గుజరాత్ హైకోర్టు తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు

అత్యాచార బాధితురాలి కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మండిపడింది. గుజరాత్ హై కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తప్పుబట్టింది. దేశంలో ఏ ఉన్నత న్యాయంస్థానం కూడా సుప్రీం కోర్టు కంటే పెద్దది కాదని, సుప్రీం నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకూడదని చెప్పింది. ఇలా తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం కోర్టును అగౌరవ పరచడమే అని పేర్కొంది. అసలేం జరింగిందంటే.. గుజరాత్‌ కు చెందిన ఓ అత్యాచార బాధితురాలు గర్భం దాల్చింది. అత్యాచారం కారణంగా ఆమె […]

Share:

అత్యాచార బాధితురాలి కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మండిపడింది. గుజరాత్ హై కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తప్పుబట్టింది. దేశంలో ఏ ఉన్నత న్యాయంస్థానం కూడా సుప్రీం కోర్టు కంటే పెద్దది కాదని, సుప్రీం నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకూడదని చెప్పింది. ఇలా తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం కోర్టును అగౌరవ పరచడమే అని పేర్కొంది.

అసలేం జరింగిందంటే..

గుజరాత్‌ కు చెందిన ఓ అత్యాచార బాధితురాలు గర్భం దాల్చింది. అత్యాచారం కారణంగా ఆమె గర్భం దాల్చడంతో ఆమె, ఆ గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గుజరాత్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన గుజరాత్ ఉన్నత న్యాయస్థానం.. ఆ యువతికి గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. ‘‘భారత సమాజంలో వివాహం అనే బంధంలో గర్భం దాల్చడం ఆ దంపతులకు, సమాజానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే వివాహం జరగకుండా, అవాంఛనీయ పరిస్థితుల్లో గర్భం దాల్చినప్పుడు ఆ స్త్రీకి ఇది ఎంతో ఇబ్బందికరంగా తలవంపుగా ఉంటుంది’’ అంటూ పేర్కొంటూ తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టు ఎందుకు ఫైర్ అయ్యింది?

ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గుజరాత్ హైకోర్టు తీరుపై మండిపడింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలై ఉంది. ఈ కేసును విచారించేందుకు పిటిషన్ స్వీకరించిన కోర్టు.. ప్రత్యేక జాబితాలో చేర్చి విచారణకు ఉపక్రమించింది. అంతలోనే గుజరాత్ హైకోర్టు ఈ కేసులో ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండి పడింది.

అసలు గుజరాత్ హై కోర్టులో ఏం జరుగుతోంది అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. భారత దేశంలో ఏ ఉన్నత న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయదని తెలిపింది. ఇలా చేసిందంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని, రాజ్యాంగాన్ని అవమాన పరచడమే అని పేర్కొంది.

దీనిపై గుజరాత్ ప్రభుత్వం తరఫున, హై కోర్టు తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. క్లరికల్ లోపాన్ని సవరించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. మునుపటి క్లరికల్ ‌లో లోపాన్ని సరిదిద్దెందుకు కొత్త క్లరికల్ సైతం తీసుకున్నామని వెల్లడించారు. 

దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. అయితే ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసేందుకు ఎందుకు ఇంత జాప్యం చేయాల్సి వచ్చిందని ధ్వజమెత్తింది. ప్రతిరోజూ చాలా కీలకమైనదని, జాప్యం తగదని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన విషయంలో అత్యవసర భావం అవసరమని, నిర్లక్ష్యం కాదని తేలింది. తాము ఈ కేసు విషయంలో బాధితురాలి స్పందన కోరుతూ నోటీసులు ఇచ్చామని, అయినా స్పందన వేగంగా రాలేదని వెల్లడించింది.

ఇలాంటి కేసును సాధారణ విషయంగా పరిగణించే వైఖరి సరైంది కాదని, అలాగే సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వడం కూడా తీవ్రమైన విషయం అని తెలిపింది.

ఈ వ్యాఖ్యలు చేసే ముందు ‘‘ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి’’ అని సుప్రీం కోర్టు బెంచ్ జోడించింది. అయితే ఈ కేసు విషయంలో గుజరాత్ హై కోర్టు ఉత్తర్వులను సుప్రీం పరిగణలోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

నిజానికి దేశంలో ఇప్పటి వరకు ఏ ఉన్నత న్యాయస్థానం కూడా సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఉత్తర్వులను జారీ చేయలేదు. అన్ని న్యాయస్థానాలు సుప్రీంకు లోబడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడంతో సుప్రీం ఆగ్రహానికి లోనవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ‘‘అసలు ఏం జరుగుతుంది’’ అని తీవ్రంగా ధ్వజమెత్తాల్సి వచ్చింది. మరి దీనిపై గుజరాత్ ప్రభుత్వం గాని, గుజరాత్ హైకోర్టు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఆ బాధిత మహిళకు న్యాయం చేకూరేలా సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో కూడా తెలియాల్సి ఉంది.