వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా…

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. అందరూ వేసవి సెలవులకి ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేస్తారు. కానీ, విపరీతమైన హోటల్ ధరలు, విమాన ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ప్లాన్ వాయిదా వేసేస్తాము. మనకి నచ్చిన పర్యాటక ప్రాంతాలలో సాధారణంగా పీక్ సీజన్లలో హోటల్ ధరలు పెరుగుతాయి. ఈ వేసవి సీజన్‌లో మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, హోటల్ రూమ్స్ కోసం అయ్యే ఖర్చు మిమ్మల్ని భయపెడుతుంది. అయితే, సరైన […]

Share:

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. అందరూ వేసవి సెలవులకి ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేస్తారు. కానీ, విపరీతమైన హోటల్ ధరలు, విమాన ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ప్లాన్ వాయిదా వేసేస్తాము. మనకి నచ్చిన పర్యాటక ప్రాంతాలలో సాధారణంగా పీక్ సీజన్లలో హోటల్ ధరలు పెరుగుతాయి. ఈ వేసవి సీజన్‌లో మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, హోటల్ రూమ్స్ కోసం అయ్యే ఖర్చు మిమ్మల్ని భయపెడుతుంది. అయితే, సరైన ప్లానింగ్ ఉంటే మీరు మీ ట్రిప్ లో సులభంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

హోటల్ బుకింగ్‌లపై ఉండే మంచి డీల్స్ తెలుసుకోవడానికి, తద్వారా డబ్బు ఆదా చేసుకోవడానికి ఇక్కడ మీ కోసం కొన్ని చిట్కాలు.

ధరలను పోల్చండి:

మీరు హోటల్‌ను బుక్ చేసే ముందు, అదే లొకేషన్‌ లోని ఒకే రకమైన హోటల్‌ల ధరలను సరిపోల్చండి. ధరలను పోల్చడానికి మరొక మార్గం ట్రావెల్, హోటల్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో బ్రౌజ్ చేయడం. చాలా తరచుగా, వేరు వేరు వెబ్‌సైట్‌లలో ఒకే హోటల్ కి, లేదా ఒకే సర్వీస్ కి వేర్వేరు ధరలు కోట్ చేయబడతాయి. చాలా ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు డిస్కౌంట్‌లను అందిస్తాయి. లేదా.. కస్టమర్‌లకు తక్కువ ధర కోట్ చేయడానికి ఆయా హోటళ్ళతో పార్టనర్ గా ఉంటాయి.

నేరుగా హోటల్‌తో మాట్లాడండి:

ఆన్‌లైన్‌లోనే సులభంగా బుకింగ్‌లు చేసుకోగలిగేటప్పుడు హోటల్‌కి కాల్ చేయాల్సిన అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ, ఇది అవసరం ఎలాగంటే.. హోటల్ మేనేజర్ లేదా సిబ్బందితో మాట్లాడటం వలన మీకు మంచి తగ్గింపు లభిస్తుంది. కొన్ని చోట్ల హౌస్ బుకింగ్ కూడా ఉంటుంది. ఏదో ఒక వెబ్ సైట్ నుండి బుక్ చేస్తే మీకు అదనపు ఖర్చు కావచ్చు. అందువల్ల హోటల్ వాళ్ళతో నేరుగా మాట్లాడితే అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఏవైనా ప్యాకేజీ డీల్స్ ఉన్నాయేమో కోసం చూడండి:

మీరు హోటళ్ల కోసం, ట్రావెల్ కోసం, ఆహారం కోసం విడిగా ఖర్చు చేస్తే మీ ట్రిప్ ఖర్చు పెరుగుతుంది. దానికి బదులుగా, మీరు అన్నింటినీ కలిగి ఉండే హోటల్ బుక్ చేసుకుంటే చాలా ఖర్చు కలిసి వస్తుంది. అటువంటి హోటళ్లలో, లాడ్జింగ్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నామనిపిస్తుంది. కానీ లోకల్ ట్రావెల్, ఫుడ్ పై చేసే అదనపు ఖర్చులతో పోల్చినప్పుడు, ఇదే నయమని అనిపించవచ్చు.

ఏవైనా బ్యాంకు కార్డ్ డిస్కౌంట్‌లు ఉన్నాయేమో చూసుకోండి:

బుకింగ్ చేసేటప్పుడు మీరు ఒక్కో బ్యాంకు కార్డ్‌ని ఉపయోగిస్తే ఒక్కొక్క రకం డిస్కౌంట్లు వస్తాయి. ఇలా ఎన్నో బ్యాంకులు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఈ ఆఫర్‌లు సంవత్సరానికో, క్వార్టర్లీయో ఉంటాయి. క్రెడిట్ కార్డులపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. దీంతో పాటు, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించినప్పుడల్లా పాయింట్‌లు వస్తుంటాయి, వాటిని ట్రావెల్ బుకింగ్ లోను, ఇతర వెబ్‌ సైట్‌లలో రీడీమ్ చేసుకోవచ్చు.

ముందుగానే బుక్ చేసుకోండి:

మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పీక్ హాలిడే సీజన్‌లో ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నరోజు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నప్పుడు, ధరలు తక్కువగా ఉన్నప్పుడు ముందుగానే చూసుకొని బుక్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిదే.