ప్రియుడి కోసం క‌న్న కొడుకునే చంపేసింది

ఇది ఒక విషాదకరమైన సంఘటన, గుజరాత్ సూరత్ జిల్లాలో ఓ మహిళ తన రెండున్నరేళ్ల బాలుడిని హత్య చేసి, తన బిడ్డ కనిపించట్లేదని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కనిపించకుండాపోయిన బిడ్డ కోసం, పోలీసులతో కలిసి తల్లి కూడా వరుసగా మూడు రోజులు వెతుకుతున్నప్పటికీ, అతని ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టగా, తన బిడ్డ కనిపించట్లేదని కంప్లైంట్ చేసిన తల్లిపై […]

Share:

ఇది ఒక విషాదకరమైన సంఘటన, గుజరాత్ సూరత్ జిల్లాలో ఓ మహిళ తన రెండున్నరేళ్ల బాలుడిని హత్య చేసి, తన బిడ్డ కనిపించట్లేదని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కనిపించకుండాపోయిన బిడ్డ కోసం, పోలీసులతో కలిసి తల్లి కూడా వరుసగా మూడు రోజులు వెతుకుతున్నప్పటికీ, అతని ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టగా, తన బిడ్డ కనిపించట్లేదని కంప్లైంట్ చేసిన తల్లిపై పోలీసులకు అనుమానం వచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేశారు.

అసలు ఏం జరిగింది: 

సూరత్‌లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తున్న నయన మాండవి తన రెండున్నరేళ్ల బాలుడు వీర్ మాండవి కనిపించట్లేదని తల్లి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మూడు రోజులు వెతికినప్పటికీ తన కొడుకు ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత, తప్పిపోయిన పిల్లల కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను కూడా ఉపయోగించారు, కానీ పిల్లవాడు ఆచూకీ మాత్రం తెలియలేదు.

ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టగా, మహిళ పనిచేసిన నిర్మాణ స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు చిన్నారి బయటకు వెళ్లడం కనిపించకపోవడానికి గమనించారు. దీని ఆధారంగా చిన్నారి సైట్ నుంచి బయటకు వెళ్లలేదని తేల్చారు దర్యాప్తు చేసిన పోలీసులు. అయితే తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి, బాలుడు గురించి తన తల్లిని ప్రశ్నించగా ఆమె దగ్గర నుంచి సరైన సమాధానాలు రాలేదు.

ఇది ఎలా ఉండగా జార్ఖండ్‌లో నివాసం ఉంటున్న తన ప్రియుడి మీద ఆరోపణలు మోపి, తన బిడ్డను అతనే కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులకు తెలిపింది తల్లి. ఆ ఫిర్యాదు మేరకు, పోలీసులు మహిళ ప్రేమికుడిని సంప్రదించారు, కానీ సూరత్ లో అతను ఎక్కడ ఉండేది అనేది పోలీసులకు ఆచూకీ తెలియదు. అంతేకాకుండా అతను తానెప్పుడూ సూరత్ వెళ్లలేదని పోలీసులకు సమాచారం అందించాడు.

కొడుకును చంపినట్లు ఒప్పుకున్న మహిళ: 

అయితే తన బిడ్డ కనిపించట్లేదని ఫిర్యాదు చేస్తున్న తల్లి మాటలు పట్టుకుని పోలీసులు సకల విధాల ప్రయత్నాలు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు, తల్లి తన కొడుకుని చంపిన విషయం అర్థమైంది. ఈ విషయం మీద గట్టిగా అడగగా, చివరకు తన బిడ్డను చంపినట్లు అంగీకరించిన మహిళను విచారించడం మొదలుపెట్టారు. అయితే మృతదేహాన్ని ఎక్కడ దాచారని ప్రశ్నించగా, అప్పుడు కూడా మహాతల్లి తప్పుడు సమాచారం ఇచ్చిందని పోలీసులు చెప్పారు.

తొలుత ఆ మహిళ మృతదేహాన్ని గొయ్యిలో పూడ్చిపెట్టానని చెప్పినందువల్ల, పోలీసులు వారు స్థలాన్ని తవ్విచూడగా అక్కడ మాత్రమే ఏమీ దొరకలేదు. ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసులకు చెప్పగా, అక్కడ కూడా పోలీసులకు ఏమీ కనిపించలేదు.

అయితే పోలీసులకు విసుగు పుట్టి మరింత వివరంగా తమ స్టైల్లో విచారణ జరపగా, నిర్మాణ స్థలంలోని టాయిలెట్ అవసరాలకి కోసం తవ్విన గొయ్యిలో మృతదేహాన్ని పడేసినట్లు, తన బిడ్డను చంపిన తల్లి చెప్పుకొచ్చింది. చిన్నారి మృతదేహాన్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

దృశ్యం సినిమా చూసింది: 

అయితే తన ప్రియుడిని కలిసేందుకు జార్ఖండ్ కి బిడ్డతో వెళ్లడానికి ఇష్టపడిన మహిళా, అతను బిడ్డతో వస్తే తనని అంగీకరించడేమో అంటూ మనసులో అనుకున్నా ఆ మహిళ, తన బిడ్డను అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. కాకపోతే పోలీసులకి దొరకకుండా ఉండాలని, దృశ్యం సినిమా చూసి అందులో చేసినట్లే మృతదేహాన్ని మాయం చేయాలి అనుకుంది. ఈ ప్లాన్ లో భాగంగా పోలీసులకు బిడ్డ తప్పిపోయినట్లు తప్పుడు ఫిర్యాదు చేసింది. కానీ చివరికి పోలీసుల చేతికి దొరికింది. కిరాతకంగా బిడ్డను చంపిన తల్లిగా ముద్ర వేసుకుంది.