టమోటా రైతులను మోసం చేసిన తమిళనాడు దంపతులు

ప్రస్తుతం దేశంలో నిత్యవసర సరుకుల ధరలు ఏ విధంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మరీ ముఖ్యంగా గత ఏడాది వరకు రోడ్డు కిరువైపులా ఎక్కడ చూసినా ట్రక్కుల కొద్దీ టమోటాలను రోడ్ల పైన వదిలేసిన రైతులు.. వారి బాధను మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు టమోటా కు గిట్టుబాటు ధర లేక అమ్ముడు పోలేక టమాటాలను చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేశారు.ఈ  టమోటాల కారణంగా చాలామంది నష్టపోయిన విషయం తెలిసిందే అయితే […]

Share:

ప్రస్తుతం దేశంలో నిత్యవసర సరుకుల ధరలు ఏ విధంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మరీ ముఖ్యంగా గత ఏడాది వరకు రోడ్డు కిరువైపులా ఎక్కడ చూసినా ట్రక్కుల కొద్దీ టమోటాలను రోడ్ల పైన వదిలేసిన రైతులు.. వారి బాధను మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు టమోటా కు గిట్టుబాటు ధర లేక అమ్ముడు పోలేక టమాటాలను చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేశారు.ఈ  టమోటాల కారణంగా చాలామంది నష్టపోయిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు అదే టమాట ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో రైతులకు మంచి ఆదాయం వస్తున్న సమయంలో కొంతమంది దుర్మార్గులు రైతులను మోసం చేసి టమాటాలను ఎత్తుకుపోతున్న వైనం రోజుకొకటి మనం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం టమాటా ధరలు రూ.120 నుంచీ రూ.150 వరకు ధర పలుకుతున్న నేపథ్యంలో రైతుల ఆశలకు మళ్లీ చిగుర్లు వచ్చాయనే చెప్పాలి. మొన్నటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించిన టమాటా రైతు నేడు ఈ టమాటాలతోనే కోటీశ్వరులు అవుతున్నారు.  మొన్నటికి మొన్న ఒక ప్రాంతంలో 12 ఎకరాలలో గత పది సంవత్సరాలుగా టమాటాలను పండిస్తున్న ఒక రైతు పూర్తిస్థాయిలో నష్టపోయారు. కానీ ఇదే సంవత్సరం ఆయన తన 12 ఎకరాలలో టమాటాలను పండించి ఏకంగా మూడు కోట్ల రూపాయలను సంపాదించారు. దీన్ని బట్టి చూస్తే రైతులకు టమాటాలు ఏ విధంగా కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ  టమాటా ధరలు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ కూడా ఇదే టమాటా ధరలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. కొంతమంది అమాయక ప్రజలు తమ పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో కొంతమంది దుండగులు వారిని కొట్టి చంపి మరీ వారి దగ్గర ఉన్న డబ్బులను లాకెళ్లిపోతున్నారు. ఇంకెంతమంది రాత్రికి రాత్రే పొలాల్లో ఉన్న టమోటాలను దొంగలిస్తున్నారు. ఇక్కడ తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు ఊహించని విధంగా టమాటా రైతును మోసం చేయడం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. 

అసలు విషయంలోకి వెళితే 2.5 టన్నుల టమోటాలతో కూడిన ఒక ట్రక్కును తమిళనాడు వేలూరు కి చెందిన దంపతులు హైజాక్ చేయడం ఇప్పుడు పలు సంచలనాలకు దారితీస్తోంది. అసలు విషయంలోకెళితే హైవే దొంగల ముఠాలో భాగంగా జులై 8వ తేదీన చిత్రదుర్గ జిల్లా హిరియూరు కు చెందిన రైతు మల్లేష్ టమోటాలతో నిండిన ట్రక్కును తీసుకెళ్తుండగా చిక్కజాల వద్ద అడ్డగించి అతని ట్రక్కు తమ కారును ఢీ కొట్టిందని పేర్కొంటూ హైవే దొంగల ముఠా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతు చెల్లించడానికి నిరాకరించడంతో.. రూ.2.5 లక్షలకు పైగా విలువైన 2.5 టన్నుల టమోటా లోడ్ చేసిన వాహనంతో ముఠా అతడి పై దాడి చేసి ట్రక్కు నుండి రైతును బయటకు నెట్టివేసింది. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంసి యారెడ్ పోలీసులు వాహనం తరలింపు పై నిఘా పెట్టి ముఠా గుట్టు రట్టు చేశారు.  అందులో తమిళనాడు కి చెందిన భాస్కర్ (28), అతని భార్య సింధూజ (26) ని శనివారం అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు అయితే మల్లేష్ కోలార్కు టమోటా రవాణా చేస్తుండగా బెంగళూరులో ఈ ముఠా ఆ రైతును ఇలా అడ్డగించినట్లు తెలుస్తోంది . ఇక త్వరలోనే ఆ ముగ్గురిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.