Supreme Court: నిండు ప్రాణాన్ని తీయలేమంటూ కోర్టు ఇచ్చిన తీర్పు

ఇటీవల సుప్రీం కోర్టులో కొన్ని వాదనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాదన ఒకటి సుప్రీంకోర్టు (Supreme Court)లో మరొకసారి ఎదురయింది. పెళ్లయిన ఒక మహిళ తన 27 వారాల ప్రెగ్నెన్సీ గురించి కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో కోర్టు దీటుగా స్పందించింది. నిండు ప్రాణాన్ని తీయాలని కోర్టుకి ఎలా ఉంటుంది అంటూ సమాధానం కూడా ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పు:  27 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) […]

Share:

ఇటీవల సుప్రీం కోర్టులో కొన్ని వాదనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాదన ఒకటి సుప్రీంకోర్టు (Supreme Court)లో మరొకసారి ఎదురయింది. పెళ్లయిన ఒక మహిళ తన 27 వారాల ప్రెగ్నెన్సీ గురించి కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో కోర్టు దీటుగా స్పందించింది. నిండు ప్రాణాన్ని తీయాలని కోర్టుకి ఎలా ఉంటుంది అంటూ సమాధానం కూడా ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన తీర్పు: 

27 వారాల గర్భాన్ని తొలగించాలన్న వివాహిత అభ్యర్థనను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం ఆధారపడింది. పుట్టబోయే బిడ్డ (Child) గురించిన అన్ని రిపోర్టులను కోర్టు కోరింది. పుట్టబోయే బిడ్డ (Child) ఆరోగ్యం, వైకల్యం ఇటువంటి వివరాలు గురించి సమాచారం సేకరించాలని కోర్టు(Supreme Court) కేసు (Case) విషయం మీద నిర్ణయించుకుంది.

26 వారాలు మరియు 5 రోజులు గర్భిణీ కోర్టును ఆశ్రయించింది. తను బిడ్డ (Child)ను కొనడానికి సిద్ధంగా లేదని, గర్భని తొలగించేందుకు అనుమతి కోరుతూ కోర్టులో కేసు (Case) వేసింది. గర్భం రద్దును అనుమతించడం అనేది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్లు 3 మరియు 5ని ఉల్లంఘించడమే అవుతుందని, ఎందుకంటే ఈ కేసు (Case) విషయంలో తల్లికి ప్రమాదం లేదు, అంతే విధంగా పుట్టబోయే బిడ్డ (Child) కూడా ఆరోగ్యంగానే ఉంది అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (Justice) డివై చంద్రచూడ్ అన్నారు.

MTP చట్టం ప్రకారం, వివాహిత స్త్రీలకు, అత్యాచారం నుండి బయటపడినవారికి, వికలాంగులు మరియు మైనర్‌లు వంటి ఇతర బలహీన మహిళలకు గర్భం రద్దు చేయడానికి గరిష్ట పరిమితి 24 వారాలు. గత విచారణలో, పిటిషనర్ కోర్టు ఆర్డర్ ద్వారా గర్భాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అభ్యర్థించారు. ఇద్దరు పిల్లల తల్లినాని, తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని, మానసికంగా.. ఆర్థికంగా మూడో బిడ్డ (Child)ను పెంచే స్థితిలో లేనని ఆ మహిళ చెప్పింది. అబార్షన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని వైద్యుల బృందం ఇచ్చిన సలహాను ఉటంకిస్తూ కేంద్రం ఆర్డర్‌ను రీకాల్ చేయాలని కోరింది. 

నిండు ప్రాణాన్ని తీయలేమంటూ: 

జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బివి నాగరత్నలు ఉన్న ధర్మాసనం గతంలో ఈ విషయంలో, విభజన తీర్పు(Justice)ను వెలువరించింది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి (Justice) నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇంతకు ముందు మహిళ అబార్షన్‌కు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించింది. ఆమె 26 వారాలుగా ఏమి చేస్తోంది? ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఒక నిండు ప్రాణాన్ని తీసేందుకు మేము ఎలా అనుమతిని ఇవ్వాలి అంటూ ప్రధాన న్యాయమూర్తి (Justice) చంద్రచూడ్ అన్నారు.

కేంద్రం తరఫు న్యాయవాది మాట్లాడుతూ, అబార్షన్‌కు అనుమతి కోసం అత్యాచార బాధితురాలు చేసిన పిటిషన్‌లో కోర్టు(Supreme Court) తీర్పు(Justice)ను పిటిషనర్ ఉదాహరణగా తీసుకున్నారు. అయితే ఇప్పటికే పిటిషనర్ రేప్ సర్వైవర్ కాదు.. అదే కాకుండా ఆమె మైనర్ కాదు.. 26 వారాలుగా ఆమె ఏం చేస్తోంది? అంటూ మరోసారి ప్రశ్నించారు.

బిడ్డ (Child)ను కన్న తర్వాత, ప్రభుత్వం ఆ విషయం గురించి చూసుకోవచ్చని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. అంతేకాకుండా ఈ సమయంలో తొందరగా ప్రసవం చేస్తే బిడ్డ (Child)కు వైకల్యాలు ఏర్పడే అవకాశం ఉందని కోర్టు(Supreme Court) నొక్కి చెప్పింది. ప్రస్తుతం అంగవైకల్యంతో బిడ్డ (Child) పుడితే ఎవరూ దత్తత తీసుకోవడానికి కూడా ఇష్టపడరు అంటూ, అది మరో సమస్యగా మారే అవకాశం ఉంది అంటూ ప్రధాన న్యాయమూర్తి (Justice) పేర్కొన్నారు.