కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకొనే సమయం మళ్లీ వచ్చింది… ఆ శుభ సమయం ఎప్పుడంటే!

కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరుచుకునే తేదీలను ప్రకటించారు శివ భక్తులకు మరో తీపి కబురు. చార్‌ధామ్ యాత్రలు చేయదలచుకున్న భక్తులకు ఇది శుభవార్తనే చెప్పాలి. మన దేశంలోనే గొప్ప దైవ క్షేత్రాలలో ఒకటి కేదార్‌నాథ్. జీవితంలో ఒక్కసారయినా ప్రతి శివ భక్తుడూ వెళ్లాలనుకునే ధామం కేదార్‌నాథ్. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. విపరీతమైన చలి ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి.. ఈ పవిత్ర స్థలాలలోని ఆలయాల తలుపులను […]

Share:

కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరుచుకునే తేదీలను ప్రకటించారు

శివ భక్తులకు మరో తీపి కబురు. చార్‌ధామ్ యాత్రలు చేయదలచుకున్న భక్తులకు ఇది శుభవార్తనే చెప్పాలి. మన దేశంలోనే గొప్ప దైవ క్షేత్రాలలో ఒకటి కేదార్‌నాథ్. జీవితంలో ఒక్కసారయినా ప్రతి శివ భక్తుడూ వెళ్లాలనుకునే ధామం కేదార్‌నాథ్. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. విపరీతమైన చలి ఉంటుంది. అందువల్ల ప్రతి సంవత్సరం కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి.. ఈ పవిత్ర స్థలాలలోని ఆలయాల తలుపులను శీతాకాలంలో మూసివేస్తారు. చలికాలం ముగియగానే మళ్లీ తెరుస్తారు. అందువల్ల ఆ  ఆలయాల తలుపులు తెరుచుకునే తేదీలను ప్రకటించారు. 

వివరాలలోకి వెళితే.. 

కేదార్‌‌పుర్ ప్రాంతంలో ఓంకారేశ్వరాలయంలో రక్షక భైరవనాధ్ ఆరాధన ఏప్రిల్ నెల 20వ తేదీన పూర్తవుతుంది. 

దీని తర్వాత కేదారనాథుని పంచముఖి డోలీ ఏప్రిల్ నెల 21వ తారీఖున కేదార్‌నాథ్‌‌కు బయలుదేరుతుంది. 

ఆరోజు రాత్రి పంచముఖి విశ్వనాథ ఆలయం గుప్త కాశీలో ఉండిపోతుంది. దీని తర్వాత ఏప్రిల్ 22 రాత్రికి ఫటా చేరుకుంటుంది. 

ఏప్రిల్ 23న ఫటా నుండి గౌరీకుండ్ చేరుకుని ఆ రాత్రికి అక్కడ ఉంచబడుతుంది. 

ఇక చివరి మజిలీగా ఏప్రిల్ 24న కేదార్‌నాథ్ చేరుకుంటుంది. 

అలా చేరిన తరువాత ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం 6; 20 కి ఏప్రిల్ 25వ తేదీ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు తెల్లవారు జామున 4 గంటలకు ఓంకారేశ్వర్ ఆలయంలో మహాభిషేక పూజ నిర్వహిస్తారు. అర్చకులు గర్భగుడిలో అన్ని క్రతువులూ పూర్తి చేశాక ఆలయ తలుపులు తెరుస్తారు. ఉదయం 8.30 నిముషాలకు హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తరవాత 9 గంటలకు ఆలయ పూజారులు పంచ్‌కేదార్ గడ్డిస్థల్‌ వద్ద పంచాంగం వినిపిస్తారు. ఆ రోజంతా భజనలు జరుగుతాయి. 

ఇక బద్రినాథ్ యాత్ర చేయాలనుకునే వారికీ కీలక సమాచారం ఇచ్చారు అధికారులు. ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 7.10 నిముషాలకు బద్రినాథ్ ధామ్‌ను తెరవనున్నారు. ఆరోజు వసంత పంచమి కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. చాలా మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా కేథార్​నాథ్ శివున్ని దర్శించుకోవాలని భావిస్తారు. కానీ అక్కడికి వెళ్లాలంటే ఎన్నో వ్యయప్రయాలసలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యయం ఖర్చు పెట్టి ప్రయాస పడ్డా కూడా ఆ కేథారేశ్వరుడు దర్శనమిస్తాడనే గ్యారంటీ లేదు. మనం తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వాతావరణం సహకరించకపోతే మన దర్శనం కాకముందే వెనక్కు పంపిస్తారేమో కూడా మనకు తెలియదు. కాబట్టి కేథారీశ్వరుని దర్శనం కావాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలని అంతా బలంగా విశ్వసిస్తారు. పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఆ మహాశివుడి దర్శన భాగ్యం మనకు కలుగుతుందని పేర్కొంటారు. ఇటీవల బధ్రీనాథ్ సమీపంలోని జోషిమఠ్​లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుల్లు వచ్చిన సంగతి తెలిసిందే.