ఈ ఏనుగు 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొని ఇప్పుడు 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది

60 ఏళ్ల వయసులో ‘కుమ్కి’ ఏనుగు పదవీ విరమణ గురించి ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అయిన సుప్రియా సాహు మాట్లాడుతూ.. కోజికాముట్టికి చెందిన..  ‘కలీం’ అనే ఏనుగు తమిళనాడు రాష్ట్రం లోని అన్నమలై టైగర్ రిజర్వ్‌ లోని 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొందని తెలియ జేశారు. గార్డ్ ఆఫ్ హానర్ వేడుకకు హాజరైనప్పుడు తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఓ వీడియోను పంచుకుని సుప్రియా సాహు […]

Share:

60 ఏళ్ల వయసులో ‘కుమ్కి’ ఏనుగు పదవీ విరమణ గురించి ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అయిన సుప్రియా సాహు మాట్లాడుతూ.. కోజికాముట్టికి చెందిన..  ‘కలీం’ అనే ఏనుగు తమిళనాడు రాష్ట్రం లోని అన్నమలై టైగర్ రిజర్వ్‌ లోని 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొందని తెలియ జేశారు.

గార్డ్ ఆఫ్ హానర్ వేడుకకు హాజరైనప్పుడు తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఓ వీడియోను పంచుకుని సుప్రియా సాహు ఇలా వ్రాశారు, “తమిళనాడులోని కోజియాముట్టి ఏనుగు శిబిరంలోని ఐకానిక్ కుమ్కీ ఏనుగు కలీం ఈ రోజు 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేయడంతో మా కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న ఈ ఏనుగు ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. ఈ ఏనుగు కలీమ్ కు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌మెంట్ నుండి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది.” 

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ.. మహౌత్ మణికి (ఏనుగుల హ్యాండ్లర్), కలీం తన అన్నయ్య లాంటివాడని చెప్పింది. “ఈ పదవీ విరమణ వేడుకలో నేను పాల్గొనడం నాకు ఎంతో గౌరవప్రదం. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని ఆమె రాశారు.

కుమ్కీ ఏనుగులంటే శిక్షణ పొందిన క్యాప్టివ్ జంబోలు. వీటిని అడవి ఏనుగులను పట్టుకోవడానికి, అలాగే గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగులను రక్షించడానికి లేదా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ‘కుమ్కి’ అనే పదం పర్షియన్ పదం కుమక్ నుండి వచ్చింది, దీని అర్థం ‘సహాయం’, దీనిని మహౌత్ లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

‘కుమ్కి’ ట్యాగ్‌ ఇచ్చే ముందు ఈ ఏనుగులకు విస్తృతమైన శిక్షణ ఉంటుంది. ఇవి హిందూ దేవాలయాలలో కనిపించే ఏనుగుల లాంటివి కావు. వీటికి ఇచ్చే శిక్షణ వీటిని ప్రత్యేకమైన వాటిగా గుర్తింపు నిస్తుంది.

పలువురు జంతు హక్కుల కార్యకర్తలు ఈ శిక్షణా విధానంపై ఫిర్యాదు చేశారు. జనవరిలో కేరళలోని పాలక్కాడ్, వాయనాడ్ జిల్లాల్లో ఇటీవల రెండు అడవి ఏనుగులను పట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన అడవి ఏనుగులకు చట్టవిరుద్ధంగా కుమ్కీలుగా మార్చడానికి శిక్షణ ఇస్తున్నారు. ఇవి మిగతా ఏనుగులను ట్రాప్ చేయడానికి, పట్టుకోవడానికి ఆపరేషన్‌ లలో ఉపయోగించే క్యాప్టివ్ పాచిడెర్మ్‌లు అని పేర్కొన్నారు.

భారత దేశంలో ఏనుగుల శిక్షణ చట్టవిరుద్ధమని, ‘కుమ్కీ’ ఏనుగులకు శిక్షణ ఇస్తూ కేరళ 

ప్రభుత్వం 2018లో జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

“వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం.. ఏ ఉద్దేశానికైనా అనుమతి ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పరిపాలనా అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారాలు 1982 లో సవరణ ద్వారా తొలగించబడ్డాయి” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘కుమ్కి’ ఏనుగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటిని ఉపయోగించడం కూడా చట్ట విరుద్ధమని, శిక్షణా పద్ధతులు క్రూరంగా ఉన్నాయని, వాటిని మచ్చిక చేసుకునేందుకు ఈ ఏనుగులకు నీరు, ఆహారం ఇవ్వకుండా చేస్తున్నారని ఈ పిటిషన్‌ లో పేర్కొన్నారు.