‘ఇండియా’కి నాయకత్వం వహిస్తారా..?

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే మధ్య అసక్తికర చర్చ జరిగింది. దుబాయ్‌ ఎయిర్‌‌పోర్ట్‌ వీరి చర్చకు వేదిక అయింది. వివరాల్లోకి వెళితే, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం స్పెయిన్‌కు వెళ్తున్న మమతా బెనర్జీ బుధవారం దుబాయ్‌ విమానాశ్రయంలో రణిల్‌ విక్రమ సింఘేతో సమావేశమయ్యారు. మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరిన మమత దుబాయ్‌లో ఆగారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో మమతను చూసిన శ్రీలంక అధ్యక్షుడు […]

Share:

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే మధ్య అసక్తికర చర్చ జరిగింది. దుబాయ్‌ ఎయిర్‌‌పోర్ట్‌ వీరి చర్చకు వేదిక అయింది. వివరాల్లోకి వెళితే, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం స్పెయిన్‌కు వెళ్తున్న మమతా బెనర్జీ బుధవారం దుబాయ్‌ విమానాశ్రయంలో రణిల్‌ విక్రమ సింఘేతో సమావేశమయ్యారు. మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరిన మమత దుబాయ్‌లో ఆగారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్‌లో మమతను చూసిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే ఆమె దగ్గరకు పలకరించారు. 

ఈ సందర్భంగా రణిల్‌ మమతతో మాట్లాడుతూ, ‘‘నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా” అని కోరగా, దానికి మమత సరేనన్నారు. దీంతో రణిల్‌, ‘‘ మీరు ప్రతిపక్ష కూటమి (ఇండియా)కి నాయకత్వం వహిస్తారా” అని అడిగారు. 

 ‘‘ఓ మై గుడ్‌నెస్‌..” అంటూ మమత నవ్వుతూ, ‘‘ఇది ప్రజల అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు మాకు మద్దతు ఇస్తే, రేపు మనం అధికారంలో ఉండగలం” అని అన్నారు.

కోల్‌కతాకు రండి..

కోల్‌కతా వేదికగా నవంబర్‌‌లో జరిగే వాణిజ్య సదస్సు ఈ సందర్భంగా సింఘేను ఆహ్వానించినట్లు మమత తెలిపారు. తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా సింఘే తనను ఆహ్వానించారని మమత ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. అలాగే, విక్రమ సింఘేతో కలిసి దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మమతకు సింఘే పెయింటింగ్‌ బహూకరించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెట్టుబడుల నిమిత్తమై మమతా బెనర్జీ 12 రోజుల పాటు దుబాయ్‌, స్పెయిన్‌లలో పర్యటించనున్నారు. 

మరోవైపు, ప్రతిపక్ష ఫ్రంట్‌ ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌) ప్రస్తుతం కలెక్టివ్‌ నాయకత్వంతో నడుస్తోంది. ప్రధాన మంత్రి నరేద్ర మోదీని ఎదుర్కోవడానికి ఇండియా కూటమికి ఎవరూ ప్రాతినిధ్యం వహిస్తారనేది చాలా మందిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. 

కాగా, ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులైన వారు చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు పిలిస్తే తీసుకోవచ్చని ఫ్రంట్‌ నేతలు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ఓడిచేందుకు ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు. కాంగ్రెస్‌ నాయకత్వంలో 2004లో యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్ ఏర్పడింది. ఈ కూటమి రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా,అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం కోసం వివక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు. దేశ వ్యాప్తంగా ఈ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి.   

ఈ కూటమికి ‘ఇండియా’ అనే పేరే సరైంది అని ఆర్జేడీ ట్విట్టర్‌‌లో పేర్కొంది. 2024 ఎన్నికలు టీమ్‌ ఇండియాకు, టీమ్‌ ఎన్డీయేకు మధ్య జరగబోతున్నాయి అని శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. 

కాగా, ఈ కూటమి ఇప్పటికే మూడు సార్లు సమావేశమైంది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. మరోవైపు 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈ బుధవారం ఎన్సీపీ నేత శదర్‌‌ పవార్‌‌ నివాసంలో సమావేశం అయింది. అయితే, కూటమి నిర్వహణకు బలమైన అభ్యర్థికి ఎన్నుకోవడం సవాల్‌గా మారింది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన కూటమి నాయకత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాయకుడిని ఎన్నుకునే పనిలో కూటమి సభ్యులు స్పీడప్‌ చేయలేదు. 

అక్టోబర్‌‌లో కూటమి తొలి బహిరంగ సభ..

‘ఇండియా’ కూటమి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబర్‌‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో తమ మొదటి బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సభ ఉండనుందని 12 మంది కూటమి సభ్యుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.