హఠాత్ మరణాలకు కారణాలు వెతకనున్న ICMR

కరోనా వచ్చిన సమయంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా భారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఇప్పటికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కరోనా నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రభుత్వం సిఫారసు చేసిన ఇంజక్షన్స్ మూడు డోసులు రూపంలో ప్రతి ఒక్కరూ వేసుకున్నారు. అంతా మామూలుగా మారింది. కానీ ఉన్నట్టుండి కరోనా వచ్చిన తరువాత కూడా చాలామంది హఠాత్తుగా మరణించడం గ‌మ‌నార్హంగా యువత ఎక్కువగా మరణిస్తున్నారు:  ఇటీవల కాలంలో ఎంతోమంది హఠాత్తుగా […]

Share:

కరోనా వచ్చిన సమయంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా భారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఇప్పటికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కరోనా నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రభుత్వం సిఫారసు చేసిన ఇంజక్షన్స్ మూడు డోసులు రూపంలో ప్రతి ఒక్కరూ వేసుకున్నారు. అంతా మామూలుగా మారింది. కానీ ఉన్నట్టుండి కరోనా వచ్చిన తరువాత కూడా చాలామంది హఠాత్తుగా మరణించడం గ‌మ‌నార్హంగా

యువత ఎక్కువగా మరణిస్తున్నారు: 

ఇటీవల కాలంలో ఎంతోమంది హఠాత్తుగా మరణించడం చాలామంది చూస్తున్నాం. కరోనా సోకిన పేషంట్లలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పటికి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండు అధ్యాయాలు చేయనుంది. ముఖ్యంగా యువత కోవిడ్ అనంతరం ఎందుకు హఠాత్ మరణాలకు గురవుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెర్చ్ లో భాగంగా ముఖ్య కారణాలు తెలుసుకుని మరిన్ని మరణాలను నిరోధించవచ్చు అని నివేదికలో పేర్కొంది ఐసిఎంఆర్.

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్, ముఖ్యంగా 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ (జిసిటిఎం) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి కారణాలు లేకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి, దాని గురించే ఈ అధ్యయనాలు అంటూ వెల్లడించారు.

రీసెర్చ్ జరగాల్సిందే: 

ఈ రీసెర్చ్ ముఖ్యంగా కోవిడ్ -19 వ్యాప్తి యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడతాయని, ఒకవేళ ఆధారాలు దొరికితే జరగబోయే పరిణామాలు ఆపవచ్చు అని ఇది సహాయపడతాయని ICMR డైరెక్టర్ చెప్పారు.

ICMR చెప్తున్న దాని ప్రకారం ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు, న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 50 శవపరీక్షలను అధ్యయనం చేసింది మరియు రాబోయే కొద్ది నెలల్లో, మరో 100 పరీక్షలు నిర్వహించబోతున్నట్లు చెప్పింది. 

ఈ అధ్యయనంలో భాగంగా చనిపోయిన వారి గురించే కాకుండా, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కేస్ కంట్రోల్ స్టడీస్‌కు పోలికల కోసం కంట్రోల్ టీం వంటి అవసరం ఉండొచ్చు. అందువల్ల, చనిపోయిన వారి పరిసరాలలో ఒకే విధమైన ప్రొఫైల్ ఉన్న వ్యక్తులను – ఒకే ప్రాంతంలో, ఒకే లింగం, వయస్సు మరియు నివాసం ఉన్నవారిని ఇంటర్వ్యూ చేస్తున్నామని ICMR డైరెక్టర్చె ప్పాడు,ఇది రిస్క్ ఫ్యాక్టర్ అసోసియేషన్‌ను కనిపెట్టడానికి ముఖ్యమైన రీసెర్చ్ అని కూడా చెప్పారు.

పరిశోధకులు ముఖ్యంగా ఇంటింటికి వెళ్తున్నారని, డాక్టర్ బహ్ల్ చెప్పారు. వ్యక్తులను వారి ఆహారం, పొగాకు వాడకం, జీవనశైలి, కోవిడ్ చరిత్ర, టీకా మరియు కుటుంబ వైద్య చరిత్రను అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తున్నాము అని ఆయన చెప్పారు.

కోవిడ్ బారిన పడిన తర్వాత మరణానికి దారితీసిన ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం  ఈ రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎపిడెమియాలజీ యొక్క సాంకేతికత, ఈ మరణాలు ఎందుకు సంభవించాయో తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు అంటూ ప్రస్తుతం జరగబోయే రీసెర్చ్ గురించి క్లుప్తంగా వివరించారు ICMR డైరెక్టర్.