భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సుప్రీంకోర్టు లాయర్

ఆమె సుప్రీంకోర్టులో లాయర్.. భర్త ఐఆర్ఎస్ మాజీ ఉద్యోగి. నొయిడాలోని ఖరీదైన ప్రాంతంలో ఓ బంగ్లాలో ఇద్దరూ ఉంటున్నారు. అయితే, ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతడు ఓ వ్యక్తికి రూ.4 కోట్ల విక్రయించడానికి ఒప్పందం చేసుకుని.. కొంత సొమ్ము అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇందుకు భార్య ససేమిరా అనడంతో ఇరువురి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో భార్యను ఆవేశంలో హత్య చేశాడు ఆయన. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది తన […]

Share:

ఆమె సుప్రీంకోర్టులో లాయర్.. భర్త ఐఆర్ఎస్ మాజీ ఉద్యోగి. నొయిడాలోని ఖరీదైన ప్రాంతంలో ఓ బంగ్లాలో ఇద్దరూ ఉంటున్నారు. అయితే, ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అతడు ఓ వ్యక్తికి రూ.4 కోట్ల విక్రయించడానికి ఒప్పందం చేసుకుని.. కొంత సొమ్ము అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇందుకు భార్య ససేమిరా అనడంతో ఇరువురి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో భార్యను ఆవేశంలో హత్య చేశాడు ఆయన. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది తన భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది అయిన తన భార్యను హత్యచేసిన నిందితుడు.. మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టి, తన ఇంటి స్టోర్‌రూమ్‌లో 36 గంటల పాటు తలదాచుకున్నాడు. బాధితురాలి సోదరుడు ఫోన్ చేసినప్పటికీ ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

రేణు సిన్హా(61), అజయ్ నాథ్‌లు భార్యభర్తలు. అజయ్‌ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. వారు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్-30 లోని సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని రూ.4 కోట్లకు అమ్మేయాలని నిర్ణయించుకున్న నితిన్ నాథ్.. ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ రేణు సిన్హా అభ్యంతరం చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణగా మారడంతో ఆవేశంలో రేణు సిన్హాను.. అజయ్‌ నాథ్‌ హత్యచేశాడు. మృత దేహాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెట్టిన అతడు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇంటికి తాళం వేసి స్టోర్‌ రూమ్‌లో దాక్కున్నాడు. సాయంత్రం ఇంటికి రావాల్సిన రేణు రాకపోవటంతో.. సోదరుడు ఆమెకు ఫోన్‌ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఆమె నుంచి స్పందన రాలేదు. రెండు రోజులుగా తన సోదరికి ఫోన్ చేసిన రేణు సిన్హా సోదరుడు.. ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు

నితిన్ నాథ్ ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  దీంతో ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు.. మొత్తం గాలించారు. బంగ్లాలో శోధించగా.. చివరకు బాత్‌రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇంటి లోని గదులను పరిశీలించగా.. అనంతరం ఇంటికి తాళం వేసి స్టోర్‌ రూమ్‌లో తలదాచు కున్నాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తానే రేణును హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య చేసిన తరువాత ఈ వ్యక్తి బంగళాకు తాళం వేసి , పై భాగాన ఉన్న ఖాళీ స్టోర్‌రూంలోకి వెళ్లి రెండు రోజులు గడిపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు విచారణలో అజయ్ నాథ్  బంగళా అమ్మకం విషయంలో ఇద్దరి మధ్య తగవులు తలెత్తాయని, బంగ్లా అమ్మడానికి రేణు ఒప్పుకోలేదని, తాను కొంత అడ్వాన్సు కూడా తీసుకున్నానని పోలీసులకు నిందితుడు చెప్పాడు.

ఈ ఘటన జరిగిన 36 గంటల తర్వాత హత్య వెలుగులోకి వచ్చింది. నిందితుడి ఫోన్ లోకేషన్ ఆధారంగా బంగ్లాలోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసి.. నిందితుడ్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేన్సర్ బారినపడిన రేణు సిన్హా ఇటీవలే వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఆమె సోదరుడు చెప్పాడు. అంతేకాదు, తన సోదరి రేణు సిన్హా, భర్త నితిన్ నాథ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు చివరికి విషాదాంతం చెందింది. వీరి కుమారుడు విదేశాలలో ఉంటున్నాడు. జరిగిన ఘటన గురించి ఆయనకు సమాచారం అందించారు.