మణిపూర్ లో హింసకు కార‌ణాలు ఇవే..!

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది […]

Share:

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. 

అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

మణిపూర్ హింసకి ఆజ్యం పోస్తున్న 10 అంశాలు: 

1. మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే నేతృత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఏర్పాటు చేసిన శాంతి కమిటీ, వివిధ కారణాల వల్ల రెండు కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీల మధ్య శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమైందనే చెప్పుకోవాలి. దీనికి కారణంగా మణిపూర్ లో హింస ఒక కొలిక్కి రాకపోవడానికి కారణం.

2. మోహరించిన కొన్ని అత్యవసర ఆపరేషన్లు మధ్యలోనే ఆగిపోవడం, మెయిటీ సివిల్ సొసైటీ, కుకీ తిరుగుబాటు గ్రూపులతో మెల్లగా చర్చలు కొనసాగుతున్నాయి, అయితే ఈ చర్చల ద్వారా పరిష్కారం ఎప్పటి వరకు దొరుకుతుందో చెప్పలేం అంటున్నారు.

3. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతపై తాము రాజీపడబోమని మణిపూర్ ప్రభుత్వం మాట్లాడుతున్నప్పటికీ, మరోవైపు మెయిటీ సమాజం దృఢంగా తమ కార్యకలాపాలు జరిపిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.

4. 60 మంది సభ్యుల అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలతో, మెయిటీలు రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారని, అందువల్ల కుకీ సమాజం వారు కూడా “ప్రత్యేక పరిపాలన” కోరుకుంటున్నారని చెప్పారు.

5. కుకీలు మరియు మెయిటీలు ఇద్దరికీ భద్రతా దళాలపై విశ్వాసం లేనట్లు కనిపిస్తుంది. కుకీలు మణిపూర్ పోలీసులను పక్షపాతంతో ఉన్నారని, అయితే మెయిటీలు అస్సాం బలగాలపై అపనమ్మకంతో ఉన్నారు. కేంద్ర బలగాలు మణిపూర్‌లో ఎంతవరకు హింసను ఆపగలవో తెలియదు కాబట్టి, కాబట్టి రాష్ట్ర పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలి, అంతేకాకుండా అస్సాం బలగాలు మయన్మార్‌తో సరిహద్దులను కాపాడుతున్నాయి.

6. మణిపూర్‌లో బిజెపి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సహాయాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన తరువాత, Mr శర్మకు బాధ్యత అప్పగించడం జరిగింది. అంతేకాకుండా తర్వాత మెయిటీ-కుకీ సమూహాలతో సమావేశమయ్యారు. అయితే కుకీలు తిరుగుబాటు గ్రూపులతో రహస్య మంతనాలను ఆరోపిస్తూ, 2017 లేఖ లీక్ చేయడంతో మెయిటీలు బిస్వా శర్మపై అపనమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.

7. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్‌ను తొలగించే వరకు కుకీ గ్రూపులు చర్చలు జరపడానికి నిరాకరిస్తున్నప్పటికీ, మెయిటీస్‌లో పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతు ఇస్తున్నారు.

8. మణిపూర్‌లోని అతి పెద్ద గిరిజన సంఘాలు నాగాలు ప్రస్తుతం జరుగుతున్న హింసకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారి రాజకీయ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర యూనిట్ బీరెన్ సింగ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో తమ స్వంత శాంతి చర్చలపై దృష్టి సారించారు.

9. మిజో తెగలతో.. కుకీ, జో మరియు చిన్ తెగలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున, మిజోరం మరియు దాని ముఖ్యమంత్రి ప్రమేయం, మణిపూర్ ప్రభుత్వానికి అలాగే మెయిటీలకు వ్యతిరేకంగా అనిపిస్తోంది. చాలామంది ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

10. మణిపూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) ఉపసంహరణ అనేది ఎప్పుడైతే జరిగిందో మణిపూర్ లో జరుగుతున్న హింసకు అడ్డు అదుపు లేకుండా పోయింది.