ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి! ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కంటి నిండా నిద్రపోయేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.  కార్పొరేట్, ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎనిమిది గంటల నిద్రను తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నిద్రలేమి సమస్య బారిన పడకుండా, చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడలు, ఆటలతో సహా సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం […]

Share:

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కంటి నిండా నిద్రపోయేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.  కార్పొరేట్, ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎనిమిది గంటల నిద్రను తప్పనిసరి చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నిద్రలేమి సమస్య బారిన పడకుండా, చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడలు, ఆటలతో సహా సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా తప్పనిసరి చేయనుంది. ప్రైవేట్ కాలేజీలో సాయంత్రం తరగతులు నడపద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలకే నిర్వహించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఇటీవల కాలంలో పలు ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాల రూపకల్పనకు చర్యలు తీసుకుంటుంది. 8 మందితో కూడిన కమిటీ ఏర్పాటు పటిష్ట మార్గదర్శకాలను రూపొందించి త్వరలోనే ఈ మార్గదర్శకాలను వెల్లడించనుంది.

ప్రైవేటు కాలేజీలు, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కళాశాలలు నడపాలని సూచించింది. హాస్టల్ విద్యార్థులకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని షరతు విధించింది. సాయంత్రం స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ఈ సమయాన్ని అంత విద్యార్థులు ఆటవిడుపు కోసం కేటాయించాలని, అలాగే రాత్రి భోజనం ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్ట్ వంటివి కూడా పెట్టద్దని తెలిపింది. ఉదయం వేళల్లో యోగా, ధ్యానం చేసేలాగా చర్యలు తీసుకోవాలని.. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని ఇంటర్ బోర్డు సూచించింది. 

 ఇంటర్ విద్యార్థులకు 8 గంటల నిద్ర తప్పనిసరి చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఆదేశాలను జారీ చేయనుంది. చాలామంది విద్యార్థులు నిద్రలేమి సమస్య వలన ఇబ్బంది పడుతున్నారని, నిద్ర ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

క్లాస్ వర్క్ తర్వాత సాయంత్రం వినోద కార్యకలాపాలు తప్పనిసరిగా ఉండాలని ఇంటర్ బోర్డు సూచించింది. గత కొద్ది రోజుల క్రితం నార్సింగ్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మార్కుల పేరుతో యాజమాన్యం ఒత్తిడి పెట్టడం, వేధింపులకు గురిచేయడం వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో అప్రమత్తమైన ఇంటర్ బోర్డు ప్రైవేటు కాలేజీల్లో అకాడమిక్ ఇతర సమస్యలపై మార్గదర్శకాల రూపకల్పన కోసం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు మార్గదర్శకాలను రూపొందించింది. 

అలాగే టీవీలు, పత్రికల్లో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఇచ్చే తప్పుడు ప్రకటనలపై బోర్డు దృష్టి సారించింది. మీడియా కు ప్రకటనలు ఇచ్చేటప్పుడు బోర్డు నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసేలా ప్రణాళికలు తీసుకురానుంది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు వేస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి. టాప్ ర్యాంక్స్ తమ కాలేజీలకే వచ్చాయంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దాంతో విద్యార్థులకు వచ్చిన ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ పరిశీలించిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చేలా చర్యలు తీసుకునే విధంగా ఇంటర్ బోర్డు సరికొత్త నిర్ణయం తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. కమిటీ ఈ నెల చివరిలోపు సిఫార్సులు అందించునుంది. ఈ సిఫార్సులను పరిశీలించి ఇంటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.