తమిళనాడులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

ఎంతోమంది చదువుకోడానికి, కోచింగ్ తీసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి అనుకోని సంఘటనలు ఎదురై చివరికి తమ ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ఒక సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మెడికల్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించిందని, ఆత్మహత్య చేసుకుందని ఆదివారం పోలీసులు తెలిపారు.  సూసైడ్ నోట్ లో ముగ్గురి పేర్లు:  శ్రీ మూకాంబిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SMIMS)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి […]

Share:

ఎంతోమంది చదువుకోడానికి, కోచింగ్ తీసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లి అనుకోని సంఘటనలు ఎదురై చివరికి తమ ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ఒక సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మెడికల్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించిందని, ఆత్మహత్య చేసుకుందని ఆదివారం పోలీసులు తెలిపారు. 

సూసైడ్ నోట్ లో ముగ్గురి పేర్లు: 

శ్రీ మూకాంబిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SMIMS)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గురైంది. ఆమె గదిలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

తన సూసైడ్ నోట్‌లో, ఆమె తన ప్రొఫెసర్లు మరియు సీనియర్‌ల పేర్లు మెన్షన్ చేసింది. అదేవిధంగా, “లైంగిక వేధింపులు”, “సీనియర్ టాక్సిసిటీ”, “మానసిక వేధింపులు” కారణంగా తను బాధించబడిందని, చివరిసారిగా తన తండ్రికి “సారీ అప్పా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను” అని సూసైడ్ నోట్ లో రాస్కొచ్చింది.

గ్రీన్ మార్కర్‌తో, మనోవేదనకు, డిప్రెషన్కు గురైన వాళ్ళు బయటకి సంతోషంగా కనిపిస్తారని.. అలాంటి వాళ్ళ మీద దయతో ఉండండి అంటూ.. వారిని జడ్జ్ చేయడం మానేసి, అలాంటి వాళ్ళకి అండగా ఉండడం నేర్చుకోవాలి అంటూ నోట్ ద్వారా తెలియజేసింది బాధితురాలు.

జరగనున్న విచారణ: 

ఈ విషయం మీద పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం వరుసగా రెండో రోజు, బాధితురాలి సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వాళ్లని ప్రశ్నిస్తున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్‌ను షేర్ చేసిన తమిళనాడు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎం రవి ఐపిఎస్ కారణంగా ఈ విషయం మరింత బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంతో మంచి చదువులు చదువుకోవాలని ఆశతో ఉన్న అమ్మాయి మరణానికి కారణం గల వారందరినీ కూడా తప్పకుండా శిక్షించాలని, ఆమెకు న్యాయం జరగాలని, ఇలాంటివి మరి ముందు జరగకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న గాయని చిన్మయి కూడా ఆ అమ్మాయి ఆత్మహత్య వెనక గల కారణాలు గురించి మరింత దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు, వైద్య విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో అదేవిధంగా ఇంటర్న్‌షిప్‌ల సమయంలో తరచుగా లైంగిక వేధింపులను గురవుతున్నట్లు మరొకసారి గుర్తు చేశారు. 

ఆత్మహత్యలు వద్దు: 

ప్రపంచంలో ఉన్న కోట్ల జనంలో ఎవరో ఒకరికి ఏదో ఒక క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన రావడం కామన్. అటువంటి ఆలోచనలు వచ్చినంత మాత్రాన మనిషి బలహీన పడినట్లు కాదు, నిరంతరంగా ఆలోచించడం వల్ల, అనవసరమైన ఆలోచనలు కారణంగా, మనిషి ఆలోచన విధానం పక్కదారి పట్టి ఆత్మహత్య అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మాకే ఎందుకు వస్తున్నాయి అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇటువంటి ఆలోచనలు చేయడం సహజం. కానీ ఇటువంటి ఆలోచనలు మరింత ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. 

మీకు ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను ఆశ్రయించడం మంచిది. . మీకు బాగా కావాల్సిన వారిని, మీరు నమ్మిన వారిని సంప్రదించి మీకు వస్తున్న ఆలోచనల గురించి మాట్లాడండి. ఒకవేళ మీరు ఎవరుని సంప్రదించాలో తెలియని క్రమంలో, క్రైసిస్ కౌన్సెలర్ ను సంప్రదించడం ఎంతో మొత్తం. వారు దయతో వింటారు.. సలహా ఇస్తారు.

మీకు మీరుగా అటువంటి ఆలోచనల నుంచి బయటికి రావాలని పదేపదే అనుకోండి. అటువంటి ఆలోచనల నుంచి పక్కదారి పట్టించే మరెన్నో విషయాలు ఉన్నాయని గ్రహించండి. ముఖ్యంగా చెప్పాలంటే, మీరు ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటూ సమయాన్ని గడపొచ్చు. శ్వాసను అనుసరిస్తూ ప్రశాంతంగా మారొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మీ ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.