నాయుడు పిటిషన్ గురించి నేడు ప్రస్తావించే అవకాశం.. 

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయుడు పిటిషన్‌ను ప్రస్తావించడానికి నిరాకరించారు.. రేపు ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రెండు రోజుల సిఐడి కస్టడీ గడువు సెప్టెంబర్ 24 ఆదివారంతో ముగియడంతో విజయవాడలోని ఎసిబి కోర్టు అక్టోబర్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. నిరాకరించిన సుప్రీం కోర్ట్:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దాఖలు చేసిన […]

Share:

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నాయుడు పిటిషన్‌ను ప్రస్తావించడానికి నిరాకరించారు.. రేపు ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రెండు రోజుల సిఐడి కస్టడీ గడువు సెప్టెంబర్ 24 ఆదివారంతో ముగియడంతో విజయవాడలోని ఎసిబి కోర్టు అక్టోబర్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది.

నిరాకరించిన సుప్రీం కోర్ట్: 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా ప్రస్తావించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుని, సీఐడీ కస్టడీ ముగిసిన కొద్దిసేపటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బి.ఎస్.వి.హిమబిందు ముందు హాజరు పరిచయం జరిగింది. అంతేకాకుండా సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగినట్లు అంచనా.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం: 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని ఏపీ సీఐడీ ఆదివారం నాడు 3వ అదనపు సెషన్స్ జడ్జి-కమ్-స్పెషల్ జడ్జికి విజ్ఞప్తి చేసింది. సీఐడీ ఎకనామిక్ వింగ్ డీఎస్పీ ధనుంజయ్ ఆదివారం రాత్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

చంద్రబాబు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా పలుసార్లు ప్రశ్నించడం జరిగిందని అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఇటీవల ఐటీ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే అని ఆయన చెప్పుకోచారు. అయితే 100 కోట్ల స్కాం గురించి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నాయుడు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి స్కాంలో కీలక వ్యక్తులుగా నిర్ధారించడం జరిగింది. 

అంతే కాకుండా, వారు ఎలా ఫేక్ ఇన్వాయిస్లను జనరేట్ చేసిన విషయం కూడా ఐటీ శాఖ, అదే విధంగా ED ప్రశ్నించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ. 241 కోట్లు ముఖ్య సూత్రధారికి మళ్ళించినట్లు స్పష్టమైనప్పటికీ, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో కాస్త గ్యాప్ కొనసాగుతోందని, అంతేకాకుండా ఇతర కేసుల విషయంలో కూడా నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ హస్తము ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడడం జరిగింది. 

అయితే ఇతర కేసుల విషయాల గురించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మొదలైనట్లు సిఐడి చీఫ్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాసుని, అదేవిధంగా ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు, అయితే పెద్ద మొత్తంలో రిసిప్ట్స్ అలాగే ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలు బయటపడినట్లు సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. శ్రీనివాస్ మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఒప్పుకోకపోగా, ప్రస్తుతం ప్రభుత్వ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పిన విధంగానే తాను చేస్తున్నట్లు వింతగా వాదించడం కూడా కనిపించిందని సిఐడి చీఫ్ అయిన సంజయ్ చెప్పుకొచ్చారు. 

2018 నుంచి కూడా జిఎస్టి ద్వారా బయటపడిన కొన్ని ముఖ్య అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని, అంతేకాకుండా జిఎస్టి విషయంపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా సిఐడి వారు వెల్లడించారు. ఇందులో పై ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు వాళ్ళు గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కింద పని చేసే శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి మనోజులకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, వారు విదేశాలకు పారిపోయారని ఆయన వెల్లడించారు.