స్వలింగ వివాహాలు వ్యవస్థకే వ్యతిరేకం

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనేది కేవలం పట్టణ ప్రాంత ఉన్నత వర్గాల అభిప్రాయమన్న కేంద్రం… దీనిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం న్యాయస్థానాల వల్ల కుదరదని తేల్చి చెప్పింది. ఇది కేవలం చట్ట సభల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించడం జరిగింది. ఇందుకు గాను గ్రామీణ, సెమీ రూరల్, పట్టణ ప్రజల అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిని సామాజిక ఆమోదం కోసమే ఈ పిటీషన్లు దాఖలు చేశారని కోర్టులో కేంద్రం […]

Share:

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనేది కేవలం పట్టణ ప్రాంత ఉన్నత వర్గాల అభిప్రాయమన్న కేంద్రం… దీనిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం న్యాయస్థానాల వల్ల కుదరదని తేల్చి చెప్పింది. ఇది కేవలం చట్ట సభల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించడం జరిగింది. ఇందుకు గాను గ్రామీణ, సెమీ రూరల్, పట్టణ ప్రజల అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిని సామాజిక ఆమోదం కోసమే ఈ పిటీషన్లు దాఖలు చేశారని కోర్టులో కేంద్రం వాదించింది.

ఈ సందర్భంగా స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. వివాహమనేది సంతానోత్పత్తికి సంబంధించింది కావడంతోపాటు రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక చట్టాలు తదితర అంశాలతో ముడిపడి ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇంతకు ముందు అభిప్రాయపడింది.

స్వలింగ వివాహాలపై కేంద్రం మరోసారి తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలు… వివాహ వ్యవస్థకే వ్యతిరేకమని అభిప్రాయపడింది. ప్రజల ప్రయోజనాలను ఇవి ప్రభావితం చేస్తాయని పేర్కొంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి తాము అనుకూలం కాదని కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. స్వలింగ వివాహాలను గుర్తించే కోర్టు ఉత్తర్వులను కోర్టు ఆమోదించకుండా ఉండాలని కేంద్రం కోరింది. స్వలింగ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం కోర్డులో వాదించింది.

సంప్రదాయబద్దమైన వివాహలు విశ్వ ఆమోదం పొంది ఉన్న పెళ్లి లాంటి సంబంధాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయని పేర్కొంది. హిందూ చట్టాల్లోనే కాకుండా.. ఇస్లాం సైతం స్వలింగ వివాహాలను విభేధిస్తుందని కేంద్రం తెలిపింది. స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే వివాహం సౌలభ్యం అవుతుందని వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యలను సృష్టిస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కూడా విచారణ కొనసాగించనుంది. ఈ అంశం కొత్త సామాజిక సంస్థను సృష్టించడానికి అవసరమైన స్వభావం గల అంశాలను న్యాయపరమైన తీర్పు ప్రక్రియలో భాగంగా పరిష్కరించవచ్చా అనే క్లిష్టమైన సమస్యలను లేవనెత్తుతుందని వాదించింది.

కొత్త హక్కులను సృష్టించడం లాంటి సంబంధాలకు చట్టబద్ధత కల్పించడం చట్టసభల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని.. ఇది న్యాయవ్యవస్థ ద్వారా సమస్య పరిష్కరం కాదని కేంద్రం సూచించింది. ‘ ఇది రాజ్యాంగంలో 7వ షెడ్యూల్‌లోని 3వ జాబితాలో ఎంట్రీ 5 కింద పూర్తిగా శాసన విధానానికి సంబంధించిన విషయం. ఇది తగిన శాసనసభ ద్వారా మాత్రమే నిర్ణయించబడాలని కేంద్రం చెప్పింది. కొత్త సామాజిక సంస్థను సృష్టించడం మరియు గుర్తించడం పూర్తిగా ప్రాథమిక హక్కు మరియు ఎంపికకు సంబంధించిన అంశంగా చెప్పలేమని పేర్కొంది. న్యాయపరమైన తీర్పు ద్వారా వ్యక్తిగత స్వలింగ విహవాన్ని గుర్తించే హక్కును కలిగి  ఉండదని కేంద్రం అనే అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది.