స్టుపిడ్ అంటూ రిప్లై ఇచ్చిన డాక్ట‌ర్

ప్రస్తుతం ఒక పేషెంట్ అడిగిన ప్రశ్నకు ఓ డాక్ట‌ర్ ఇచ్చిన స‌మాధానం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ డాక్టర్ విపరీతంగా విమర్శలకు గురవుతున్నాడు. అయితే డాక్టర్ ఇచ్చిన రిప్లై సరైన పద్ధతిలో లేదు అంటూ, ఒక పేషెంట్ కి డాక్టర్ ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.. అయితే ఈ పోస్ట్ చదివిన చాలా మంది ఎందుకు డాక్టర్లకు ఇంత తల పొగరు అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.  పేషెంట్ […]

Share:

ప్రస్తుతం ఒక పేషెంట్ అడిగిన ప్రశ్నకు ఓ డాక్ట‌ర్ ఇచ్చిన స‌మాధానం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ డాక్టర్ విపరీతంగా విమర్శలకు గురవుతున్నాడు. అయితే డాక్టర్ ఇచ్చిన రిప్లై సరైన పద్ధతిలో లేదు అంటూ, ఒక పేషెంట్ కి డాక్టర్ ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.. అయితే ఈ పోస్ట్ చదివిన చాలా మంది ఎందుకు డాక్టర్లకు ఇంత తల పొగరు అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 

పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటి?: 

అయితే ఒక వ్యక్తి ఒక డాక్టర్ని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న సరైనదా కాదా అని పక్కన పెడితే, డాక్టర్ ఇచ్చిన సమాధానం తల తిక్కగా ఉంది అంటూ, చాలామంది ఫైర్ అవుతున్నారు. ఒక వ్యక్తి, లివర్ డాక్టర్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉన్న ఒక డాక్టర్ని, మద్యం తాగుతున్నప్పుడు పళ్ళు తినొచ్చా, అది హెల్త్ కి మంచిదేనా? అనే ప్రశ్న అడగడం జరిగింది.. అయితే ఈ ప్రశ్నకు డాక్టర్ సమాధానం’ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కూడా అడుగుతారా?’ అని మండిప‌డ్డారు.. అయితే వ్యక్తి అడిగిన ప్రశ్న ఎలాంటిదైనప్పటికీ ఒక లివర్ డాక్టర్ గా కరెక్ట్ సమాధానం ఇవ్వాలి కదా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 

ఇదొక పిచ్చి ప్రశ్న.. అంటూ రిప్లై ఇచ్చిన డాక్టర్ అక్కడితో ఆగకుండా, మరింత ముందుకు వెళ్లి, అసలు ఈ ప్రశ్న అడగడం తెలివి తక్కువ అవుతుంది. ఒకసారి ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు ఒకసారి ఆలోచించు. ఇలాంటి ప్రశ్నలు అహంకారంతోనే అడుగుతారు అంటూ, ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు ఇంకెప్పుడు అడగకు అంటూ, ఇప్పటికైనా నేర్చుకో, చేసిన తప్పుని సరిదిద్దుకో, ఇలాంటి తప్పులు మరి ఇంకెప్పుడూ చేయొద్దు అంటూ ఆ డాక్టర్ మరింత రాసి రిప్లై ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ట్విట్టర్ లో జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. 

ఒక డాక్టర్ అయ్యుండి, ఒక వ్యక్తి అడిగిన చిన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇలాగే నా ఇవ్వడం? అంటూ కొంతమంది అంటుంటే, అసలు డాక్టర్ బిహేవియర్ చూసి నిజంగా షాక్ అయ్యాను అంటూ, అసలు ఒక ప్రశ్న అడిగి, సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇలాంటి రిప్లైలు రావడం ఆశ్చర్యం అంటున్నారు మరి కొంతమంది. నిజానికి డాక్టర్లకి, టీచర్లకి, పొలిటిషన్ కి ఏదైనా ప్రశ్న అడిగితే ఇలాంటి తలతిక్క సమాధానాలు వస్తాయి తప్పిస్తే సమాధానం ఉండదు అంటూ, @acharjee_roy అని ట్విట్టర్ యూజర్, డాక్టర్ కి మరో వ్యక్తికి జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ ని ట్విట్టర్ లో పంచుకుంది. 

ఇందులో ఎవరు తప్పు కనిపిస్తుంది?: 

ట్విట్టర్ లో వైరల్ గా మారిన ఈ పోస్ట్ చదివిన చాలా మంది డాక్టర్ దే తప్పు అంటున్నారు. అయితే మరి ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న సరైనదేనా? ఆ వ్యక్తి డాక్టర్ కి కాకుండా మరొకరికి ఈ ప్రశ్న అడిగితే సమాధానం ఏ విధంగా వస్తుంది? నిజానికి మద్యం తాగడం అనేది తప్పు. మద్యంతో పాటు పళ్ళు కూడా తినొచ్చా అని అడగడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆ ప్రశ్న కరెక్టేనా? లేదంటే డాక్టర్ ఇచ్చిన సమాధానం తప్ప? మీరు ఏమనుకుంటున్నారు?