కేటీఆర్ పుట్టిన రోజునాడు సహాయ అభ్యర్థనలు

తెలంగాణ బిఆరెస్ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, బిఆరెస్ నేతలు, మరి ఎంతోమంది అభిమానులు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పేరు మీద ఎన్నో వివిధ సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సహాయం కోరుతూ అభ్యర్థనలు పంపించారు.  సన్ సిటీ యాక్సిడెంట్ బాధితులు:  అయితే కొద్ది రోజుల క్రితమే సన్ సిటీ లోని […]

Share:

తెలంగాణ బిఆరెస్ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, బిఆరెస్ నేతలు, మరి ఎంతోమంది అభిమానులు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పేరు మీద ఎన్నో వివిధ సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సహాయం కోరుతూ అభ్యర్థనలు పంపించారు. 

సన్ సిటీ యాక్సిడెంట్ బాధితులు: 

అయితే కొద్ది రోజుల క్రితమే సన్ సిటీ లోని ఒక ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. సన్ సిటీ లోని, మహమ్మద్ ఇంతఖబ్ ఖాన్ అనే వ్యక్తి, తన భార్య అలాగే తమ కూతురు ముగ్గురు కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా, అనుకోకుండా అటుగా వెళుతున్న కార్ అతివేగంగా వీరి మీదకి దూసుకుంటూ వచ్చి ముగ్గురిని ఢీకొట్టడం జరిగింది. భార్యా తన కూతురు అక్కడికక్కడే చనిపోగా, మహమ్మద్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మహమ్మద్. 

అయితే మహమ్మద్ తరపున అమిన రెహమాన్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ట్రీట్మెంట్ కోసం కావాల్సిన సహాయ సహకారాలు గురించి కేటీఆర్ కు అభ్యర్థించడం జరిగింది. జులై 24 వ తారీఖున కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ సన్ సిటీ లో జరిగిన యాక్సిడెంట్ విషయాన్ని గురించి ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా, సన్ సిటీ లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతం బాధితుడు ఐసియులో ఉన్నట్లు, ఆయన పూర్తి వివరాలు ఫోటో ద్వారా తెలియపరుస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. 

అయితే ప్రస్తుతం ట్విట్టర్లో, మహమ్మద్ బంధువు ద్వారా కేటీఆర్ కు చేసిన అభ్యర్థనకు ఇంకా రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ట్విట్టర్లో పోస్ట్ చేసిన అభ్యర్థనకు కొంత మంది నేటిజన్స్ కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మహమ్మద్ కి కావాల్సిన సహాయం కోసం కేటీఆర్ ను తమ వైపు నుంచి కూడా అభ్యర్థించడం జరిగింది. డాక్టర్ల ప్రకారం, ప్రస్తుతాన్ని మహమ్మద్ ఐసీయూలో ఉన్నట్లు అంతేకాకుండా ఇంకా చాలా కాలం తనకి ట్రీట్మెంట్ అవసరమైనట్లు తెలిపారు. 

మరిన్ని అభ్యర్థనలు: 

ఒకవైపు సన్ సిటీలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్ లో ఐసియు లో ఉన్న మహమ్మద్ కి సహాయం కోరినట్లుగానే, మరి కొంత మంది కూడా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సహాయం కోసం కేటీఆర్ ఆఫీసుకు అభ్యర్థనలు పంపించినట్లు తెలుస్తోంది. 

నిమ్స్(NIMS) హాస్పిటల్లో ప్రస్తుతం డయాలసిస్ తీసుకుంటూ క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఒక అబ్బాయి కోసం సహాయం కోరుతూ, సహాయ అభ్యర్థన ఆఫీసులో ఇవ్వడం జరిగింది. అయితే మరొక అభ్యర్థన యాదాద్రి బొంగిరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిన్నపిల్లవాడు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సహాయం కోరుతూ ఆఫీసుకు లెటర్ అందించారు. 

ప్రతి ఎటా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా, తెలంగాణలోని అనేక చోట్ల సేవా కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. కేటీఆర్ పేరు మీద ఎంతోమంది, ఆయన పుట్టినరోజు సందర్భంగా అవసరం అయిన వారికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. జులై 24న, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సాహసాలు చేస్తూ కేటీఆర్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తరువాత వారి ఇద్దరికీ కూడా ఆఫీస్ తరపునుంచి సహాయ సహకారాలు అందుతాయని కేటీఆర్ చెప్పడం జరిగింది.