అజిత్ పవార్ కు మహారాష్ట్రలో వినూత్న స్వాగతం

మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవర్ మహారాష్ట్రలోని పింప్రీ చించువాడ్ అనే ప్రాంతాన్ని, ఆగస్టు 26న శనివారం నాడు సందర్శించడం జరిగింది. అయితే ఆయనని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మహారాష్ట్రలోని పింప్రీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఆయనకు ప్రత్యేకించి సపోర్ట్ చేస్తు ఎంతోమంది ప్రజలు గుమ్మి గూడారు. ముఖ్యంగా అజిత్ పవర్ వచ్చిన సందర్భంగా […]

Share:

మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవర్ మహారాష్ట్రలోని పింప్రీ చించువాడ్ అనే ప్రాంతాన్ని, ఆగస్టు 26న శనివారం నాడు సందర్శించడం జరిగింది. అయితే ఆయనని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన మహారాష్ట్రలోని పింప్రీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఆయనకు ప్రత్యేకించి సపోర్ట్ చేస్తు ఎంతోమంది ప్రజలు గుమ్మి గూడారు. ముఖ్యంగా అజిత్ పవర్ వచ్చిన సందర్భంగా ఆ సమావేశంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 

అజిత్ పవార్ ను వినూత్నంగా స్వాగతించిన ఎన్సీపీ కార్యకర్త: 

అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తరువాత మొట్టమొదటిసారిగా పింప్రీ చించువాడ్ అనే ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే సునీల్ మదనేని అనే ఒక ఎన్సిపి కార్యకర్త, అజిత్ పవార్ కు స్వాగతం పలకాలని వినూత్నంగా ఆలోచన చేసాడు. ఈ క్రమంలోనే తాను వరమాలతో క్రేన్ మీద వేలాడుతూ అజిత్ పవార్ మెడలో వరమాల వేశాడు. అయితే మొదట కార్యకర్తలు సునీల్ ప్రయత్నాన్ని వ్యతిరేకించినప్పటికీ తరువాత అజిత్ పవార్ వరమాల వేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు 50-60 అడుగుల ఎత్తులో క్రేన్ సహాయంతో తాడుతో సునీల్ మదనేని వేలాడుతూ దాదాపు 45 నిమిషాల పాటు వేచి ఉన్నాడు. ఇప్పుడు వైరల్ గా మారిన ఈ వీడియోలో చూసినట్లయితే, అతను తన అభిమాన నాయకుడు అజిత్ పవార్ ను స్వాగతించడానికి చిరునవ్వుతో గాలిలో చాలా సేపు వేలాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సమావేశం కారణంగా ప్రజలు అభినందనలు తెలియజేసేందుకు రావడమే కాకుండా ఆయనకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. 

ఇటీవల 8 మంది ఎమ్మెల్యేలతో సహా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్: 

చాల సంవత్సరాల తరువాత మహారాష్ట్రలోని నాలుగవ ప్రమాణ స్వీకారం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్, ఎనిమిది పార్టీల నేతలతో కలిసి ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు అని నివేదికలు పేర్కొన్నాయి. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అదితి తత్కరే, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, ధర్మరాజ్ బాబారావ్ అత్రమ్, సంజయ్ బన్సోడే మరియు అనిల్ భైదాస్ పాటిల్ ఇటీవల జులై నెలలో ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ క్రమంలోనే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ను స్వాగతిస్తూ, “ఇప్పుడు మనకు 1 ముఖ్యమంత్రి, అంతేకాకుండా, 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం, అజిత్ పవార్ని మహారాష్ట్రకు ఉపముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నాను. అజిత్ పవార్ అనుభవం సహాయం చేస్తుంది.” అంటూ మీటింగ్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని పవార్ తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఆయన ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.

2019 తర్వాత, అజిత్ పవార్ నేడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, తన స్థాయి పార్టీలో కాస్త తగ్గుతుందని గమనించి పునరుద్ధరించడానికి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆయనకు పార్టీ పదవి లేనప్పటికీ, శ్రీమతి సూలే మరియు పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్ జూన్ 10న వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ఎదిగారు.