కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న కసాయి తల్లి..

మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం.. పెళ్లి అయిన ప్రతి మహిళ తాను తల్లి కావాలి అని.. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని.. ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నో వ్రతాలు,  నోములు అంటూ బిడ్డ కోసం పరితపిస్తుంది. ఇక వైద్యుల చుట్టూ తిరుగుతూ లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఆ మాతృత్వం పొందడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నది అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని […]

Share:

మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం.. పెళ్లి అయిన ప్రతి మహిళ తాను తల్లి కావాలి అని.. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని.. ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నో వ్రతాలు,  నోములు అంటూ బిడ్డ కోసం పరితపిస్తుంది. ఇక వైద్యుల చుట్టూ తిరుగుతూ లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఆ మాతృత్వం పొందడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నది అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం నిజంగా వీరు తల్లులేనా అన్న అనుమానం కలుగుతుంది. కొన్ని కారణాలకే తమ కోపాన్ని బిడ్డలపై చూపిస్తూ ఆ బిడ్డల జీవితాన్ని కాలదన్నుతున్నారు.

సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకోవడం మాతృత్వానికే సిగ్గుచేటు అనిపించేలా ఉంది.. తానే స్వయంగా తన బిడ్డను చంపుకున్నానని చెప్పడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. అసలు విషయంలోకెళితే భోపాల్ లోని గ్వాలియర్ ప్రాంతంలో రెండు నెలల క్రితం మూడు సంవత్సరాల బాలుడు అనుమానాధాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలలుగా బాలుడు ఎలా చనిపోయారు అని పోలీసులు ఆరా తీస్తుండగా నిన్న రాత్రి బాలుడి తల్లి నేరం అంగీకరించడంతో ఇప్పుడు హత్య కేసు కు దారితీసింది.  టెర్రస్ పైనుంచి తానే తోసేసి హత్య చేశానని పసిబిడ్డ తల్లి తన భర్తతో చెప్పి నేరం అంగీకరించింది.

అంతే కాదు తనకు ఉన్న ఇద్దరు కుమారులలో ఆ కుమారుడు అంటేనే అత్యంత ఇష్టం అని ఆమె పోలీసులకు గురువారం వెల్లడించారు. ఇకపోతే రెండు నెలల క్రితం తారమై కాలనీలోని తన ఇంటి వద్ద బాలుడు జతిన్  కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక అతని వయసు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు. బాబు తల్లి జ్యోతి కాగా తండ్రి ధ్యాన్ సింగ్ రాథోడ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే పిల్లవాడు కిందపడి గాయాల పాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పిల్లవాడు మరణించాడు . అయితే ఆ పిల్లవాడు పైనుంచి కిందకు నెట్టబడ్డాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక ఆమె ఇద్దరు పిల్లలలో చనిపోయిన బిడ్డను ఎక్కువగా ఇష్టపడేదట. అయితే ఈ విషయాన్ని తాటిపూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వినయ్ శర్మ వెల్లడించారు.

అయితే అసలు విషయంలోకి వెళ్తే ధ్యాన్ సింగ్ కు.. ఈ ప్రాంతంలో ఒక ఇల్లు ఉంది అని కొన్ని నెలల క్రితం జ్యోతి తన ఇంట్లో దుకాణం తెరవమని తన భర్తను కోరగా.. అతడు ఒక దుకాణం తెరిచారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె మరోలా భావించి దుకాణాన్ని మూసి వేయమని చెప్పిందట. దాంతో భర్త పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమె ఒక ప్లాన్ వేసి పథకం ప్రకారం తన చిన్న కొడుకును దుకాణం దగ్గరకు నెట్టి వేసింది. తద్వారా ఆశుభం అని తెలిపింది.. బిడ్డ చనిపోతుందని అనుకోలేదని.. దుకాణాన్ని మూసివేయడానికే తను పన్నిన ప్లాన్ లో భాగంగా బిడ్డ చనిపోయాడని కన్నీటి పర్యంతం అయింది. ఇక అయితే నేరాన్ని ఒప్పుకున్నందుకుగాను హత్య కేసు కింద ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.