Rahul Gandhi: నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటున్న రాహుల్ గాంధీ

తెలంగాణ ( Telangana) రాష్ట్రంలో ప్రవల్లిక ఆత్మహత్య ( Suicide) మరోసారి నిరుద్యోగ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. ప్రవల్లిక మరణ అనంతరం యువత తెలంగాణ ( Telangana)లోని నిరుద్యోగుల(Unemployment) బాధను అర్థం చేసుకునే వారు లేరు అంటూ నిరసనలకు దిగుతున్నారు నిరుద్యోగులు(Unemployment).  నిరుద్యోగి ఆత్మహత్య ( Suicide)కు ప్రభుత్వమే కారణమంటున్న గాంధీ:  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్య ( Suicide)కు పాల్పడిన ఘటనపై తెలంగాణ ( Telangana)లోని కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్(BRS)  […]

Share:

తెలంగాణ ( Telangana) రాష్ట్రంలో ప్రవల్లిక ఆత్మహత్య ( Suicide) మరోసారి నిరుద్యోగ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. ప్రవల్లిక మరణ అనంతరం యువత తెలంగాణ ( Telangana)లోని నిరుద్యోగుల(Unemployment) బాధను అర్థం చేసుకునే వారు లేరు అంటూ నిరసనలకు దిగుతున్నారు నిరుద్యోగులు(Unemployment). 

నిరుద్యోగి ఆత్మహత్య ( Suicide)కు ప్రభుత్వమే కారణమంటున్న గాంధీ: 

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్య ( Suicide)కు పాల్పడిన ఘటనపై తెలంగాణ ( Telangana)లోని కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్(BRS)  ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు కురిపించింది, ఇది ఆత్మహత్య ( Suicide) కాదు, యువకుల కలలు మరియు ఆకాంక్షలను హత్య చేసినట్లు అంటూ, తెలంగాణ ( Telangana) ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ (rahul gandhi) విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో విద్యార్థి ఆత్మహత్య ( Suicide)కు పాల్పడిన వార్త చాలా బాధాకరమని రాహుల్ గాంధీ అన్నారు.

గత 10 సంవత్సరాలలో, బిఆర్ఎస్(BRS) – బిజెపి కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ( Telangana)లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తుందని, 1 నెలలో UPSC తరహాలో TSPSCని పునర్వ్యవస్థీకరిస్తుంది మరియు ఏడాదిలోపు ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుంది ఎప్పుడో బి ఆర్ ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ హామీల లో ఒకటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మరొకసారి గుర్తు చేశారు రాహుల్.

ఆత్మహత్య ( Suicide) చేసుకున్న యువతి: 

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లోని తన హాస్టల్‌లో ఆత్మహత్య ( Suicide)కు పాల్పడింది, ఇది నిరసనలకు దారితీసింది. శుక్రవారం రాత్రి నిరుద్యోగి ప్రవల్లిక మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆ ప్రాంతంలో ఆందోళనలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆత్మహత్య ( Suicide)పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ ( Telangana)లో 23 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య ( Suicide) చేసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను పదేపదే వాయిదా వేయడం, అవకతవకల కారణంగా యువతి తట్టుకోలేక జీవితాన్ని అంతం చేసుకుంది అని ఖర్గే అన్నారు. పరీక్షల నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు కారణంగా తెలంగాణ ( Telangana)లోని వేలాది మంది యువ ఔత్సాహికులు నిరాశ, ఆగ్రహానికి గురయ్యారని ఆయన అన్నారు.

ఇది ఆత్మహత్య ( Suicide) కాదు, యువకుల కలలు, ఆశలు మరియు ఆకాంక్షల హత్య అని కాంగ్రెస్ మాజీ చీఫ్ అన్నారు.

తెలంగాణ ( Telangana) యువత నేడు నిరుద్యోగంతో పూర్తిగా నాశనమైందని అన్నారు. సూసైడ్ నోట్‌లో, తమ తల్లిదండ్రుల కోసం ఏమీ చేయలేనందుకు, తన వల్ల కుటుంబం చాలా బాధపడుతోందని, తన గురించి ఎవరు దుఃఖపడకూడదని, ప్రవల్లిక తన వైపు నుంచి చివరిసారిగా క్షమాపణలు చెప్పిందని పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. 

కొద్ది నెలల క్రితమే బిఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని నెల తీసిన కాంగ్రెస్: 

నిరుద్యోగుల(Unemployment) సమస్యల కోసం కొద్ది నెలల క్రితమే కెసిఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగుల(Unemployment) సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు. బిఆర్ఎస్(BRS) ప్రభుత్వం తెలంగాణ ( Telangana)లో అడుగుపెట్టిన సందర్భం నుంచి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు అంటూ ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 12,500 మంది DEd చదువుతున్నారు, 15,000 మంది BEd కోర్సును పూర్తి చేస్తున్నారు. 2020 డిసెంబర్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఇప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం గమనార్హం అన్నారు ఎంపీ. 

ఐదేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ పరీక్ష నిర్వహించి రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అసలు యువత పరీక్షలకు ప్రిపేర్ అవడమే తప్పిస్తే ఉద్యోగాలు చేసేది ఎప్పుడు అంటూ నిలదీశారు. యువతకు వయసు అయిపోతుంది కానీ నోటిఫికేషన్లు మాత్రం విడుదల కావట్లేదు అని వాపోయారు ఎంపీ. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని నోటిఫికేషన్లు జారీ చేయాలని, నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు.