స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టభద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసింది. గత మంగళవారం భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్ .కె .కౌల్,  జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ పీవీ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈనెల  24 తేదీలోపు ఈ కేసుపై తుది నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మొదటి […]

Share:

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టభద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్‌ని దాఖలు చేసింది. గత మంగళవారం భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్ .కె .కౌల్,  జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ పీవీ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ఈనెల  24 తేదీలోపు ఈ కేసుపై తుది నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. పైగా దీనిని సుప్రీం కోర్టు ప్రత్యేకంగా విచారించడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. కొత్త సామజిక అంశాలపై కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని.. దీనికి సుప్రీం కోర్టు జోక్యం ఏంటో అర్థం కావడం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పుకొచ్చింది.

గత వారం జరిగిన సుప్రీం కోర్టు వాయిదాలో కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ‘స్వలింగ సంపర్కుల వివాహ అంశంపై ఇక్కడ అందరూ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో చెప్పడం లేదు. ఈ అంశంపై చర్చ జరగడానికి సరైన వేదిక పార్లమెంట్ మాత్రమే’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కేసు విచారణలో న్యాయవాదులు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలి అని తుషార్ మెహతా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కోర్టుకి తెలుసునని, ఈ విషయంలో తాము కేవలం పిటిషన్లు వేసిన వారి వాదనలు వింటామని, పిటిషనర్ల తరుపున న్యాయవాది ముకుల్ రోహత్గి వ్యవహరిస్తారని సీజేఐ జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. అయితే వారం రోజుల పాటు వాదోపవాదనలు విని సుప్రీం కోర్టు ద్వారా నియమించబడిన ధర్మాసనం నిన్ననే తుది నివేదిక ఇచ్చింది.

ఈ నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం కోర్టు ముందుగా కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టింది. ‘ఈ పిటిషన్లను కేవలం పార్లమెంట్‌లోనే చర్చించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండిస్తోంది. ఇది వివాహం, విడాకులకు సంబంధించిన చట్టం, కోర్టు జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటుంది, ఇది మా పరిధికి చెందినది’ అంటూ సర్వోన్నత న్న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గడిచిన దశాబ్దాల నుండి వివాహం విషయంలో మన భారతీయ సంస్కృతిలో మార్పులు చెందుతూ వచ్చాయి. తొలుత బాల్య వివాహాలు ఉండేవి. ఆ తర్వాత తాత్కాలిక వివాహాలు కూడా ఉండేవి. అంటే ఒకే వ్యక్తి అనేక సార్లు పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు కొత్తగా స్వలింగ వివాహాలు చేసుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.