మాజీ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్ఎన్ శుక్లాపై సిబిఐ అవినీతి కేసును నమోదు చేసింది

అలహాబాద్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఎస్‌ఎన్‌ శుక్లా, ఆయన భార్య సుచితా తివారీలపై వచ్చిన  అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఆయన పదవిలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాస్తులు కూడబెట్టినట్లు వారిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ శుక్లా 2014-19 మధ్యకాలంలో హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. తనకు తెలిసిన ఆదాయ వనరులకు అనుగుణంగా రూ.2.45 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. లక్నోలోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో […]

Share:

అలహాబాద్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఎస్‌ఎన్‌ శుక్లా, ఆయన భార్య సుచితా తివారీలపై వచ్చిన  అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఆయన పదవిలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాస్తులు కూడబెట్టినట్లు వారిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి.

జస్టిస్ శుక్లా 2014-19 మధ్యకాలంలో హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. తనకు తెలిసిన ఆదాయ వనరులకు అనుగుణంగా రూ.2.45 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి.

లక్నోలోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో శ్రీ ఎస్ ఎన్ శుక్లా ప్రభుత్వోద్యోగిగా ఉంటూ తన భార్య పేరుతో అవినీతి, అక్రమ మార్గాలతో అక్రమంగా ఆస్తులు సంపాదించు కున్నారని కేసు దర్యాప్తు సందర్భంగా ఆధారాలు లభించాయి. ప్రస్తుతం శ్రీ ఎస్ ఎన్. శుక్లా సుచితా తివారీ, శ్రీ సైదీన్ తివారీ మరి కొంతమందితో కలిసి నివసిస్తున్నారు. ఈమె శ్రీ ఎస్.ఎన్ శుక్లాకి రెండవ భార్య. ఈ కథనాల విడుదలకు సంబంధించి న్యూఢిల్లీలోని సిబీఐ కోర్టులో దాఖలు చేసిన కోర్టు దరఖాస్తులో శ్రీమతి సుచితా తివారీ ఈమేరకు తెలియజేశారు. శ్రీ సైదీన్ తివారీ కేశ్ కుమారి యొక్క సోదరుడు. కేశ్ కుమారి శ్రీ ఎస్.ఎన్. శుక్లా యొక్క మొదటి భార్య.” అని సిబీఐ తెలిపింది.

గతంలో 2021లో అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎస్‌ఎన్ శుక్లా తన ఆదేశాలలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై అవినీతి కేసులో సీబీఐ తన ఛార్జిషీట్ దాఖలు చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర) మరియు అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం డిసెంబర్ 2019లో జస్టిస్ శుక్లాపై ఇతర నిందితులతో ఏజెన్సీ కేసు నమోదు చేసింది.

“సుచితా తివారీ, సైదీన్ తివారీ పేరు మీద శుక్లా ఆస్తులను సంపాదించడానికి సంబంధించిన మూల సమాచారం ధృవీకరించబడింది. తివారీకి 2014లో శుక్లాతో పరిచయం ఏర్పడిందని, అంతకు ముందు ఆమెకు ఎలాంటి స్థిరాస్తులు లేవని తేలింది. సోదాల సమయంలో, తివారీ ఇంటి నుండి శుక్లా పేరిట ఇంకా ఆమెతో తివారీకి ఉమ్మడిగా ఉన్న రూ. 8 లక్షల ఎఫ్‌డిఆర్‌లతో సహా పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి, ”అని ఎఫ్‌ఐఆర్ లో దాఖలు చెయ్యబడింది.

ఎస్.ఎన్ శుక్లా యూపీలోని అమేథీలోని శివశక్తి ధామ్ ట్రస్ట్ ఖాతా నుంచి వివిధ ప్రయోజనాల కోసం నిధులను బదిలీ చేశారని సీబీఐ ఆరోపించింది. ఎస్ ఎన్ శుక్లా మొబైల్ ఫోన్ డేటా సైదీన్ తివారీ పేరిట ఆస్తులు సంపాదించడంలో శుక్లాకి, తివారీకి మధ్యనున్న సామీప్యతను వెల్లడించింది.

2012లో సైదీన్ తివారీ రూ.3.67 లక్షలకు కొనుగోలు చేసిన ఒక ప్లాట్‌ను 2014లో రూ.30 లక్షలకు విక్రయించారని, అతని పేరు మీద ఉన్న భూమి విక్రయ లావా దేవీల వివరాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా 2013లో రూ.3.15 లక్షలకు కొనుగోలు చేసిన మరో ప్లాట్‌ను 2017లో రూ.70 లక్షలకు విక్రయించారు. రెండు ప్లాట్లను లక్నోలోని షైన్ సిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ కు విక్రయించినట్లు సీబీఐ పేర్కొంది.