సైబర్ నేరాల నియంత్ర‌ణ‌లో తెలంగాణ పోలీస్ టాప్

సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతపై  భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ-2023 ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ హజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్ అనే అంశంపై అంజనీ కుమార్ […]

Share:

సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతపై  భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ-2023 ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ హజరైయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ ఆర్కిటెక్చర్ అనే అంశంపై అంజనీ కుమార్ ప్రసంగించారు. సైబర్ నేరాలను పరిశోధించడానికి, అరికట్టడానికి ప్రత్యేకమైన సైబర్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ అని డిజిపి అంజనీకుమార్ అన్నారు.

మైక్రోసాఫ్ట్‌ కంపెనీతో సహా ప్రపంచంలోని దాదాపు 600 ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో స్థాపించడం జరిగిందన్నారు. సుమారు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు ఈ టీంలో పనిచేస్తున్నారని పోలీసు అధికారి అంజనీ కుమార్ అన్నారు. సైబర్ నేరాలను ఆపడానికి, గుర్తించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే సైబర్‌ క్రైమ్‌ కేసులు పెరిగిపోయాయన్నారు. కాగా ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిందని డీజీపీ పేర్కొన్నారు.

సైబర్ సెక్యూరిటీలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌లు ఏర్పాటు చేశామన్నారు. కాగా ఈ బ్యూరోలో దాదాపు 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.. సైబర్ నేరాల నియంత్రణలో ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అటు సైబర్ ఆధారిత ఆర్థిక నేరాల పరంగా తెలంగాణ పోలీసులు విజయవంతంగా రూ. 65 కోట్లను నిలిపివేశామన్నారు.. సైబర్ నేరాలను ఆపడానికి, ప్రజలకు సైబర్‌ నేరాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ  రాష్ట్రంలోని 800 పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్‌లుగా పోలీసు అధికారులు శిక్షణ పొందారని అంజనీ కుమార్ తెలిపారు.

కాగా అంజనీ కుమార్ 1990 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి. 2022 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీగా నియమించబడ్డారు..1998 – 99లో బోస్నియాలో ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్నప్పుడు రెండుసార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్నిఅంజనీ కుమారు అందుకున్నారు.

2021 డిసెంబరు 24 ఏసిబి మాజీ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ నుండి తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలను స్వీకరించిన అంజనీకుమార్.. తన హైదరాబాదు సిటీ పోలీస్ కమీషనర్ బాధ్యతలను సివి ఆనంద్‌కు అప్పగించారు. నాలుగు సంవత్సరాల పాటు హైదరాబాదు సీపీగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అంజనీకుమార్ తన వంతు పాత్ర పోషించారు. కరోనా కష్ట కాలంలో కూడా పోలీసులను సన్నద్ధం చేసి ముందుండి నడిపించారు.

చివరికి సీనియారిటీలో ముందు వరుసలో ఉండటంతోపాటు, శాంతిభద్రతల అదనపు డీజీగా, హైదరాబాద్ సీపీగా, ఏసీబీ డీజీగా పనిచేసిన అనుభవం ఉన్న అంజనీకుమార్ ను 2022 డిసెంబరు 29న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి డిజిపిగా నియమించగా, డిసెంబరు 31న బాధ్యతలు స్వీకరించారు.