కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు..

కుక్క కరిచిన విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచిన ఓ బాలుడు చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రేబీస్ వ్యాధి బారిన పడ్డ అతడు నెల రోజుల తరువాత మృతి చెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.  కుక్క కరిస్తే చాలా ప్రమాదకం. కుక్క కరిచిన వెంటనే ఇంజెక్షన్లు వేయించుకోవాలి. లేకుంటే రేబిస్ వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తిడతారనే భయం ఓ బాలుడి ప్రాణాన్ని హరించింది. ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖం […]

Share:

కుక్క కరిచిన విషయాన్ని తల్లిదండ్రుల వద్ద దాచిన ఓ బాలుడు చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రేబీస్ వ్యాధి బారిన పడ్డ అతడు నెల రోజుల తరువాత మృతి చెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.  కుక్క కరిస్తే చాలా ప్రమాదకం. కుక్క కరిచిన వెంటనే ఇంజెక్షన్లు వేయించుకోవాలి. లేకుంటే రేబిస్ వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తిడతారనే భయం ఓ బాలుడి ప్రాణాన్ని హరించింది. ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిల్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో నివాసముంటున్న సాబేజ్ అనే  8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడిని నెల రోజుల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ఆ కుక్కకు పొరుగింటి ఆమె రోజూ ఆహారం వేసేది. ఆలా ఓ ఆరు కుక్కలకు ఆమె ఆహారం అలవాటు చేసింది. నిత్యం ఆ కుక్కలు ఆమె ఇంటి వద్దే ఉండేవి. గతంలో రోడ్డు మీద వెళుతున్న వారిని కరిచాయి కూడా! 

అయితే, నెల రోజుల క్రితం ఓ కుక్క సాబేజ్‌ను కూడా కరిచింది. కానీ ఇంట్లో చెబితే తిడతారనే భయంతో ఆ బాలుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడు. కొన్ని రోజుల తరువాత అతడు రేబీస్ వ్యాధి బారిన పడ్డాడు. అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. సెప్టెంబర్ 1 న తినడం మానేశాడు. తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో పక్కింటి కుక్క కరిచిందని చెప్పాడు. కుక్క కరిచిన కొద్ది రోజులకే బాలుడి కుటుంబసభ్యులు అతడిలో మార్పులు గమనించారు. పెద్దగా గాలి వీచినా, నీళ్లు కనబడినా భయపడిపోయేవాడు. ఎప్పుడూ చీకట్లో ఉండేందుకే ఇష్టపడేవాడు. చివర్లో పెద్ద శబ్దం వినిపించినా గడగడా వణికిపోయాడు.  బాలుడిలో మార్పులు చూసి కంగారు పడిపోయిన కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.  కానీ, ఫలితం మాత్రం శూన్యం. అది మొదలు వారు ఘాజియాబాద్‌తో పాటూ మీరట్‌లోని పలు ఆసుపత్రులకు వెళ్లినా బిడ్డకు నయం కాలేదు. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చూపించినా బిడ్డకు నయం కాలేదు.

చివరకు వారు బాలుడి ట్రీట్‌మెంట్ కోసం బులంద్‌షెహర్‌కు వెళ్లారు. అనంతరం, అతడిని సోమవారం అంబులెన్స్‌లో తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది. నెల రోజుల క్రితమే అతడు కుక్క కాటు గురించి చెప్పి ఉంటే ఈ రోజు బతికుండే వాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవడం అక్కడున్న వారిని కలిచి చేసింది. తమ బిడ్డ అకాల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి కుటుంబసభ్యులు పోలీసులను వేడుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రేబిస్ యొక్క కారణాలు

మానవులలో రాబిస్ అనేది క్రూరమైన జంతువు కాటు కారణంగా వస్తుంది. జంతువు యొక్క లాలాజలం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వ్యవసాయ జంతువులైన కుక్కలు, ఆవులు, గుర్రాలు, మేకలు, కుందేళ్ళు మరియు గబ్బిలాలాజలం లాలు, కొయెట్‌లు, నక్కలు మరియు హైనాలు వంటి వన్యప్రాణులు రాబిస్‌ను సంక్రమించగలవు. భారతదేశంలో పెంపుడు జంతువులకు టీకాలు వేయబడనందున వీధికుక్కలు ఎక్కువగా  సోకే అవకాశం ఉంది.

చికిత్స

ఒక జంతువు మిమ్మల్ని కొరికితే, గాయం ఉండవచ్చు, కాబట్టి మీ వైద్యుడిని లేదా సమీపంలోని క్లినిక్‌ని సందర్శించండి. వెంటనే చాలా సబ్బు మరియు నీటితో గాయం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కడగాలి. జంతువుకు రేబిస్ ఉన్నట్లు తెలిస్తే, వెంటనే యాంటీ-రేబిస్ వ్యాక్సిన్‌ను ప్రారంభించాలి. జంతువు క్రూరంగా ఉందా లేదా అని మీకు తెలియకుంటే, వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.