పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్

ఏప్రిల్ 5న కరీంనగర్ లోని తన నివాసంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కేసు పలు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసుకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు ఏప్రిల్ 5, బుధవారం నాడు అరెస్టు చేశారు. ఇక అర్ధరాత్రి బండిని అదుపులోకి […]

Share:

ఏప్రిల్ 5న కరీంనగర్ లోని తన నివాసంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ కేసు పలు ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసుకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ పోలీసులు ఏప్రిల్ 5, బుధవారం నాడు అరెస్టు చేశారు. ఇక అర్ధరాత్రి బండిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..యాదాద్రి భువనగిరిలోని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. అతని అరెస్టు బుధవారం వరకు నమోదు కాలేదు.

పదోతరగతి హిందీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం మంగళవారం, ఏప్రిల్ 4న పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే లీక్ అయినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఇక ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 3 న తెలుగు పరీక్షకు సంబంధించిన SSC ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

హిందీ పేపర్ లీకేజీ ఆరోపణలకు సంబంధించి పోలీసులు బండి సంజయ్ కుమార్‌ను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసులో నిందితుడు.. ఒక పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌తో బండి సంజయ్ కి పరిచయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ పోలీసులు కరీంనగర్‌లో అదుపులోకి తీసుకునే ముందు, తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి..  లీక్‌తో బిజెపి అధ్యక్షుడికి సంబంధం ఉందని ఆరోపించింది. ఇక అరెస్టు అయిన తరువాత ప్రధాన నిందితుడు అయిన ప్రశాంత్  కుమార్‌ల వాట్సాప్ చాట్  కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

‘తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎస్‌ఎస్‌సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం స్పష్టంగా ఉందని, తెలంగాణలోనూ బీజేపీ ఫిరాయింపు రాజకీయాలు చేస్తోందని చెప్పడానికి ఈ ప్రశ్నపత్రాల లీకే నిదర్శనం’ బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

లీకైన ప్రశ్నపత్రం (హిందీ పరీక్ష)..  బండి సంజయ్ కుమార్‌కు వాట్సాప్‌లో వచ్చిందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన నిందితుడు, దాని కాపీని బండి సంజయ్ వాట్సాప్‌కు ఎందుకు పంపాడు? అతనికి, బండి ఏదైనా సంబంధం ఉందని అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.

మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రాజకీయ ప్రేరేపిత అరెస్టుకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. బీఆర్‌ఎస్‌ను తరచుగా విమర్శించే బండి, ఇటీవల తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ను ప్రచురించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతపై BRS మరియు BJP మధ్య సాగుతున్న వార్ వల్లే.. బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని బీజేపీ ఆరోపించింది.

బండి సంజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మరోవైపు నిరసనలు పెరగకుండా ఉండేందుకు పలువురు బీజేపీ నేతలను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్ కూడా ఈ అరెస్టును ఖండించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో BRS ఓటమి ఖాయమని అన్నారు. అవినీతి ఆరోపణలతో కొట్టుమిట్టాడుతూ బీఆర్ఎస్ నాయకత్వం మునిగిపోతున్న పడవ అని అన్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడంతో వారి గొయ్యి వారే తవ్వుకున్నారని ఆయన అన్నారు.