లొంగిపోయిన నక్సలైట్లకు సినిమా ఆఫర్లు

మరాఠీ నటి తృప్తి భోయిర్ మరియు చిత్ర నిర్మాత విశాల్ కపూర్‌లు గడ్చిరోలిలోని గిరిజనుల సంప్రదాయం ఆధారంగా ఒక చిత్రానికి పనిచేస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు సినిమాల్లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి వీలుగా రాష్ట్ర పోలీసులు చేస్తున్న ఒక ప్రయోగం లో భాగంగా శనివారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సినిమా పాత్ర కోసం జరిగిన ఆడిషన్‌లో పాల్గొన్నారు. మరాఠీ నటి తృప్తి భోయిర్ మరియు గడ్చిరోలిలోని గిరిజనుల సంప్రదాయం ఆధారంగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాత విశాల్ కపూర్ […]

Share:

మరాఠీ నటి తృప్తి భోయిర్ మరియు చిత్ర నిర్మాత విశాల్ కపూర్‌లు గడ్చిరోలిలోని గిరిజనుల సంప్రదాయం ఆధారంగా ఒక చిత్రానికి పనిచేస్తున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు సినిమాల్లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి వీలుగా రాష్ట్ర పోలీసులు చేస్తున్న ఒక ప్రయోగం లో భాగంగా శనివారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సినిమా పాత్ర కోసం జరిగిన ఆడిషన్‌లో పాల్గొన్నారు.

మరాఠీ నటి తృప్తి భోయిర్ మరియు గడ్చిరోలిలోని గిరిజనుల సంప్రదాయం ఆధారంగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాత విశాల్ కపూర్ ఆడిషన్ నిర్వహించారు. గిరిజనులు అధికంగా ఉండే జిల్లా గడ్చిరోలిలో రుతుక్రమంలో ఉన్న స్త్రీ తన ఇంటి బయట నిర్మించబడిన కుర్మఘర్ అని పిలువబడే గుడిసెలో ఉండాలనే పాత సంప్రదాయం ఉంది. గిరిజనుల సంప్రదాయం పేరుతో ఈ చిత్రానికి కుమ్రఘర్ అని పేరు పెట్టారు. 

ఆడిషన్స్ ఎవరు నిర్వహిస్తున్నారు: 

గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలోని నవజీవన్ కాలనీలో జరిగిన ఈ ఆడిషన్‌కు పురుషులు మరియు మహిళలు ఇద్దరూ హాజరయ్యారు. హాజరైన వారికి తృప్తి భోయిర్ మరియు విశాల్ కపూర్ ద్వారా వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి అనే దాని మీద, అంతేకాకుండా నటనలో కూడా శిక్షణ ఇచ్చారు.భవిష్యత్తులో లొంగిపోయిన నక్సల్స్‌కు సినిమాల్లో నటించే అవకాశం కల్పించడంతోపాటుగా, వారి తమ నటనలో తమ కెరీర్‌ను చక్కదిద్దుకునేందుకు ఈ చొరవ తీసుకోవడం జరిగిందని, ఇది తమకంటూ ఒక కొత్త గుర్తింపును ఏర్పరచుకోవడంలో దోహదపడుతుందని గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్, నీలోత్పాల్ తెలిపారు.

తృప్తి భోయిర్ మరియు విశాల్ కపూర్ అగ్ద్బామ్, తుజ్యా మజ్యా సంసారాల, కయే హావ్ మరియు టూరింగ్ టాకీస్ వంటి గొప్ప ప్రశంసలు అందుకున్న మరాఠీ చిత్రాలలో కలిసి పనిచేశారు. 

చాలామంది చిన్నతనంలోనే నక్సలైట్లలో చేరిపోయి సగం జీవితం అక్కడే గడిపిన తర్వాత తమలో మార్పు వచ్చి తిరిగి తమ సొంత ఊర్లకి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నక్సలైట్లు ఎంతోమంది ఉన్నారు. నక్సలైట్లు అయిన కారణంగా వారికి ఉపాధి కల్పించడానికి ఎవరు ముందుకు రావడానికి సాహసించరు. అందుకనే లొంగిపోయిన నక్సలైట్లకు కూడా ఒక ఉపాధి కల్పించేందుకు పోలీసులు ఒక వినూత్న ఆలోచన చేశారు. సినిమా రంగంలో తమకంటూ ఒక ఉపాధి కెరీర్ ని ప్రారంభించడానికి సినిమా వారి సహకారం ద్వారా నక్సలైట్లకు ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఆలోచన చేసిన పోలీసులకు అలాగే నటీనటులకు నిజంగా ప్రశంసలు అందుతున్నాయి. 

ప్రతిసారి కూడా పోలీసులు చాలా విషయాలలో వినూత్నమైన ఆలోచన చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడి చిన్న చిన్న పనులుడా చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న చిన్న చిన్న పిల్లలకు, పోలీసు వారు సహాయం చేసి, వారికి చదువుకునే వీలును కల్పిస్తూ వారిని స్కూల్లో చేర్చడం కూడా జరిగింది. అంతేకాకుండా కరోనా టైం లో కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో మందిని బయటి తిరగకుండా కాపలా కాసి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా డ్యూటీ చేశారు. ఎంతోమంది పోలీసులు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటూ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నారు. 

దొంగతనాలు, దోపిడీలు చేసే వారిని పట్టుకోవడమే కాదు తమకంటూ మంచి హృదయం ఉందని ప్రజలకు సహాయం చేయడం ద్వారా నిరూపించుకున్న పోలీసులు ఎంతో మంది ఉన్నారు. ముసలి వాళ్లకు, అనాధలకు, అంతెందుకు దొంగలని కూడా మంచి మనుషులుగా మార్చిన ఘనత పోలీసులకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు నక్సలైట్లు సైతం ఉపాధి కల్పిస్తూ మరొకసారి తమ మంచి మనసుని చాటుకున్నారు పోలీసులు.