Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్లకు సుప్రీం వార్నింగ్..

Supreme Court: పంజాబ్(Punjab), తమిళనాడు(Tamil Nadu) గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌(Banwarilal Purohit)పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ(Assembly)లో పాసైన బిల్లులను ఆమోదించకుండా పంజాబ్ గవర్నర్ అట్టిపెట్టుకోవడంపై సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయింది. గవర్నర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో, పంజాబ్​లోని​ […]

Share:

Supreme Court: పంజాబ్(Punjab), తమిళనాడు(Tamil Nadu) గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌(Banwarilal Purohit)పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, ‘మీరు నిప్పుతో ఆడుతున్నారు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అసెంబ్లీ(Assembly)లో పాసైన బిల్లులను ఆమోదించకుండా పంజాబ్ గవర్నర్ అట్టిపెట్టుకోవడంపై సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయింది. గవర్నర్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో, పంజాబ్​లోని​ ఆప్ ప్రభుత్వ తీరును సైతం తప్పుబట్టింది. అసెంబ్లీ సమావేశాలను నిలుపుదల చేయడానికి బదులుగా, వాయిదా వేసి ఊరుకోవడానికి కారణమేంటని ప్రశ్నించింది. సంప్రదాయాలపై దేశం నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని పంజాబ్ ప్రభుత్వం(Punjab Govt), గవర్నర్​కు స్పష్టం చేసింది.

‘మేమే ఉత్తర్వులు జారీ చేస్తాం’

‘పంజాబ్​లో జరుగుతున్నదాని పట్ల మేం సంతోషంగా లేము. ఇది చాలా తీవ్రమైన అంశం’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud), జస్టిస్ జేబీ పార్దివాలా(JB Pardiwala), జస్టిస్ మనోజ్ మిశ్ర(Manoj Mishra)లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసెంబ్లీ పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారని పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. బిల్లులకు గవర్నర్​ ఆమోదానికి సంబంధించిన చట్టంలోని వివాద పరిష్కారానికి తాము ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Govt) వేసిన పిటిషన్‌ని కూడా సుప్రీంకోర్టు(Supreme Court) విచారించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi) ఈ వ్యాధి( రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్) పంజాబ్ నుంచి తమిళనాడు వరకు వ్యాపిస్తోందని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బిల్లుల జాప్యంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశం తమ వద్దకు రాకముందే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై(Bill passed) గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆప్ ప్రభుత్వం(AAP Govt) ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 27 బిల్లలుకు 22 బిల్లులకు పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్(Banwarilal Purohit) ఆమోదం తెలిపారు. అయితే అక్టోబర్ 19న మూడు ద్రవ్యవినిమయ బిల్లులను నిలుపుదల చేశారు. తర్వాత నవంబర్ 1న రెండింటికి సమ్మతి ఇచ్చారు. అయితే మూడో ద్రవ్యవినిమయ బిల్లును పరిశీలిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి.

‘గవర్నర్ ప్రజాప్రతినిధి కాదు’

ఇదే అంశంపై నవంబర్ 6న జరిగిన విచారణలోనూ.. గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు(Supreme Court). తాము ప్రజాప్రతినిధులం కాదనే విషయాన్ని విస్మరించరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలు పంపిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ అసెంబ్లీ పంపిన బిల్లులపై గవర్నర్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.

జర్నలిస్టులకు రక్షణ..

మరోవైపు.. అదానీ గ్రూప్​-హిండెన్​బర్గ్(Adani Group-Hindenburg) వివాదంపై కథనాలు రాసిన ఇద్దరు జర్నలిస్టులకు పోలీసుల నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ పోలీసులు తమకు జారీ చేసిన సమన్లను వ్యతిరేకిస్తూ బెంజమిన్ నికోలస్ బ్రూక్ పార్కిన్(Nicholas Brooke Parkin), క్లోయి నినా కార్నిష్(Chloe Nina Cornish) అనే ఇద్దరు జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం.. ఇద్దరిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో, విచారణకు సహకరించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. ఇటీవల రవి నాయర్, ఆనంద్ మంగ్నలే అనే ఇద్దరు జర్నలిస్టులకు సైతం మధ్యంతర రక్షణ ఇచ్చింది సుప్రీం.

‘పరిష్కారం కనుక్కోవాల్సిందే’

వాయు కాలుష్యానికి (Air pollution)సంబంధించిన కేసులో.. దిల్లీ(Delhi) సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని ఆపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ-ఎన్​సీఆర్(NCR) ప్రాంతంలో కాలుష్యం తగ్గించేందుకు పరిష్కారం కనుగొనాల్సిందేనని నొక్కి చెప్పింది. కాలుష్యం సమస్యపై వివిధ కమిటీల నివేదికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమనుల్లా(Ahsanuddin Amanullah) నేతృత్వంలోని ధర్మాసనం ఆక్షేపించింది. తాము కాలుష్యం తగ్గింపునకు సంబంధించిన ఫలితాలు చూడాలనుకుంటున్నామని పేర్కొంది.