సీమా హైద‌ర్ వ‌ల్ల స‌చిన్ కుటుంబానికి తిప్ప‌లు

భారత దేశంలోకి ఎటువంటి లీగల్ పర్మిషన్స్ లేకుండా, పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైద‌ర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు ఉత్తర ప్రదేశ్ లో ఒక కొత్త ఇంట్లోకి మారారు. అయితే అప్పటి నుంచి ఉద్యోగం లేక సరైన తిండి లేక కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీమా మాట్లాడుతూ, తను రావడం వల్లే ఇప్పుడు తన భర్త కుటుంబం ఇబ్బందులు పడుతుందని, బయటికి వెళ్లి ఉద్యోగం చేసే స్వేచ్ఛ కూడా దొరకట్లేదు అని […]

Share:

భారత దేశంలోకి ఎటువంటి లీగల్ పర్మిషన్స్ లేకుండా, పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైద‌ర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు ఉత్తర ప్రదేశ్ లో ఒక కొత్త ఇంట్లోకి మారారు. అయితే అప్పటి నుంచి ఉద్యోగం లేక సరైన తిండి లేక కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీమా మాట్లాడుతూ, తను రావడం వల్లే ఇప్పుడు తన భర్త కుటుంబం ఇబ్బందులు పడుతుందని, బయటికి వెళ్లి ఉద్యోగం చేసే స్వేచ్ఛ కూడా దొరకట్లేదు అని వాపోతోంది. 

పోలీసుల నిఘ: 

సీమ ఎప్పుడైతే సచిన్ మీనా ను పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచి వారికి పోలీసుల నుంచి అదే విధంగా విలేకరుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన వల్లే ఇప్పుడు తన భర్త కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు బాధపడుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది సీమ. నిజంగా తన వల్ల సచిన్ ఫ్యామిలీ ఇబ్బందులపాలు అవడం తనకి నచ్చట్లేదు అని వాపోతోంది. 

గతవారం నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తికి సంబంధించిన స్వరాజ్, సీమ-సచిన్ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం జరిగింది. అయితే సీమ అలాగే సచిన్ కొత్త ఇంట్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన గమనించినట్లు చెప్పారు. అంతేకాకుండా వారు బయటికి వెళ్ళలేనంత ఇబ్బంది పడుతున్నట్లు ఎక్కడ చూసినా విలేకరులు, మీడియా వాళ్ళు ఇంటిని చుట్టుముట్టినట్టు చెప్పారు. కనీసం బయటికి వెళ్లి సరుకులు కొనుక్కునే అవకాశాన్ని కూడా ఇవ్వట్లేనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సీమ అలాగే సచిన్ కుటుంబంలో ఎవరు బయటకు వెళ్లినా సరే పోలీసు వారు నిఘ మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పారు. 

అయితే అందుకే సచిన్ తండ్రి ద్వారా లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఉత్తరం రాయమని, వారి ఇంటికి వచ్చిన స్వరాజ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రూబాపూరి పోలీసులకు ఇన్ఫామ్ చేసిన తర్వాత సచిన్ అలాగే తన తండ్రి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతం రుబాపూర గ్రామంలో నివసిస్తున్న సీమ అలాగే తన భర్త కుటుంబానికి ఆ గ్రామం వారి మద్దతు ఎంతగానో ఉన్నట్లు ఆయన ఉత్తరంలో వెల్లడించారు. 

సీమ-సచిన్ ప్రేమ కథ: 

పాకిస్తాన్ కి చెందిన మహిళ సీమ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి సచిన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి ద్వారా పరిచయమే ఆ ఫేమను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు. 

అయితే సీమనీ మహిళను, ఆహ్వానించిన ఆ యువకుడు తన అద్దె ఇంట్లోనే ఉంచినట్లు సమాచారం. నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సాద్ మియా ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ, సీమ అదే విధంగా తన నలుగురు పిల్లలతో సహా తనకి ఆశ్రయం ఇచ్చిన ఆ యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. విడుదలైన తర్వాత కూడా సిమా మీద ఎన్నో వదంతులు వెళ్ళవడ్డాయి. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చిన గూడచారి అని, పోలీసులు ఆమె మీద, సచిన్ కుటుంబం మీద నిఘ పెట్టారు.

అంతేకాకుండా వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. ప్రస్తుతం సీమ మరియు సచిన్ పెళ్లి బంధంతో ఒకటై, ప్రస్తుతం యూపీ లోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.