Garba: గర్బా ఆడుతూ గుజరాత్ లో పదిమంది మృతి

నవరాత్రి (Navaratri) సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆటపాటలతో తమ సంతోషం రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఇదే సందర్భంలో గుజరాత్ (Gujarat)లో నవరాత్రి (Navaratri) సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఒక్కరూ తమకి ఇష్టమైన గార్బా (Garba) ఆడుతూ ఆనంద పరవశంలో మునిగితేలుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అనుకోని సంఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది.  గుండు పోటే కారణం..:  గుజరాత్‌ (Gujarat)లో గడచిన 24 గంటల్లో నవరాత్రి (Navaratri) ఉత్సవాల సందర్భంగా గార్బా (Garba) ఆడుతూ […]

Share:

నవరాత్రి (Navaratri) సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆటపాటలతో తమ సంతోషం రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఇదే సందర్భంలో గుజరాత్ (Gujarat)లో నవరాత్రి (Navaratri) సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఒక్కరూ తమకి ఇష్టమైన గార్బా (Garba) ఆడుతూ ఆనంద పరవశంలో మునిగితేలుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అనుకోని సంఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. 

గుండు పోటే కారణం..: 

గుజరాత్‌ (Gujarat)లో గడచిన 24 గంటల్లో నవరాత్రి (Navaratri) ఉత్సవాల సందర్భంగా గార్బా (Garba) ఆడుతూ 10 మంది గుండెపోటు (heart attack)తో మరణించారు. బాధితుల్లో టీనేజర్ల నుండి మధ్య వయస్కుల వరకు ఉన్నారు, వారిలో చిన్నవాడు బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు.

శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గార్బా (Garba) ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటు (heart attack)తో మృతి చెందాడు. అదేవిధంగా కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గార్బా (Garba) ఆడుతూ గుండెపోటు (heart attack)తో మృతి చెందాడు. రాష్ట్రంలో గడిచిన రోజులో ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. దీనికి తోడు, నవరాత్రి (Navaratri) మొదటి ఆరు రోజులలో, గుండె సంబంధిత సమస్యల కోసం 521 కాల్స్ , శ్వాస తీసుకోవడంలో కష్టమవుతుందంటూ సుమారు 609 కేసులకు సంబంధించి, 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ సాధారణంగా గార్బా (Garba) వేడుకలు జరిగే సాయంత్రం 6, తెల్లవారుజామున 2 గంటల మధ్య నమోదైనట్లు సమాచారం.

ఈ ఆందోళనకరమైన సంఘటనల కారణంగా.. ఈవెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని గుజరాత్‌ (Gujarat) ప్రభుత్వం ప్రేరేపించింది. గార్బా (Garba) వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లకు (సిహెచ్‌సి) గుజరాత్‌ (Gujarat) ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది, వారు హై అలర్ట్‌గా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఈవెంట్‌లలోకి అంబులెన్స్‌లు వేగంగా ప్రవేశించేందుకు కారిడార్‌లను రూపొందించాలని గార్బా (Garba) నిర్వాహకులకు కూడా ఆదేశాలు అందాయి.

అంతేకాకుండా, గార్బా (Garba) నిర్వాహకులు వేదికల వద్ద వైద్యులు, అదేవిధంగా అంబులెన్స్‌లను ఉంచడం ద్వారా, గార్బా (Garba) ఆటపాటలలో పాల్గొనేవారి భద్రతను నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నారు. వారు తమ సిబ్బందికి CPR శిక్షణను అందించాలని, ముఖ్యంగా గార్బా (Garba) ఆడేవారు, ముందుగానే ఎక్కువగా నీళ్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు. ఈ ఏడాది నరవ్రాత్రి ఉత్సవాలకు ముందు, గుజరాత్‌ (Gujarat)లో గార్బా (Garba) ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు గుండెపోటు (heart attack)తో మరణించారు. 

గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించుకోండిలా..: 

ఊపిరందకపోవడం: 

ఒకోసారి ఊపిరి అందకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువసార్లు ఇలా జరుగుతున్నట్లు అనుమానిస్తే వెంటనే మంచి డాక్టర్ ని  సంప్రదించడం మంచిది. 

నీరసంగా ఉండడం: 

గుండె (heart)కు సంబంధించి అనారోగ్యం ఉన్నవారిలో ఎక్కువగా నీరసంగా అనిపించడం, మన రోజువారి పనులను చేసుకోలేకపోవడం అలాంటివి జరుగుతుంది. 

గుండె (heart) ఆగిపోయినట్లు అప్పుడప్పుడు అనిపించడం: 

గుండె (heart)కు సంబంధించిన అనారోగ్యం కారణంగా గుండె (heart) కొట్టుకోవడం ఆగిపోయినట్లు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు, ఇది తీవ్రమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరం ఉంది, అంతే కాకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. 

కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం: 

గుండె (heart)కు సంబంధించి ఎటువంటి వ్యాధి ఉన్న, మన శరీరం మొత్తంలో తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా తల బరువుగా అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్లు, ఒళ్ళు తూలుతున్నట్లు అనిపించడం కనిపిస్తుంది. 

చెమటలు పట్టడం: 

సాధారణంగా చెమటలు పట్టడాన్ని పక్కన పెడితే, గుండె (heart)కు సంబంధించి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే, కొంతమందిలో ముఖ్యంగా అధికంగా చెమటలుపడుతూ ఉంటాయి. చల్లని ప్రదేశంలో ఉంటున్నప్పటికీ తెలియకుండానే చెమటలు పడుతూ ఉంటాయి.