Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల గురించి సుప్రీం కోర్టులో విచారణ

ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ, ప్రతి ఒక్క రాష్ట్రంలో తమదైన శైలిలో రాజకీయ నాయకులు ఓటర్లను తమ వైపు నుంచి ఓటు హక్కును తమ పార్టీ కోసం ఉపయోగించాల్సిందిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రజల వైపు నుంచి ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) సవాలు ఎదుర్కొంటోంది సుప్రీంకోర్టు (Supreme Court). అసలు ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) విషయం ఏమిటో తెలుసుకుందాం రండి..  Read More: Kerala: ఆన్లైన్ లో నేర్చుకున్న అంటున్న కేరళ […]

Share:

ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ, ప్రతి ఒక్క రాష్ట్రంలో తమదైన శైలిలో రాజకీయ నాయకులు ఓటర్లను తమ వైపు నుంచి ఓటు హక్కును తమ పార్టీ కోసం ఉపయోగించాల్సిందిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రజల వైపు నుంచి ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) సవాలు ఎదుర్కొంటోంది సుప్రీంకోర్టు (Supreme Court). అసలు ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) విషయం ఏమిటో తెలుసుకుందాం రండి.. 

Read More: Kerala: ఆన్లైన్ లో నేర్చుకున్న అంటున్న కేరళ నిందితుడు

ఎలక్టోరల్ బాండ్ల: 

దేశంలో ఎవరైనా రాజకీయ (Politics) పార్టీలకు ఎటువంటి అనుమతి లేకుండా డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ వచ్చిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు (Supreme Court) నేడు విచారిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రెండు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తుంది. రాజకీయ పార్టీలకు అనామక విరాళాల చట్టబద్ధత మరియు రాజకీయ పార్టీల నిధుల గురించి పౌరుల సమాచార హక్కు ఉల్లంఘన. 

ఎలక్టోరల్ బాండ్‌లు (electoral bonds) అనేది వ్యక్తులు, వ్యాపారాలు ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా, రాజకీయ (Politics) పార్టీలకు డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతించే ఆర్థిక సాధనం. నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా 2018లో బీజేపీ (BJP) ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. మొత్తం ₹ 9,208 కోట్లలో ₹ 5,270 కోట్లు లేదా 2022 వరకు విక్రయించిన మొత్తం ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds)లో 57 శాతం బిజెపి (BJP) పొందింది. రాజకీయ నిధులలో పారదర్శకత తీసుకురావడానికి వారు చొరవ తీసుకున్నారు. నిజానికి పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం, ఎలక్టోరల్ బాండ్‌లను భారతదేశం (India)లోని పౌరుడు.. భారతదేశం (India)లో విలీనం చేసిన సంస్థ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 

ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ బాండ్లను కొనుగోలు చేసినప్పుడు, వారు తమ గుర్తింపును ప్రజలకు లేదా విరాళాలు స్వీకరించే రాజకీయ పార్టీకి వెల్లడించాల్సిన అవసరం లేదు. ఈ బాండ్‌లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అన్ని శాఖలలో ₹ 1,000 రూపాయల నుండి ₹ 1 కోటి వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ విరాళాలు కూడా వడ్డీ లేనివి. ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి గుర్తింపు వెల్లడించనప్పటికీ, ప్రభుత్వం మరియు బ్యాంకు కొనుగోలుదారు వివరాల రికార్డును నిర్వహిస్తాయి. ఈ సమాచారం ఆడిటింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. 

బాండ్లకు సంబంధించి విచారణ ఎందుకు: 

ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds)ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ (Congress) నేత జయ ఠాకూర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన నాలుగు అభ్యర్థనలను సుప్రీంకోర్టు (Supreme Court) నేడు విచారించనుంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి రాజకీయాల్లో (Politics)  పారదర్శకతను తీసుకొచ్చిందా అని విమర్శకులు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. దాతల పేరు తెలియకపోవడం వల్ల రాజకీయాలలో (Politics) అవినీతి, పక్షపాతాన్ని పెంపొందించే అవకాశం ఉందనే ఆరోపణలకు దారితీసింది. ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ బాండ్లను కొనుగోలు చేసినప్పుడు, వారు తమ గుర్తింపును ప్రజలకు లేదా విరాళాలు స్వీకరించే రాజకీయ (Politics) పార్టీకి వెల్లడించాల్సిన అవసరం లేదు.. ట్రాక్ చేయడం కష్టతరం చేస్తుంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేసిన.. లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభకు గత ఎన్నికల్లో (Elections) పోలైన ఓట్లలో 1 శాతం కంటే తక్కువ ఓట్లను పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds)ను స్వీకరించడానికి అర్హులు. నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్టోరల్ బాండ్‌లను అర్హత కలిగిన రాజకీయ (Politics) పార్టీ.. తమకు అందిన బాండ్లను (electoral bonds) బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే క్యాష్ చేసుకోవాలి.