పవర్‌లూమ్‌లపై దృష్టి పెట్టాలి: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తిరుపూర్ పవర్‌లూమ్ క్లస్టర్లను స్ఫూర్తిగా తీసుకుని కొత్త కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. చేనేత సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందన్నారు కేటీఆర్. నేత కార్మికులు జీవనోపాధి, ఉపాధి కోసం ఆధారపడిన పవర్‌లూమ్ క్లస్టర్‌లపై […]

Share:

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తిరుపూర్ పవర్‌లూమ్ క్లస్టర్లను స్ఫూర్తిగా తీసుకుని కొత్త కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

చేనేత సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందన్నారు కేటీఆర్. నేత కార్మికులు జీవనోపాధి, ఉపాధి కోసం ఆధారపడిన పవర్‌లూమ్ క్లస్టర్‌లపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో చేనేత శాఖ కార్యక్రమాలను సమీక్షించిన రామారావు తమిళనాడులోని తిరుపూర్ క్లస్టర్ తరహాలో ఇంటిగ్రేటెడ్ అండ్ అడ్వాన్స్‌డ్ పవర్‌లూమ్ క్లస్టర్‌లను అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను అధికారులు పరిశీలించాలన్నారు.

ఈ మేరకు తిరుపూర్ పవర్‌లూమ్ క్లస్టర్‌లను సందర్శించి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా తయారవుతున్న ఉత్పత్తులతోపాటు నేత కార్మికుల నైపుణ్యాలు, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.

నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహద్వేపూర్, కొత్తకోట వంటి నేత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మంత్రి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. వారి పనిలో రాణిస్తున్న నేత కార్మికులను గుర్తించి సత్కరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని రామారావు ఆదేశించారు. త్వరలో హైదరాబాద్‌లో చేనేత మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు.

కాగా సమైక్య రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి పాలకుల వివక్షతతో ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలైన చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తెలంగాణ రాష్ట్రాంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలోనే సుమారు వంద మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు, ఆకలి చావులకు బలైన విషయం విదితమే.

అటు వ్యవసాయ రంగం తర్వాత పెద్దదైన చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బతుకు భరోసాను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేనేత బీమాను అమలు చేయాలని సంకల్పించింది. జిల్లాలో 18 నుంచి 60 ఏండ్లలోపు చేనేత కార్మికులు, వాటి అనుబంధాల్లో పని చేసే కార్మికులకు చేనేత బీమా వర్తిస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారు 2600 పైగా కార్మికులకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది.

చేనేత పరిశ్రమను కాపాడేందుకు కేవలం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఋణాలు ఇవ్వడంతోనే సరిపోదని తెలుసుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌.. పరిశ్రమకు మార్కెట్‌లో ఆదరణ కల్పించాలని సంకల్పించారు. ఎక్కువ మంది చేనేత వస్త్రాలు ధరించేలా చొరవ తీసుకుంటున్నారు. చేనేత వస్త్రాలు ధరించడంతో కలిగే ఆరోగ్యపరమైన లాభాలను ప్రచారం చేస్తూ చేనేత వస్త్రాలకు క్రేజీని పెంచారు. అందులో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట కలెక్టరేట్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు 4 రోజుల పాటు చేపట్టారు. దీనికి మంచి స్పందన లభించినట్లు అధికారులు వెల్లడించారు.

అటు చేనేత పరిశ్రమ పది కాలాలు సజావుగా సాగి కార్మికులకు ఉపాధి లభించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. రంగులు, రసాయనాలు, యారన్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో చేనేతకు ఎంత ఆదరణ ఉన్నప్పటికీ కార్మికుల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగులు, రసాయనాలు, యారన్‌పై 40శాతం సబ్సిడీ ఇచ్చి కార్మికులను మరింత ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. చేనేతను కొత్త పుంతలను తొక్కిస్తున్న ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది.