కోర్టుల్లో మహిళలను ఇకపై ఆ విధంగా పిలవొద్దు.. 

న్యాయస్థానాల్లో విచారణ సందర్భంగా స్త్రీలను కించపరిచే విధంగా ఉండే పదాలు వాడొద్దని సుప్రీంకోర్టు సూచించింది. లింగ వివక్షకు తావులేకుండా ఉండే పదాలను వినియోగించాలని చెప్పింది. ఈ మేరకు కొన్ని పదాలతో కూడిన ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ప్రాస్టిట్యూట్‌, హుకర్‌ ‌, వోర్‌‌, కీప్‌, మిస్ట్రెస్‌, స్లట్‌ వంటి మూసధోరణితో ఉన్న పదాలు కోర్టు తీర్పుల్లో ఉపయోగించొద్దని సూచించింది. ఈ పదాలు వాడడం ద్వారా లింగ వివక్షతను పెంచుతున్నట్లు అభిప్రాయపడింది. ఇకపై ఈ పదాలకు బదులుగా న్యాయమూర్తులు […]

Share:

న్యాయస్థానాల్లో విచారణ సందర్భంగా స్త్రీలను కించపరిచే విధంగా ఉండే పదాలు వాడొద్దని సుప్రీంకోర్టు సూచించింది. లింగ వివక్షకు తావులేకుండా ఉండే పదాలను వినియోగించాలని చెప్పింది. ఈ మేరకు కొన్ని పదాలతో కూడిన ఓ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ప్రాస్టిట్యూట్‌, హుకర్‌ ‌, వోర్‌‌, కీప్‌, మిస్ట్రెస్‌, స్లట్‌ వంటి మూసధోరణితో ఉన్న పదాలు కోర్టు తీర్పుల్లో ఉపయోగించొద్దని సూచించింది. ఈ పదాలు వాడడం ద్వారా లింగ వివక్షతను పెంచుతున్నట్లు అభిప్రాయపడింది. ఇకపై ఈ పదాలకు బదులుగా న్యాయమూర్తులు వేరే పదాలు వాడాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ లింగ మూస పద్ధతులకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్ బుక్‌ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్” పేరుతో 30 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

ఇందులో మహిళలను కించపరిచే విధంగా ఉన్న 40 పదాలను సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళలను మూస ధోరణిలో కించపరిచే, చులకన భావనతో చూసే పదాల స్థానాల్లో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయాలతో దీనిని రూపొందించినట్లు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు గౌరవించాల్సి ఉందని స్పష్టం చేశారు. లా డిక్షనరీలో వివక్షాపూరిత పదాలను తొలగించడం కూడా ఈ పుస్తక లక్ష్యాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. మగవాళ్లు ఎక్కువ, ఆడవాళ్లు తక్కువ అనే భావజాలం నుంచి జడ్జిలు, న్యాయవాదులు బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళల గురించి చేసిన అనేక అనుచిత పదాలను ఆ బుక్‌లో పేర్కొన్నామని వెల్లడించారు. కోర్టు తీర్పుల్లో, ఉత్తర్వుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా వాడే పదాలు సరైనవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఆ తీర్పులను విమర్శించడం లేదా వాటిని అవమానపర్చడం ఈ బుక్‌ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఏ పదాలకు బదులు ఏవీ వాడాలంటే…

వేశ్య, వ్యభిచారిణి అనే అర్థంతో ఇంగ్లిష్‌లో వాడుతున్న ప్రాస్టిట్యూట్‌, వోర్‌‌, హుకర్‌‌ లాంటి పదాలను సుప్రీంకోర్టు నిషేధించింది. వీటికి బదులుగా సెక్స్ వర్కర్ అనే పదాన్ని సూచించింది. ఇప్పటిదాకా ఉంపుడుగత్తే అనే అర్థంలో వాడే ఇంగ్లిష్‌ పదాలను కీప్‌, కాంక్యుబైన్‌ అనడానికి బదులు వివాహేతర సబంధాలు ఉన్న స్త్రీ (విమెన్‌ విత్‌ సెక్సువల్‌ రిలేషన్స్‌ అవుట్‌ సైడ్‌ ఆఫ్ మ్యారేజ్‌) గా పేర్కొనాలి. ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు వాడుతున్న బాస్టర్డ్‌ అనే పదానికి బదులుగా అవివాహ దంపతుల సంతానం (నాన్‌ మ్యారిటల్‌ చైల్డ్‌) అని పలకాలి. హౌస్‌వైఫ్‌ను హోమ్‌మేకర్‌‌ అని, మిస్ట్రెస్‌ను విమెన్‌ అని సంబోధించాల్సి ఉంటుంది. కెరీర్‌‌ విమెన్‌ను కూడా విమెన్‌ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది. ఈవ్‌ టీజింగ్‌ను ఇక మీదట స్ట్రీట్‌ సెక్సువల్‌ హరాస్‌మెంట్‌గా పేర్కొనాల్సి ఉంటుంది.

స్పిన్‌స్టర్‌‌ (కన్య) అనడం కంటే అవివాహిత స్త్రీ (అన్‌మ్యారీడ్‌ విమెన్‌) అనడం మంచిదని పేర్కొంది. అన్‌వెడ్‌ మదర్ (అవివాహ తల్లి) స్థానంలో మదర్ (అమ్మ) అనాలి. భారతీయ, విదేశీ మహిళ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళ అని అంటే సరిపోతుంది. మహిళలపై మూసధోరణిలో వాడే పదాలను గుర్తించేందుకు న్యాయమూర్తులకు ఈ హ్యాండ్‌బుక్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ హ్యాండ్‌బుక్‌ నిర్ణయం భారత న్యాయ వ్యవస్థలో మహిళలు వివక్షకు గురికాకుండా ఉండాలనే లక్ష్యంతోనే తీసుకున్నదని సుప్రీంకోర్టు వివరించింది. ఈ బుక్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.