కర్ణాటకలో యువకుడి దారుణ హత్య

మండీ మొహాల్లా పోలీసులు 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. జువెనల్ యాక్ట్ ప్రకారం తనని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.  సన్నీ చౌక్ లో జరిగిన ఘటన: సోమవారం సాయంత్రం 15 ఏళ్ల బాలుడు 17 సంవత్సరాల యువకుడ్ని పొడిచాడు. ఈ ఘటన సన్నీ చౌక్ లో జరిగింది.  ఇద్దరు టెర్రాస్ లో ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇద్దరూ టెర్రస్లో ఆడుకుంటుండగా 15 ఏళ్ల బాలుడు […]

Share:

మండీ మొహాల్లా పోలీసులు 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. జువెనల్ యాక్ట్ ప్రకారం తనని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. 

సన్నీ చౌక్ లో జరిగిన ఘటన:

సోమవారం సాయంత్రం 15 ఏళ్ల బాలుడు 17 సంవత్సరాల యువకుడ్ని పొడిచాడు. ఈ ఘటన సన్నీ చౌక్ లో జరిగింది.  ఇద్దరు టెర్రాస్ లో ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇద్దరూ టెర్రస్లో ఆడుకుంటుండగా 15 ఏళ్ల బాలుడు తన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న కత్తితో 17 ఏళ్ల యువకుడిని పొడిచాడు. తనని హాస్పిటల్ కి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి పేరు పర్వేజ్ ఖాన్.302 సెక్షన్ ప్రకారం 15 సంవత్సరాల బాలుడిని జువైనల్ హోమ్ కి తరలించారు. తను కోపంతో ఇదంతా చేసినట్టు ఆ బాలుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో పిల్లలకు కోపం ఎక్కువగా వస్తుంది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. మన ఆహారపు అలవాట్ల నుండి, మన పెంపకం వరకు అన్నీ దానికి కారణాలే. పిల్లలను మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. వాళ్లను ఒంటరిగా ఉండనివ్వకూడదు. ఎక్కువసేపు మొబైల్స్ ఇవ్వకూడదు. మితిమీరిన హింస ఉన్న సినిమాలు చూడనివ్వకూడదు. వీడియో గేమ్స్ అతిగా ఆడనివ్వకూడదు. 

పిల్లల మానసిక బాగుండాలంటే మనం చేయాల్సిన పనులు:

మనం పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడాలి, ఏమేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. వాళ్లకి స్వేచ్ఛ ఇస్తూనే ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. వాళ్లకు క్రమశిక్షణ నేర్పాలి. పెద్దవారితో ఎలా బిహేవ్ చేయాలో నేర్పాలి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మార్చాలి. ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉంచాలి. ఎక్కువగా మాంసం తిననివ్వకూడదు. 

ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పాలి. సొసైటీలో చెడు కంటే మంచిని ఎక్కువగా చూపించాలి. అందరికీ గౌరవం ఎలా ఇవ్వాలో నేర్పాలి. ఇవన్నీ చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు. 

ఒకప్పటి తరంలో పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య దూరం తక్కువగా ఉండేది. పిల్లలు ఏం చేస్తున్నారు అనే ప్రతి విషయం తల్లిదండ్రులు తెలుసుకునేవారు. అందువల్ల పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచగలిగారు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. జనరేషన్లో చాలా మార్పు వచ్చింది. 

చిన్నపిల్లలు కూడా మొబైల్ వాడే స్టేజ్ కి వచ్చారు. 

పిల్లలు ఎక్కువ చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండటానికి, వారికి కొత్త కొత్త ఆటలను పరిచయం చేయాలి. ఎప్పుడూ మొబైల్ ఫోన్ తో ఆడుకునే పిల్లలు ప్లే గ్రౌండ్లో ఇతరులతో స్నేహపూర్వకంగా ఆడుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. మొబైల్ ఫోన్ తో ఆడడం వల్ల చాలా మంది పిల్లలకు కోపం ఎక్కువ అవుతున్నట్లు అధ్యయనాల్లో కూడా తేలింది. అందుకే పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం మానుకోవాలి. వారిని చదువులో, బయట ఆడుకోవడంలో, లేదా ఏదో ఒక పనిలో సమయం గడిపేందుకు చూడాలి.

ఈ మితిమీరిన స్వేచ్ఛ వల్ల క్రమశిక్షణ అనేది తక్కువవుతుంది. దీనివల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. పబ్జి లాంటి గేమ్స్ కి కూడా పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఆ గేమ్స్ ఆడి ఆడి పిల్లల్లో క్రూరత్వం పెరుగుతుంది. దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఏదైనా మార్పు గమనిస్తే ప్రాబ్లమ్ ఏంటో అడిగి తెలుసుకోవాలి. దానివల్ల వాళ్ళ మైండ్ లో ఉన్నదంతా క్లియర్ అవుతుంది. అప్పుడు ఇలాంటి దారుణాలు జరగవు. తల్లిదండ్రులు పిల్లవాడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తూనే వాళ్లని సరైన దారిలో నడిపించాలి. ఇకనుంచైనా తల్లిదండ్రులు పిల్లలను సరైన దారిలో నడిపిస్తారని ఆశిద్దాం.