CM పాదాలను తాకిన సూపర్ స్టార్ రజనీకాంత్

జైలర్ వంటి హిట్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాడు. ఇందులో భాగంగా రజనీ కాంత్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను కలిశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ వయసులో తనకంటే చిన్నవాడైన యోగి ఆధిత్యనాథ్ కాళ్ల మీద సూపర్ స్టార్ పడడంతో అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు సూపర్ స్టార్ ఇలా ఎందుకు చేశాడా అని అతని ఫ్యాన్స్ తో పాటు మామూలు నెటిజన్లు […]

Share:

జైలర్ వంటి హిట్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాడు. ఇందులో భాగంగా రజనీ కాంత్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ను కలిశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ వయసులో తనకంటే చిన్నవాడైన యోగి ఆధిత్యనాథ్ కాళ్ల మీద సూపర్ స్టార్ పడడంతో అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు సూపర్ స్టార్ ఇలా ఎందుకు చేశాడా అని అతని ఫ్యాన్స్ తో పాటు మామూలు నెటిజన్లు కూడా పలు ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు సందిస్తున్నారు. 

జైలర్ తో మరో సారి మార్కు చూపెట్టిన రజనీ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బడా హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది. ప్రతి సారి రజనీ సినిమా వస్తుందంటే చాలు కేవలం ఇండియాలో ఉన్న ఫ్యాన్స్ మాత్రమే కాకుండా విదేశాల్లోని ఫ్యాన్స్ కూడా చేసే హడావుడి మామూలుగా ఉండదు. కానీ కొన్ని రోజుల నుంచి వారందరినీ సూపర్ స్టార్ నిరాశపరుస్తూ వస్తున్నాడు. కానీ చాలా రోజుల తర్వాత జైలర్ వంటి మూవీతో తన సత్తా ఏంటో మరోమారు ఇండస్ట్రీకి చాటి చెప్పాడు. తనను సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో మరో మారు నేటి తరం ప్రేక్షకులకు ప్రూవ్ చేశాడు. చివరి సినిమా ప్లాప్ ఇచ్చిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి జైలర్ వంటి హిట్ మూవీని డెలివరీ చేసిన రజనీని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కంగ్రాట్యులేట్ చేస్తున్నారు. అతడిని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. 

సీఎంతో కలిసి సినిమా చూసిన సూపర్ స్టార్ 

జైలర్ మూవీ రిలీజ్ అయ్యేదాని ఒక రోజు ముందే ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లిన సూపర్ స్టార్ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో కలిసి మూవీని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రజనీ యాక్టింగ్ టాలెంట్ ఏంటో ఈ మూవీ చూస్తే తెలిసొచ్చిందని తెలిపారు. మూవీలో కంటెంట్ పెద్దగా లేకపోయినా కానీ రజనీ తన యాక్టింగ్ తో అందర్నీ మెస్మరైజ్ చేశాడని చెప్పుకొచ్చారు. సీఎంతో కలిసి మూవీని తిలకించిన అనంతరం రజనీకాంత్ సీఎం యోగి పాదాలకు నమస్కారం చేశారు. యోగి ఆధిత్యనాథ్ వయసులో రజనీ కంటే చిన్న వాడైనా కానీ రజనీకాంత్ ఆయన పాదాలకు నమస్కారం చేయడం ఏమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

అందుకోసమే ఆయన పాదాలను తాకారట… 

సీఎం యోగి వయసులో రజనీ కంటే చిన్న వాడైనా కానీ యోగి స్వతహాగా ఒక సన్యాసి. అంతే కాకుండా పెళ్లి వంటివి చేసుకోకుండా తన జీవితం మొత్తం హిందూ మతం కోసం అంకితం చేశారు. దీంతోనే రజనీ యోగి కాళ్లకు నమస్కారం చేశాడని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. రజనీ ఎలా అతని పాదాలకు నమస్కారం చేశాడో కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. జైలర్ మూవీ రిలీజ్ అయిన 10 రోజులు దాటుతున్నా కానీ కలెక్షన్లలో మాత్రం రికార్డులు తిరగరాస్తోంది. 10 రోజులు గడుస్తున్నా కానీ సాలిడ్ కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల రికార్డులను తిరగరాసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా సాధించినట్లు ట్రేడ్ వర్గాల టాక్. కలెక్షన్ల మాట అటుంచితే చాలా రోజుల నుంచి హిట్ అనే మాటనే వినని రజనీకాంత్ కు జైలర్ మూవీ హిట్ కావడం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రజనీ టైమ్ ఇక అయిపోయిందని కామెంట్ చేసిన వారందరికీ సూపర్ స్టార్ జైలర్ సక్సెస్ తో రిప్లై ఇచ్చాడు. తనలోని నటుడు ఇంకా అలాగే కసి మీద ఉన్నాడని సందేశం పంపాడు.