తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసు విషయంలో గవర్నర్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.

గత కొంత కాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ సుందర్ రాజన్ పైన పెండింగ్ బిల్లుల విషయంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు లో గత కొంతకాలం నుండి కొనసాగుతున్న ఈ పెండింగ్ బిల్లుల కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం నాడు తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పూర్తిగా పరిశీలించిన తర్వాత గవర్నర్ వద్ద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని, కాబట్టి ఈ […]

Share:

గత కొంత కాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ సుందర్ రాజన్ పైన పెండింగ్ బిల్లుల విషయంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు లో గత కొంతకాలం నుండి కొనసాగుతున్న ఈ పెండింగ్ బిల్లుల కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం నాడు తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పూర్తిగా పరిశీలించిన తర్వాత గవర్నర్ వద్ద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని, కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తునట్టుగా సుప్రీం కోర్టు ఒక కీలక ప్రకారణ చేసింది. బిల్లుల విషయంలో రాజ్యాంగంలో పొందు పేర్చిన ఆర్టికల్ 200(1) ప్రకారం బిల్లులను సాధ్యమైనంత తొందరగా పాస్ చెయ్యాలనే అంశాన్ని గుర్తు చేశారు సీజీవై డీవై చంద్రచూడ్. అయితే విచారణ సమయంలో గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లేవని గవర్నర్ సుందర్ రాజన్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. అయితే రెండు బిల్లుల విషయంలో మాత్రం ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి స్పష్టత మరియు సమాచారం రావాలని కోరారు.

ఇది ఇలా ఉండగా కొన్ని కీలకమైన బిల్లులను తిప్పి పంపేశారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రతీ బిల్లు యొక్క ఆమోదం కోసం ప్రభుత్వం గవర్నర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని, చట్ట సభల ప్రతినిధులకు ఇది అవమానం లాంటిది అంటూ ప్రభుత్వ తరుపున న్యాయవాది ఆరోపించారు. బిల్లులో ఏదైనా సవరించాలంటే వెంటనే మాకు పంపిస్తే సవరించి బిల్ పాస్ చేస్తామని, అలా కాకుండా తమ వద్దనే పెట్టుకుంటే మేము మాత్రం ఏమి చెయ్యగలం అంటూ ప్రభుత్వ తరుపున న్యాయవాది సుప్రీం కోర్టు లో తన వాదనని వినిపించాడు.మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక బిల్లుకి క్లియరెన్స్ రావడానికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం పడుతుంది. అలాగే గుజరాత్ లో నెల రోజుల సమయం పడుతుంది, కానీ మా బిల్లులకు ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర నుండి క్లియరెన్స్ రాలేదని, కేవలం ప్రజా ప్రతినిధులు మాత్రమే కాదు, గవర్నర్ కూడా రాజ్యాంగానికి కట్టుబడే నడుచుకోవాలని విషయాన్నీ ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున లాయర్ గుర్తు చేసాడు.

వాదనలన్నీ విన్న తర్వాత సుప్రీం కోర్టు ఒక కీలకమైన ప్రకటన చేసింది. గవర్నర్ వద్ద ప్రస్తుతం ఎలాంటి బిల్లులూ పెండింగ్ లో లేవు కనుక మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని ఈ సందర్భం గా చెప్పుకొచ్చింది సుప్రీం కోర్టు. అయితే రాజ్యాంగంలోని 200 (1) ఆర్టికల్ ని గవర్నర్లు విస్మయించడానికి లేదని, ఎలాంటి బిల్లుని అయినా సాధ్యమైనంత తొందరగా పంపాల్సిందిగా CGI ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా బిల్లులు పరిశీలించి వెంటనే క్లియరెన్స్ ఇస్తే ఎలాంటి గొడవలు లేకుండా సిస్టం సజావుగా నడుస్తుంది. బిల్లుని పరిశీలించి, క్లియరెన్స్ ఇవ్వకపోతే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నర్స్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో జాప్యం చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు గవర్నర్ కి అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఎలా చేప్పట్టబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన బిల్లులను వెంటనే తిప్పి పంపకుండా తమ వద్దే చాలా కాలం ఉంచుకొని పంపారని, ఇలా చేస్తే ప్రభుత్వాన్ని ఎలా నడపాలంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదనకి సుప్రీం కోర్టు గవర్నర్స్ కి ఇచ్చిన హెచ్చరిక ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించింది. ఇకనైనా గవర్నర్స్ బిల్లుల విషయంలో తొందరగా నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూడాలి.