2000 నోటు ఎక్స్‌చేంజ్.. డెడ్‌లైన్ పొడిగింపు?

సెప్టెంబర్ చివరి లోపల రూ. 2000 నోటు డిపాజిట్ లేదంటే మార్చుకోవచ్చని, రూ.2,000 రద్దు గురించి ఇప్పటికే RBI స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది RBI.  గడువు పొడిగింపు..!:  2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగియడానికి ఒక రోజు ముందు, RBI ప్రజలకు మరింత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 19వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ […]

Share:

సెప్టెంబర్ చివరి లోపల రూ. 2000 నోటు డిపాజిట్ లేదంటే మార్చుకోవచ్చని, రూ.2,000 రద్దు గురించి ఇప్పటికే RBI స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది RBI. 

గడువు పొడిగింపు..!: 

2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగియడానికి ఒక రోజు ముందు, RBI ప్రజలకు మరింత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 19వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఆర్‌బిఐ రూ. 2,000 కరెన్సీ నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా బ్యాంకులకు మార్చుకోవడానికి అక్టోబర్ నెలాఖరు (అక్టోబర్ 31) వరకు సమయం ఇచ్చే అవకాశం ఉందని, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, అభివృద్ధి గురించి తెలిసిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే భారతీయుల కోసం, అదేవిధంగా విదేశంలో ఉంటున్న భారతీయుల కోసం గడువు పొడిగించే అవకాశం ఉంటుందని అధికారి తెలపడం జరిగింది. 

అధికారులు ఇంకేమంటున్నారు: 

రూ. 2,000 నోట్ల ఉపసంహరణలను వీలైనంత, అంటే 100 శాతానికి చేరువ చేసే లక్ష్యంతో గడువు పొడిగింపు ఉంటుందని కొందరు టాప్ బ్యాంకర్లు భావిస్తున్నారు. కొంత మంది విదేశాల్లో ఉన్నారు, మరికొందరు అనారోగ్యంతో ఉన్నవారికి డిపాజిట్ కష్టం అవ్వచ్చు.. ఇలాంటి వారికి నోట్లను మార్చుకోవడానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వచ్చు అని సౌత్ ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు నివేదికలో తెలిపారు. అంతేకాకుండా నిజానికి 2000 రూపాయల నోట్లు కలెక్షన్ మధ్యలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని.. అయితే తప్పకుండా డిపాజిట్ గడువు పొడిగించే అవకాశం ఉంటుందని కూడా RBI మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ సిన్హా అన్నారు.

2,000 రూపాయల నోట్ల రద్దు: 

రూ.2,000 నోట్లను నవంబర్ 2016లో ప్రవేశపెట్టారు, కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును ప్రకటించిన వెంటనే అన్ని రూ.500 మరియు రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన టెండర్ హోదాను ఉపసంహరించుకుంది. మార్చి 2017 నాటికి రూ.2000 నోట్లలో దాదాపు 89 శాతం విడుదలయ్యాయి. తర్వాత ఆర్థిక సంవత్సరం నాటికి, చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.6.73 లక్షల కోట్ల నుంచి రూ.3,63 లక్షల కోట్లకు తగ్గింది. RBI మింట్ ప్రకారం చూసినట్లయితే 2018-2019లో రూ. 2,000 నోట్ల ముద్రణను అనేది నిజానికి నిలిపివేసింది. ఆగస్టు చివరి తేదీకి, సుమారు 0.24 లక్షల కోట్ల రూ. 2,000 నోట్ల కలెక్షన్ జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

నిజంగా చెప్పుకోవాలంటే, 2016 లో నోట్లు రద్దు అయినప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల చుట్టూ రోజులు తరబడి తిరిగి అలసిపోయారు. కానీ, నోట్ల రద్దు కారణంగా చాలా వరకు నల్లధనం బయటపడింది. పక్కదారిలో సంపాదించిన డబ్బు చాలా వరకు రోడ్లపై కూడా కనిపించింది. ముఖ్యంగా, కేవలం ప్రజలు మాత్రమే నోట్లు రద్దు సమయంలో ఇబ్బంది పడ్డారు. ఇంకా చెప్పుకోవాలంటే, ఎంతోమంది ముసలి వాళ్ళు బ్యాంకులలో దాచుకోకుండా, ఇంట్లో దాచుకున్న డబ్బు పూర్తిగా వృధా అయిపోయింది. చాలామందికి నోట్ల రద్దు విషయం లేటుగా తెలిసినందువల్ల, ఇంట్లో దాచుకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా వరకు నష్టపోయారు. 

కానీ ఈసారి, అలా జరగకుండా ఉండేందుకు, సెప్టెంబర్ చివరి తేదీ వరకు రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి గడువు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని మినహాయింపులు కారణంగా, 2,000 రూపాయల నోట్లు డిపాజిట్ అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి అక్టోబర్ చివరి వరకు సమయాన్ని పొడిగించే అవకాశం ఉంది. దీని గురించి ఇప్పటివరకు ప్రత్యేకమైన ఆఫీషియల్ నోటీస్ విడుదల అవ్వాల్సి ఉంది. మరోవైపు అమెజాన్ కంపెనీ లాంటి కొంతమంది ప్రముఖులు, ప్రజల ఇబ్బంది చూసి ఎక్స్చేంజ్ ప్రక్రియలో సహాయపడుతున్నారు.