పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు […]

Share:

అంగరంగ వైభవంగా సాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీపీతో పాటు, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం.. 74 మినీ చెరువులను ఏర్పాటు చేసింది. వాటిల్లో 22 భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు కాగా.. 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ అందుబాటులో ఉంచింది. వాటిల్లోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలనేది హైకోర్ట్ ఆదేశాల సారాంశం.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాల తయారీదారులకు అనుకూలంగా మధ్యంతర ఆదేశాలను ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ సోమవారం నిరాకరించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను పూర్తిగా నిషేధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ గణేష్ మూర్తి కళాకార సంక్షేమ సంఘం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. హుస్సేన్‌ సాగర్‌ ట్యాంక్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చూడాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల పౌర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుంటున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నిషేధం ఉన్నప్పటికీ పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది.

మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణేశ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదన్న ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రభుత్వం మునుపటి ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని కోర్టుకు హామీ ఇచ్చారు.

అయితే హైకోర్టు ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గణేష్‌ మండపాల నిర్వాహకులు. అంతేకాదు ట్యాంక్ బండ్‌పై ఆందోళన చేశారు. హై కోర్ట్ తీర్పును పుణ:సమీక్షించాలని కోరుతున్నారు. హిందువుల పండగకే ఆoక్షలు సృష్టిస్తున్నారని ఆందోళకు దిగారు. ఏ మతాలపై లేని ఆంక్షలు కేవలం హిందు పండుగలపై మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందన్నారు. కోర్టులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతి ఏడాది వినాయక నిమజ్జనంపై వివాదం చెలరేగుతోంది. మట్టి విగ్రహాలు వినియోగించాలని, తద్వారా పర్యావరణానికి ఏ హాని ఉండదని అధికారులు, ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర కెమికల్స్ వాడి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పాటు నగరంలోని చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలలోకి వస్తాయని, వీటిని అమలు చేయాలని హైదరాబాద్ సీపీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ లను హైకోర్టు ఆదేశించింది.