బిజెపిలో ఎలక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సక్సెస్ మంత్ర సూచించినట్లు ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశమే తెలియజేస్తోంది.

ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉన్న బిజెపి మరింత దగ్గర అవ్వాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఇతరుల మాదిరిగా ఎన్ డి ఏ అన్నది స్వార్థపూరితమైనది కాదని, ఇతరుల కోసం సహాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వీలైతే సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలు సమకూరే సమావేశాలలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఎంపీలకు మోదీ సూచించారు. అంతేకాకుండా వీలైతే పెళ్లిళ్లకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని, ప్రజలతో ఎంత కనెక్ట్ అయితే వారి సమస్యలు అంత ఈజీగా పరిష్కరించవచ్చు అని అభిప్రాయపడ్డారు. 

అయితే ప్రస్తుతం బిజెపి తరపున ఉన్న ఎన్డీఏ 430 ఎంపీలను 11 గ్రూపులుగా విభజించినట్లు తెలుస్తోంది. అయితే గ్రూపుల వారీగా సమావేశాలు ప్రస్తుతం జరగనున్నాయి. సుమారు ఆగస్టు 10 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.