తమిళనాడుని పట్టిపీడిస్తున్న అనీమియా వ్యాధి.. దీనికి శాశ్వత పరిష్కారమే లేదా..?

తమిళనాడులో ఎప్పటి నుండో పట్టిపీడిస్తున్న వ్యాధి అనీమియా. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దీనిపై ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోయాయి. రీసెంట్‌గా DMK ప్రభుత్వం విడుదల చేసిన 2023 – 2024 హెల్త్ పాలసీలలో అనీమియాని శాశ్వతంగా అరికట్టే మార్గాలు, అందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించింది. కానీ ఈ అనీమియా వ్యాధి గురించి ప్రత్యేకమైన డ్రైవ్స్ ఏర్పాటు చెయ్యడం పై ఎలాంటి సూచనలు లేవు. ప్రధాన మంత్రి చేపట్టిన నేషనల్ అనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రాం […]

Share:

తమిళనాడులో ఎప్పటి నుండో పట్టిపీడిస్తున్న వ్యాధి అనీమియా. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దీనిపై ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోయాయి. రీసెంట్‌గా DMK ప్రభుత్వం విడుదల చేసిన 2023 – 2024 హెల్త్ పాలసీలలో అనీమియాని శాశ్వతంగా అరికట్టే మార్గాలు, అందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించింది. కానీ ఈ అనీమియా వ్యాధి గురించి ప్రత్యేకమైన డ్రైవ్స్ ఏర్పాటు చెయ్యడం పై ఎలాంటి సూచనలు లేవు. ప్రధాన మంత్రి చేపట్టిన నేషనల్ అనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రాం లో ఉన్న గైడ్ లైన్స్‌కి తగ్గట్టుగా DMK ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2021 వ సంవత్సరం వరకు తమిళనాడులో చేపట్టిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 15 నుండి 49 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు అనీమియా వ్యాధి 53 శాతం వరకు సోకిందని, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మహిళలకంటే రూరల్ ప్రాంతాలలో ఉన్న మహిళలకు నాలుగు శాతం ఎక్కువ ఈ అనీమియా వ్యాధి ఉందని చెప్పుకొచ్చింది ఈ సర్వే.

అనీమియా వల్ల గర్భం దాల్చని మహిళలకు ఒక లీటర్ రక్తంలో 12 గ్రాముల హెమియోగ్లోబిన్ తక్కువ ఉంటుందని, అదే గర్భం దాల్చిన మహిళలకు 11 గ్రాములు హెమోయోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది అని తెలుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ విశ్లేషణ ప్రకారం.. ఇప్పటి నుండే ఈ అనీమియా వ్యాధిని అరికట్టకపోతే, 2025 వ సంవత్సరం నాటికి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుందని, అప్పుడు మన చేతుల్లో చెయ్యడానికి ఏమి మిగలదని చెప్పుకొచ్చింది. అయితే తమిళనాడు ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇండియాలో ఉన్న అన్నీ ప్రాంతాలకంటే తమ రాష్ట్రంలోనే అనీమియాని ఒక వయస్సు గ్రూప్‌లో ఉన్న ఆడవాళ్లకు 2015 నుండి 2016 వ సంవత్సరంతో పోలిస్తే 1.6 శాతం తగ్గించగలిగామని చెప్పుకొస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం ప్రతీ ఏడాది అనీమియా వ్యాధి వ్యాప్తిని ౩ శాతం తగ్గించాల్సి ఉంది.

ఈ టార్గెట్ ని అందుకోవడం కోసం తమిళనాడు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకుంది. అనీమియా వ్యాధి సోకినా స్త్రీలకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడడమే కాకుండా, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి మెటర్నిటీ స్కీం క్రింద పావర్టీ లైన్ కంటే క్రింద ఉన్న మహిళలకు మెటర్నల్ న్యూట్రిషన్ కిట్స్‌ని అందచేస్తున్నారు. ఈ కిట్‌లో ఎడిబుల్ హెల్త్ మిక్స్, ఐరన్ సిరప్ , ఖర్జూరాలు , నెయ్యి మరియు అల్బెన్దజోల్ టాబ్లెట్స్ ఉంటాయి. గర్భం లేని మహిళలకు కూడా తమిళనాడు ప్రభుత్వం అనీమియా విషయంలో సేవలు అందిస్తుంది. అయితే ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పుడు అనీమియాని 2022 వ సంవత్సరం లోపు అనీమియా ని 55 శాతం నుండి 37 శాతానికి తగ్గిస్తాము అంటూ మాట ఇచ్చింది. కానీ ఈ టార్గెట్‌ని ప్రభుత్వం ఎంత వరకు చేరుకుందో మన అందరికీ తెలిసిందే. అనీమియా వ్యాధి గురించి ప్రత్యేకమైన అవగాహనా సదస్సులు, ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేకమైన డ్రైవ్స్ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటివి అన్నీ చేసి ఉంటే ఈరోజు తమిళనాట అనీమియా పీడిత మహిళలు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకొని ఈ మహమ్మారి నుండి ఆడవాళ్లని కాపాడాలని ఆశిద్దాం.