ముస్లిం విద్యార్థిని చంప దెబ్బ కొట్టమంటూ ప్రేరేపిస్తున్న టీచర్

ఎలక్షన్లు దగ్గర పడుతున్న వేళ ప్రతి పార్టీలోని సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిజెపి తమ వైపు ఇటీవల నరేంద్ర మోదీ ఎంపీలతో మాట్లాడుతూ, ప్రజలకు మరింత దగ్గర కావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే, బిజెపి సపోర్ట్ చేస్తూ ఉంటున్న కొంతమంది ప్రజలు తమ పార్టీల మీద బురదజల్లే కొన్ని పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.  ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని ఒక స్కూల్లో ఒక అనుకోని సంఘటన […]

Share:

ఎలక్షన్లు దగ్గర పడుతున్న వేళ ప్రతి పార్టీలోని సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిజెపి తమ వైపు ఇటీవల నరేంద్ర మోదీ ఎంపీలతో మాట్లాడుతూ, ప్రజలకు మరింత దగ్గర కావాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే, బిజెపి సపోర్ట్ చేస్తూ ఉంటున్న కొంతమంది ప్రజలు తమ పార్టీల మీద బురదజల్లే కొన్ని పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని ఒక స్కూల్లో ఒక అనుకోని సంఘటన చోటు చేసుకోగా ఇప్పుడు స్కూల్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అధికార పార్టీ బిజెపి కావాలని ఇలాంటివి చేయిస్తుందని, ఇతర మతాలను కించపరిచేలా పనులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఈ వీడియో చూసి భారతదేశం ఏమైపోతుందో అని ఆలోచనలో పడ్డారు. 

ఆ వీడియోలో ఏముంది: 

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక స్కూలులో స్వయంగా టీచర్ కొంతమంది స్టూడెంట్స్ చేత ముస్లిం పిల్లవాడి చంపను కొట్టమంటూ ప్రేరేపించిన వీడియో వైరల్ గా మారింది. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన టీచర్లు ఇలాంటి పనులకు పాల్పడడం నిజంగా భారతదేశం సిగ్గుపడాల్సిన విషయంలా అనిపిస్తోంది. చిన్నతనం నుంచే పిల్లలలో మతాల చిచ్చు పెడుతున్న ఆ టీచర్ ని వదిలిపెట్టకూడదంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 

ఇప్పటినుంచి మతాల పేరుతో స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్న ఆ టీచర్ ని వెంటనే శిక్షించాలి అంటున్నారు నెటిజెన్లు. పిల్లలను తీర్చిదిద్దవలసిన టీచర్ ఒక ముస్లిం పిల్లవాడిని క్లాస్ మధ్యలో నిల్చోపెట్టి, ఇతర మతాలకు చెందిన పిల్లల చేత చెంప దెబ్బలు కొట్టిస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా ఉండాలంటూ, ప్రతి పార్టీ నేతలు సోషల్ మీడియాలో టీచర్ చేసిన అరాచకాన్ని ఎత్తిచూపుతున్నారు. 

స్పందించిన రాహుల్ గాంధీ: 

ఇలాంటి టీచర్లను తాము ఎప్పుడూ చూడలేదని, చిన్న వయసు నుంచే మతాల పేరుతో విడదీస్తున్న ఈ టీచర్ ని కచ్చితంగా శిక్షించాలని పదేపదే చెప్తున్నారు రాహుల్ గాంధీ. అంతేకాకుండా ఇది కచ్చితంగా బిజెపి రేపిన చిచ్చు మాత్రమే అంటూ మాట్లాడారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును నాశనం చేసే క్రమంలో బిజెపి చిచ్చు మొదలుపెట్టి దానిమీద ఆజ్యం పోస్తున్నట్లు ఆయన మరింత నొక్కి చెప్పారు. పిల్లలకు ఇలాంటివన్నీ నేర్పించడం మానేసి కలిసికట్టుగా ప్రేమానురాగాలతో ఉండాలని పాఠాలు నేర్పాలి అంటూ టీచర్ కి గుర్తు చేశారు. అయిన ట్విట్టర్ లో ఈ వీడియో చూసిన అనంతరం స్పందిస్తూ, పిల్లల విషయంలో ఎలాంటి పొరపాట్లు మరెన్నడూ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ నొక్కి చెప్పారు రాహుల్ గాంధీ. 

ఇటీవల చదువుకున్న వారికి ఓటు వేయమన్నందుకు వేటు: 

నెక్స్ట్ టైం ఓటు వేస్తున్నప్పుడు ఈ విషయం మర్చిపోకండి, బాగా చదువుకున్న వారికి ఓటు వేయండి అంటూ, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదని.. చదువుకున్న మరియు విషయాలను అర్థం చేసుకునే వ్యక్తిని ఎన్నుకోండి. పేర్లు మార్చడం మాత్రమే తెలిసిన వారిని ఎన్నుకోవద్దని.. సరిగ్గా నిర్ణయించుకోండి,అని ఆన్‌లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అనాకాడెమీకి చెందిన విద్యావేత్త కరణ్ సాంగ్వాన్, దేశంలోని నేర న్యాయ వ్యవస్థను సరిదిద్దడానికి ప్రభుత్వం ఇటీవలి తీసుకువచ్చిన బిల్లులను గురించి విద్యార్థులకు బోధిస్తున్న సందర్భంలో ఈ విషయాలు చెప్పడం జరిగింది. పిల్లలకు ఓటు వేసే విషయంలో సలహాలు ఇచ్చినందుకు ఆయనని సస్పెండ్ చేశారు అకాడమీ. 

సంగ్వాన్ ఆన్లైన్ వీడియో వైరల్ గా మారడంతో చాలా మంది తాను బిజెపి గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, సంగ్వాన్ అనాకాడెమీ తరుపున ఇలా మాట్లాడి ఉండొచ్చు అంటూ, తాను యాంటీ మోదీ సిస్టం గురించి పని చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వర్షం కురిసింది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఈ వైరల్ గా మారిన వీడియో చూసిన మరి కొంతమంది, సంగ్వాన్ మాటలకు సపోర్ట్ చేస్తూ, తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.