Chandrababu Legal Mulakat: చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారుల కోత

చంద్రబాబు(Chandrababu) లీగల్ ములాఖత్( Legal Mulakat) లపై అధికారులు కోత పెట్టారు. ఇక నుంచి రోజుకు ఒకసారి మాత్రమే న్యాయవాదులను చంద్రబాబు ములాఖత్ కు అనుమతిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలపై టీడీపీ(TDP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్(Legal Mulakat) లకు అధికారుల కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్ లను ఒకటికి కుదిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. చంద్రబాబు ములాఖత్ ల వల్ల సాధారణ […]

Share:

చంద్రబాబు(Chandrababu) లీగల్ ములాఖత్( Legal Mulakat) లపై అధికారులు కోత పెట్టారు. ఇక నుంచి రోజుకు ఒకసారి మాత్రమే న్యాయవాదులను చంద్రబాబు ములాఖత్ కు అనుమతిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలపై టీడీపీ(TDP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఇచ్చే లీగల్ ములాఖత్(Legal Mulakat) లకు అధికారుల కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్ లను ఒకటికి కుదిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. చంద్రబాబు ములాఖత్ ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు అంటున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతుంది. 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ ప్రభుత్వం చెపుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్ లను కూడా కుదించడం కుట్రే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read More: Narendra Modi: 2040 నాటికి భారతీయుడిని చంద్రుడి పైకి పంపాలి

న్యాయపోరాటం జాప్యం చేసేందుకే

ఏసీబీ(ACB), హైకోర్టు(Highcourt), సుప్రీం కోర్టు(Supreme Court)లో చంద్రబాబుపై కేసుల విషయంలో విచారణ జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదులతో చంద్రబాబు సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు అంటున్నారు. చంద్రబాబు న్యాయపోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు చేస్తుందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతల మండిపడుతున్నారు.

ప్రభుత్వ కుట్రే

చంద్రబాబుకు లీగల్ మలాఖత్(Legal malakhat) ల కుదింపు ప్రభుత్వ కుట్రే అని టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఇచ్చే లీగల్ ములాఖత్ లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కేసుల్లో సరైన విధంగా న్యాయ పోరాటం చేయకుండా చేసేందుకు ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్ పై ఆంక్షలు పెట్టిందని టీడీపీ నేతలు(TDP Leaders) ఆరోపించారు. 39 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబును రోజూ రెండు సార్లు తన అడ్వకేట్లు కలుస్తున్నారు. అయితే నిన్నటి నుంచి రోజుకు ఒక్కసారి మాత్రమే ములాఖత్ ఉంటుందని అధికారుల తేల్చి చెప్పారు. చంద్రబాబు(Chandrababu)పై కేసుల మీద కేసులు పెడుతున్నారని….వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పారు. అయితే ప్రభుత్వం లీగల్ ములాఖత్ లను తగ్గించడం ద్వారా లీగల్ ఫైట్ లో చంద్రబాబు ముందుకు వెళ్లకుండా చూడాలన్న కుట్ర చేసిందని నేతలు ఆరోపించారు.

డీఐజీకి వినతి పత్రం

లీగల్ ములాఖత్ ల విషయంలో ఆంక్షలు తొలగించి… రోజుకు రెండుసార్లు ములాఖత్(Mulakhat) లకు అవకాశం ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యేలు చిన రాజప్ప, బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కెఎస్ జవహర్, జెవి అప్పారావు (నెహ్రూ), ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, రామకృష్ణారెడ్డి, శేషారావు, వెంకటరాజు, రాజానగరం ఎమ్మెల్యే బివి రమణ చౌదరి మంగళవారం జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌(DIG Ravi kiran)ను కలిశారు. ఆయనకు మెమోరాండం సమర్పించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని డీఐజీని కోరారు.

మరోవైపు చంద్రబాబుకు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికను ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే అందజేసినందున.. వారు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు విజయవాడ ఏసీబీ(ACB) న్యాయస్థానంలో కౌంటర్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలిచ్చారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను తమకు ఇవ్వటానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని గురువారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్‌ అమలును ఈ నెల 20వ తేదీ వరకూ వాయిదా వేయాలని కోరుతూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.