Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో వింత ఆచారం 

Tamil nadu: ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం (Ritual) మనకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని యుగాల నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాలు చాలామందికి వింతగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆచారాలు భయానకంగా కూడా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు కూడా పాటిస్తారా! అనే అభిప్రాయం మనకి కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఒక ఆచారం (Ritual) తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం (State)లో ఉంది. వృద్ధులను (Elderly people) మరణించేలా చేసే ఒక ఆచారం (Ritual) అక్కడ పాటించడం […]

Share:

Tamil nadu: ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం (Ritual) మనకి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని యుగాల నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాలు చాలామందికి వింతగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆచారాలు భయానకంగా కూడా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు కూడా పాటిస్తారా! అనే అభిప్రాయం మనకి కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఒక ఆచారం (Ritual) తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం (State)లో ఉంది. వృద్ధులను (Elderly people) మరణించేలా చేసే ఒక ఆచారం (Ritual) అక్కడ పాటించడం జరుగుతుంది.

తమిళనాడు రాష్ట్రంలో వింత ఆచారం: 

భారతదేశం విభిన్న సంస్కృతి కారణంగా భారతదేశాన్ని వైవిధ్య దేశం అని పిలుస్తారు, ప్రతి రాష్ట్రం (State)లో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు (Ritual) మరియు సంప్రదాయాలు (tradition) మనం చూడొచ్చు. కొన్ని ఆచారాలు మనకి ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. ప్రత్యేకించి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మనకి ఆచారాలు, మూఢనమ్మకాలు కనిపిస్తుంటాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం (State)లో ఎప్పటినుంచో వస్తున్న అటువంటి ఆచారం (Ritual) తలైకూతల్. ఈ ఆచారం (Ritual)లో ప్రత్యేకించి వృద్ధుల గురించి ప్రస్తావన ఉంటుంది. దీనిని సెనిసైడ్, అంటే ఇక్కడ వృద్ధులను చంపడం అని పిలుస్తారు. తమిళనాడు (Tamil Nadu)లోని అనేక దక్షిణ ప్రాంతాలలో ఒకరి సొంత కుటుంబ సభ్యులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. 

ఈ సంప్రదాయంలో భాగంగా, తుది శ్వాసతో ఉన్న వృద్ధులు (Elderly people) లేదా కోమాలో ఉన్న వృద్ధుల బాధను చూడలేక.. సాంప్రదాయం (tradition)లో భాగంగా, తుది శ్వాసతో ఉన్న వృద్ధులకు (Elderly people) మరణశిక్ష విధిస్తుంటారు. సాధారణంగా, ఈ సాంప్రదాయాన్ని ఆచరించే సమయాన, వృద్ధులకు ఉదయాన్నే నూనెతో స్నానం చేయిస్తారు, ఆపై కొబ్బరి నీళ్లను వృద్ధులకు తాగిస్తారు. ఇలా చేయడం వల్ల వృద్దులకు లివర్ ఫెయిల్ అవ్వడం, శరీరానికి అధిక ఉష్ణోగ్రత కలగడం, మూర్ఛ రావడం.. ఇలా ఒకటి లేదా రెండు రోజుల్లో, వృద్ధుల (Elderly people) మరణానికి కారణమవుతుంది.

ఇందులో చాలా రకాలు ఉంటాయి: 

తమిళనాడు (Tamil Nadu) తలైకూతల్ సాంప్రదాయం (tradition)లో భాగంగా, వృద్ధుల (Elderly people) మరణానికి కారణమయ్యే కొన్ని విషయాలను నిర్వహిస్తుంటారు. అయితే ఇందులో భాగంగా వృద్ధుల (Elderly people)కు చన్నీళ్లతో తల మర్దన చేయడం వంటిది. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోయి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సాంప్రదాయం (tradition)లో భాగంగా వృద్ధుల (Elderly people)కు మరణం సంభవించేందుకు వృద్ధుల (Elderly people) ముక్కు ద్వారా విషాన్ని పంపించడం, లేదంటే ఆవు పాలు పోయడం కారణంగా ఊపిరి ఆడకుండా మరణం సంభవించవచ్చు. దీన్నే మిల్క్ థెరపీ అంటారు. ఒక్కోసారి వృద్ధుల (Elderly people)కు మట్టి కలిపిన నీళ్లు తాగిస్తూ ఉంటారు, ఇలా చేయడం వల్ల వృద్ధుల (Elderly people)కు పొట్ట పాడవడం వల్ల మరణానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇలా తమిళనాడు (Tamil Nadu)లో వృద్ధుల (Elderly people) మరణానికి కారణమయ్యే కొన్ని సంప్రదాయాలు నడుస్తున్నాయి. 

భారతదేశంలో ఇటువంటి సాంప్రదాయాలు చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, తలైకూతల్ చాలా కాలంగా సమాజంలో ఒక రకంగా వృద్ధుల (Elderly people)కు దయతో ఇస్తున్న మరణశిక్షగా చలామణి అవుతుంది. ఆ సమాజంలో ఉన్న ఇటువంటి కొన్ని ఆచారాలు కొన్నిసార్లు మరింత తీవ్రమైన దుర్వినియోగానికి దారి తీస్తున్నాయి. తమ వృద్ధుల (Elderly people)ను చూసుకునే స్తోమత లేకపోవడంతో నిరుపేదలు మరియు పేదరికంలో ఉన్న కుటుంబాలు ఎక్కువగా, తమిళనాడు (Tamil Nadu)లో ఉంటున్న ప్రాంత ప్రజలు తలైకూతల్‌ను ఎంచుకుంటాయని నమ్ముతారు. 

మీరేమనుకుంటున్నారు?: 

ప్రపంచంలో ఎన్ని ఆచారాలు ఉన్నప్పటికీ చంపడం అనేది నిజంగా ఒక పాపం. వృద్ధుల (Elderly people)కు దయతో మరణ బిక్ష వేస్తున్నామంటూ ఉన్న సాంప్రదాయం (tradition) గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి మనసు భయంతో మరోపక్క బాధతో కృంగిపోతుంది. మన కోసం ఎన్నో చేసిన మన పెద్దవాళ్ళను మన చేతులతోనే మరణశిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్? మన కోసం ఎన్నో త్యాగాలు చేసి, మనకు భవిష్యత్తు ఉండేలా చేసిన వృద్ధుల (Elderly people)ను సాంప్రదాయం (tradition) పేరుతో చనిపోయేలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు పబ్లిక్.