Mamata Banerjee: వాళ్ల వల్లే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం..

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Courtesy: Twitter

Share:

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో (World Cup) ఇండియా(India) అన్ని మ్యాచ్‌లు గెలిచిందని, ప్రధాని మోదీ(PM Modi), కేంద్రమంత్రి అమిత్‌షా(Amith Shah) హాజరైన ఫైనల్ మ్యాచ్‌ మాత్రం ఓడిపోయిందని అన్నారు. వాళ్లు రావడం వల్లే భారత్ కప్ గెలుచుకోలేక పోయిందని విమర్శించారు. మోదీ(PM Modi), అమిత్‌షా(Amith Shah) లాంటి పాపాత్ములు రావడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలో(Kolkata) పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో కాకుండా కోల్‌కత్తాలోనే, ముంబయిలోనో ఫైనల్ మ్యాచ్(Final Match) పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ (World Cup) గెలిచి ఉండేదని అన్నారు. కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్(Practice) చేశారని అన్నారు. 

"కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens)లోనో లేదంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనో(Wankhede Stadium) వరల్డ్ కప్(World Cup) ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే భారత్ కచ్చితంగా కప్ గెలిచేది. వాళ్లు కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని చూశారు. కానీ మన ప్లేయర్స్ అందుకు ఒప్పుకోలేదు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు(jerseys) వేసుకున్నారు. క్రీడలకు సంబంధించిన అన్ని ఫెడరేషన్స్‌పైనా రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతోంది. క్రికెట్‌లోనే కాదు కబడ్డీలోనూ కాషాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ రంగు త్యాగానికి నిదర్శనం. కానీ బీజేపీకి(BJP) ఆ స్థాయి లేదు" అని మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. 

అంతకు ముందు కూడా మమతా బెనర్జీ(Mamata Banerjee) బీజేపీపై(BJP) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా పలు కీలక సంస్థలపై కాషాయాన్ని రుద్దేందుకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు. "ఇప్పుడు బీజేపీ ప్రతిదాన్నీ కాషాయంతో నింపేయాలని చూస్తోంది. ఇండియన్ ప్లేయర్స్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వాళ్లు కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. కానీ బీజేపీ(BJP) మాత్రం వాళ్ల జెర్సీలను కూడా కాషాయ రంగులోకి మార్చేయాలని చూస్తోంది. బ్లూ జెర్సీలను కాషాయంగా మార్చేయాలని చూస్తున్నారు" అని మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ 2023 (ODI World Cup 2023) ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో(Lucknow) పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని, ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేదని  అన్నారు. వరల్డ్‌ కప్‌లో(World Cup) వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది.  ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

అయితే ప్రపంచకప్(World Cup) ఆఖరి మెట్టుపై టీమిండియా(Team India) బోల్తా పడింది. ఆరోసారి ఆస్ట్రేలియా(Australia) జట్టు విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. మూడో సారి కప్ గెలవాలన్న టీమిండియా ఆశ గంగపాలైంది. నాకౌట్ పోరులో మరోసారి టీమిండియా(Team India) నిరాశపర్చింది. 241 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో.. ఆరు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137 పరుగులు; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో హీరోగా నిలిచాడు. అతనికి మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 58 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు) సహకరించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ కి చెరో వికెట్ దక్కింది.