ఇకపై అలా చేయబోం: కేరళ మంత్రి

పన్నులు.. ఇవి కానీ లేకపోతే అసలు ప్రభుత్వాలకు నిధులే ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక విషయాల మీద పన్నులు విధిస్తూ ఉంటాయి. అలానే అవి తమ ఖజానాను నింపుకుంటాయి. పలు మార్లు పన్నుల వసూలు ఘోరంగా పెంచారంటూ విపక్షాలు విమర్శలు చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అందుకే పన్ను ఆదాయాలను వదులుకునేందుకు ఏ ప్రభుత్వాలు పెద్దగా ఇష్టపడవు. కానీ దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం […]

Share:

పన్నులు.. ఇవి కానీ లేకపోతే అసలు ప్రభుత్వాలకు నిధులే ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక విషయాల మీద పన్నులు విధిస్తూ ఉంటాయి. అలానే అవి తమ ఖజానాను నింపుకుంటాయి. పలు మార్లు పన్నుల వసూలు ఘోరంగా పెంచారంటూ విపక్షాలు విమర్శలు చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అందుకే పన్ను ఆదాయాలను వదులుకునేందుకు ఏ ప్రభుత్వాలు పెద్దగా ఇష్టపడవు. కానీ దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక అలా పన్నులు వసూలు చేయబోం

రాబోయే 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో, ఆస్తులపై పన్ను రేట్లను సవరిస్తామని, రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న ఇళ్లపై అదనపు పన్ను విధించాలని రాష్ట్రం పేర్కొంది. ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రతిపాదిత పన్ను నిర్ణయంపై ప్రత్యేకించి నివాసేతరుల నుంచి విస్తృతమైన విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. నాన్ రెసిడెంట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లపై ఎటువంటి పన్ను వసూలు చేయొద్దని గవర్నమెంట్ నిర్ణయించింది. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వ్యక్తులపై అదనపు ఇంటి పన్ను విధించే ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. బడ్జెట్ చర్చ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్.. ఇలా పన్ను విధించాలనేది కేవలం ప్రతిపాదన మాత్రమే అని, దానితో ముందుకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో ఆస్తులపై పన్ను రేట్లను సవరిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న ఇళ్లపై అదనపు పన్ను విధించాలని కూడా రాష్ట్రం పేర్కొందని తెలిపారు. ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రతిపాదిత పన్ను, ప్రత్యేకించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) నుండి విస్తృత విమర్శలకు దారితీయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

అందుకే వెనక్కి..

ఇలా ఖాళీ ఇళ్ళపై పన్ను విధించాలని రాష్ట్రం నిర్ణయం తీసుకోవడంతో అమెరికాలో ఇంకా వివిధ దేశాల్లో ఉండే ఎన్​ఆర్​ఐలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. దీంతో ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. ప్రవాస సంఘం వ్యక్తం చేసిన అభ్యంతరాలను మేము అర్థం చేసుకున్నామని, ఇంకా ఈ విషయంలో మాకు చాలా పిటిషన్లు కూడా వచ్చాయని మంత్రి తెలిపారు.

అది పూర్తిగా అవాస్తవం

రియల్ ఎస్టేట్ వ్యక్తులు చేసిన ఒత్తిళ్ల వల్లనే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందంటూ పలువురు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి తెలియజేశారు. కాంగ్రెస్ సభ్యుడు తిరువంచూర్ రాధాకృష్ణన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఇది నిజం కాదని.. చాలా మంది ఎన్నారైలు తమ ఆందోళనను నాతో కూడా పంచుకున్నారని పేర్కొన్నాడు. ఇది తక్కువ ఆదాయ వర్గాల్లోని ప్రవాసులను ప్రభావితం చేస్తుందని, వారు తనతో విన్నవించుకున్నట్లు తెలియజేశారు. అందువల్లే తమ ప్రభుత్వం పన్నుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని ఆయన తెలిపారు. ఇలా పన్నులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై బహ్రెయిన్‌లో స్థిరపడిన కె వి సాజిత్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయంతో మేము ఉపశమనం పొందామని, మా ఆందోళనను ప్రభుత్వం గుర్తించినందుకు మేము సంతోషిస్తున్నామని పేర్కొన్నాడు. ఇక మరో ఎన్నారై కురియన్ అబ్రహం మాట్లాడుతూ… బంగారు గుడ్లు పెట్టే బాతును ప్రభుత్వం చంపదని.. ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఆలోచించిందో ఎట్టకేలకు అర్థం చేసుకుందని అన్నాడు.

10 మిలియన్లలో 11 శాతం ఖాళీగానే

కేరళలో చాలా మంది అనేక దేశాలలో ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అక్కడి వారు ఎక్కువగా డెంటిస్టులుగా, నర్సులుగా వివిధ దేశాలలో లేదా మన దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉంటారు. కేరళలో, స్థానిక సంస్థలు సాధారణంగా ఆస్తి పన్నును రెండు విడతలుగా సేకరిస్తాయి.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర అధికారుల నివేదిక ఆధారంగా పన్ను ఉపశమన ధృవీకరణ పత్రాలను పొందిన తర్వాత ఖాళీగా ఉన్న ఇళ్ల యజమానులు వారికి దరఖాస్తును సమర్పించవచ్చు. అయితే గజిబిజి ప్రక్రియ చాలా మంది ఎన్నారైలు ఆస్తులను వదులుకునేలా చేస్తుంది. స్థానిక స్వీయ-ప్రభుత్వ శాఖ  లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 10 మిలియన్లకు పైగా ఇళ్లలో కనీసం 11 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇది జాతీయ సగటు 7.45 శాతం కంటే చాలా ఎక్కువ అని అక్కడి అధికారులు చెబుతున్నారు. స్థానిక స్వపరిపాలన విభాగం తాజా సమాచారం ప్రకారం కేరళ వ్యాప్తంగా 18 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 3న కేరళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి బాలగోపాల్ మాట్లాడతూ.. పన్ను సంస్కరణల నుంచి ప్రభుత్వం  1,000 కోట్లు ఆశిస్తోందని పేర్కొన్నారు. ఇది స్థానిక సంస్థలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.