ప్రతి ఏట తెలంగాణలో పదివేల డాక్టర్లు: కేసీఆర్ 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలుచోట్ల ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అడుగుపెట్టిన సందర్భం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆయన చేతుల మీదగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తెలంగాణలో  సేవ చేసేందుకు పదివేల డాక్టర్లు తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తుందని ప్రస్తావించారు. ప్రతి ఏటా పదివేల మంది డాక్టర్లు:  తెలంగాణలో వైద్య విద్య […]

Share:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలుచోట్ల ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అడుగుపెట్టిన సందర్భం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఆయన చేతుల మీదగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తెలంగాణలో  సేవ చేసేందుకు పదివేల డాక్టర్లు తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తుందని ప్రస్తావించారు.

ప్రతి ఏటా పదివేల మంది డాక్టర్లు: 

తెలంగాణలో వైద్య విద్య ద్వారా 10,000 మంది వైద్యులను తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తుందని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్‌లో వర్చువల్‌గా పాల్గొనే తొమ్మిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు అందించాలనే లక్ష్యంతో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించడం తెలంగాణ చరిత్రలో నిజంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014లో 2,850 మెడికల్ సీట్లు ఉన్నాయన్నారు. 2023 నాటికి మెడికల్ సీట్ల సంఖ్యను 8515 మెడికల్ సీట్లకు పెంచాం అని.. మంత్రి టీ హరీశ్ రావును, వైద్య శాఖ కార్యదర్శిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని.. 85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా పోరాడి సాధించుకున్నాం నారాయణ. హైకోర్టులో న్యాయపోరాటం తరువాత ఇది గొప్ప విజయం.. ప్రయివేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా ఏడాదికి 10,000 మంది వైద్యులను తయారు చేయబోతున్నాం అని చంద్రశేఖర్‌రావు తెలిపారు.

తెలంగాణలోని ప్రతి జిల్లాకు ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది దాదాపు 24కి చేరుకున్నాం అని.. గతంలో ఐదు మెడికల్ కాలేజీలుంటే నేడు వాటి సంఖ్య 26కి చేరిందని..వచ్చే విద్యాసంవత్సరానికి కొత్తగా ఎనిమిది కాలేజీలు ప్రారంభం కానున్నాయని.. మంత్రివర్గం ఆమోదం కూడా లభించిందని వెల్లడించారు. 

ఎంతగానో అభివృద్ధి: 

తెలంగాణ నుంచి సిద్ధం అవుతున్న వైద్యులు రాష్ట్రాన్నే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడుతారన్నారని.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. విద్యుత్ రంగంతో పాటు వ్యవసాయం, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించాం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం.. పాలమూరు జిల్లాలో ఇప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందుతోంది.. పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాం. ఒక్క కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని.. నల్గొండలో మూడు కాలేజీలు వచ్చాయన్నారు. మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాలతో పాటు అడవిబిడ్డలు నివసించే ప్రాంతాల్లో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి అద్భుతాలు సృష్టిస్తాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. 

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలంగా ఉన్న చోట మరణాలు, నష్టాలు తక్కువగా ఉంటాయని చంద్రశేఖర్ రావు అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆసుపత్రులను తీసుకొస్తున్నాం అని.. దేశంలో లక్ష మందికిగాను 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది మన ఘనత అంటూ చెప్పుకొచ్చారు కెసిఆర్. మరో ఆరు హాస్పిటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయని.. వరంగల్‌లో అద్భుతమైన హాస్పిటల్స్ నిర్మిస్తున్నారని.. గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డలో 1000 పడకలతో హాస్పిటల్స్లను నిర్మిస్తున్నా అని.. మరో 2,000 పడకలతో నిమ్స్‌ను విస్తరిస్తున్నాం అని.. అంతేకాకుండా హాస్పిటల్స్ లో ఉండే బెడ్స్ సంఖ్య 50 వేలకు చేరుకోనుంది అంటూ ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆరోగ్య వ్యవస్థ గురించి మరింత వివరించారు.