2020 నాటికి టీడీపీ పోల‌వరం పూర్తిచేసేది

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక పాలనలో ఉన్నట్లయితే, ఈనాడు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో ముగింపు దశకు వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు అది 2030 నాటికైనా పూర్తయ్యేటట్టు కనిపించట్లేదు అని చెప్పారు. ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఏమన్నారు?:  శనివారం విశాఖపట్నంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పోలవరం ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లక పోవడానికి కారణం గవర్నమెంట్ రీవర్స్ […]

Share:

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక పాలనలో ఉన్నట్లయితే, ఈనాడు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో ముగింపు దశకు వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు అది 2030 నాటికైనా పూర్తయ్యేటట్టు కనిపించట్లేదు అని చెప్పారు.

ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఏమన్నారు?: 

శనివారం విశాఖపట్నంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పోలవరం ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లక పోవడానికి కారణం గవర్నమెంట్ రీవర్స్ టెండరింగ్ ప్రాసెస్ చేయడమే కారణమన్నారు. అంతేకాకుండా, ఫ్లడ్ మేనేజ్మెంట్ ని కూడా అరికట్టలేకపోతున్నారని, గవర్నమెంట్ ఐఐటి హైదరాబాదులో ఉన్న ఎక్స్పర్ట్స్ తో కొలాబరేట్ అయిందని ఎమ్మెల్యే తెలిపారు.

చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పటికీ చాలా బాగా అదుపు చేసేవారని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి లాభాలు లేవని అన్ని నష్టాలేనని జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించడం జరిగింది.

టిడిపి పాలన ఉంటే: 

టిడిపి పాలనలో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు అమలు చేసి వాటిని విజయవంతం చేశారని, రాష్ట్రం లో కూడా చాలా కీలకమైన మార్పులు తెచ్చారని, ఇప్పుడుగాని తెలుగుదేశం పార్టీ పాలనలో ఉంటే ఎప్పుడో ప్రాజెక్టు పూర్తయి ఉండేదని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి మార్పులు లేవని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాదని జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎలక్షన్లో ప్రజల ఎవరు కూడా వైయస్సార్ సిపి పార్టీకి ఓట్లు వేయరని చెప్పారు. ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకుంటారు అని చెప్పుకొచ్చారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మరింత: 

పోలవరం ప్రాజెక్ట్ ఏలూరు డిస్ట్రిక్ట్ మరియు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గోదావరి నదిలో స్థాపింపబడునుంది. ఇది రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు పూర్తవలేదు. ఈ ప్రాజెక్టు 2004లో మొదలైంది. అయితే 2025 నాటికి ముగింపు దశకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హయాంలో ఉంది. ఇది పూర్తి చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని వల్ల కలిగిన ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఇరిగేషన్ మరియు వాటర్ సప్లై. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం మరియు వివిధ ప్రాంతాలకు జలాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే అలా ఊర్లకు నీటి సరఫరా మరియు విద్యుత్ సరఫరా చేయొచ్చని, చాలా వరకు రైతుల పంట పొలాలకు సాగునీరు అందించవచ్చుని, ఇవన్నీ పోలవరం ప్రాజెక్టుకు ప్రధమ అంశాలని అందుకోసమే ప్రాజెక్ట్ ప్రవేశపెట్టినట్లు కొంతకాలం క్రితం గవర్నమెంట్ చెప్పింది.

అయితే టిడిపి కి చెందిన నిమ్మల రామనాయుడు పోలవరం ప్రాజెక్టుపై కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పై కొన్ని విమర్శలు చేశాడు. 2004లో మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం సరికాదని చెప్పారు. 

అయితే 2025 నాటికి దాన్ని పూర్తి చేస్తారని అందులో తిరుగు లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు అది 2030 నాటికైనా పూర్తి అయ్యేలా లేదని ముఖ్యమంత్రి వన్నీ కట్టు కథలు చెబుతున్నారని టిడిపి ఎమ్మెల్యే చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు పాలనలో ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని చెప్పారు